మాజీ ఎం.పి. శ్రీ సి. జంగారెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేస్తూ,
"సి.జంగారెడ్డి గారు తమ జీవితాన్ని ప్రజాజీవితానికి అంకితం చేశారు. జనసంఘ్, బిజెపిలను నూతన శిఖరాలకుచేర్చే కృషిలో వారు అంతర్భాగంగా ఉంటూవచ్చారు.ఎంతో మంది ప్రజల హృదయాలు, ఆలోచనలలో వారు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వారు ఎందరో కార్యకర్తలకు ప్రేరణనిచ్చారు. వారి మృతి బాధ కలిగించింది.
పార్టీ అత్యంత క్లిష్టదశలో ఉన్నప్పుడు వారు బిజెపికి బలమైన గొంతుకగా ఉన్నారు. వారి కుమారుడితో మాట్లాడి వారి కుటుంబానికి సంతాపం తెలిపాను. ఓం శాంతి ." అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
Shri C Janga Reddy Garu was an effective voice for the BJP at a very critical phase of the Party’s trajectory. Spoke to his son and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
Shri C Janga Reddy Garu devoted his life to public service. He was an integral part of the efforts to take the Jana Sangh and BJP to new heights of success. He made a place in the hearts and minds of several people. He also motivated many Karyakartas. Saddened by his demise.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
శ్రీ సి జంగా రెడ్డి గారు భాజపా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారు. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగింది. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
శ్రీ సి . జంగా రెడ్డి గారు ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు . జన సంఘ్ నూ , బి జె పి నూ ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు . ఎంతో మంది ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకున్నారు . ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తి నిచ్చారు . ఆయన మరణం పట్ల చింతిస్తున్నాను .
— Narendra Modi (@narendramodi) February 5, 2022