కిశ్త్ వాడ్ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వారికి ఏభై వేల రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారం గా ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘కిశ్త్ వాడ్ లో జరిగిన దుర్ఘటన దు:ఖం కలిగించింది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు అతి త్వరలో పున:స్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారం గా ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు ఏభై వేల రూపాయల వంతున పరిహారం గా ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
Saddened by the accident in Kishtwar. My thoughts are with the bereaved families. May the injured recover at earliest. Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 31, 2022