మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షలు, రూ.50వేల వంతున పరిహారం ప్రకటించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:
“ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సంభవించిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్నెంతో బాధించింది. ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు ఈ విషాద సమయంలో నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ నేపథ్యంలో ‘పిఎంఎన్‌ఆర్‌ఎఫ్’ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందజేయబడుతుంది: PM @narendramodi” అని పేర్కొంది.
Pained by the loss of lives due to an accident in Chhatrapati Sambhajinagar district. My thoughts are with those who lost their loved ones. I wish the injured a speedy recovery. An ex-grata of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured…
— PMO India (@PMOIndia) October 15, 2023