మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది బాలలు ప్రాణాలను కోల్పోయారు; ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘటన పట్ల ఆదివారం (2024 ఆగస్టు 4న) సంతాపాన్ని తెలియజేశారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన బాలల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. చిన్నారులను కోల్పోయి, శోకసంద్రంలో మునిగిన కుటుంబాల మనోనిబ్బరం కోసం ఆయన ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో :
‘‘మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో జరిగిన దుర్ఘటన కారణంగా ప్రాణాలను కోల్పోయిన బాలల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’
‘‘మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో గోడ కూలి పడినందువల్ల జరిగిన దుర్ఘటన హృదయ విదారకంగా ఉంది. ఈ దుర్ఘటనలో తమ బాలలను కోల్పోయి శోకంలో మునిగిపోయిన కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ వేదనను ఓర్చుకొనే శక్తిని వారికి ఆ ఈశ్వరుడు ప్రసాదించుగాక. దీనితో పాటు గాయపడ్డ వ్యక్తులంతా త్వరితగతిన కోలుకోవాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు.
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the mishap in Sagar, Madhya Pradesh. The injured would be given Rs. 50,000. https://t.co/h3dkZh5Lrp
— PMO India (@PMOIndia) August 4, 2024