రాజస్థాన్ లోని బాడ్ మేర్-జోధ్ పుర్ హైవే లో ఒక బస్సు-ట్యాంకరు ఢీకొన్నందువల్ల ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని చెల్లించేందుకు కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం అనేక ట్వీట్ లలో -
‘‘రాజస్థాన్ లోని బాడ్ మేర్-జోధ్ పుర్ హైవే లో ఒక బస్సు-ట్యాంకరు ఢీకొన్నందువల్ల ప్రాణ నష్టం జరగడం దుఃఖదాయం. ఈ విషాదకర ఘడియ లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు నేను సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
ఈ ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అంటూ నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi
రాజస్థాన్ లోని బాడ్ మేర్-జోధ్ పుర్ హైవే లో జరిగిన ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఘటన లో గాయపడిన వారికి ప్రతి ఒక్కరి కి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the accident at the Barmer-Jodhpur Highway in Rajasthan. The injured would be given Rs. 50,000 each: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 10, 2021