పీలీభీత్ లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్రంగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని పీలీభీత్ లో జరిగిన రహదారి ప్రమాదం హృదయ విదారకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు నేను నా శోకాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. దీనితో పాటుగా క్షతగాత్రులందరు త్వరిత గతి న స్వస్థులు కావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొంది.
उत्तर प्रदेश के पीलीभीत में हुई सड़क दुर्घटना हृदयविदारक है। इसमें जिन लोगों ने अपने प्रियजनों को खोया है, उनके प्रति मैं अपनी शोक-संवेदना व्यक्त करता हूं। इसके साथ ही सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 23, 2022