పూంఛ్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇస్తున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -
‘‘పూంఛ్ లో ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరగడం దుఃఖదాయకం గా ఉంది. ప్రియతముల ను కోల్పోయిన వారికి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆశపడుతున్నాను. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల వంతున, అలాగే గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొన్నది.
The loss of lives due to an accident in Poonch is saddening. My thoughts are with all those who lost their loved ones. Wishing the injured a speedy recovery. Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased and Rs. 50,000 would be given to the injured: PM
— PMO India (@PMOIndia) September 14, 2022