జాపాన్ లోని వాకాయామా లో ఒక సార్వత్రిక కార్యక్రమం సందర్భం లో జరిగిన హింసాత్మక ఘటన ను ఖండించిన ప్రధాన మంత్రి
పిఐబి, దిల్లీ ద్వారా 2023 ఏప్రిల్ 15 వ తేదీ న మధ్యాహ్నం 2 గంట ల 50 నిమిషాల కు పోస్ట్ చేయడమైంది
జాపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫుమియొ కిశిదా జాపాన్ లోని వాకాయామా లో జరిగిన ఒక సార్వత్రిక కార్యక్రమం లో పాలుపంచుకోగా, ఆ సందర్భం లో అక్కడ ఓ హింసాత్మక ఘటన చోటుచేసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జాపాన్ లోని వాకయామా లో ఒక సార్వత్రిక కార్యక్రమం లో జరిగిన హింసాత్మక సంఘటన గురించి తెలిసింది. ఆ కార్యక్రమం లో నా మిత్రుడు ప్రధాని శ్రీ @Kishida230 పాలుపంచుకొన్నారు. హమ్మయ్య! ఆయన సురక్షితం గా ఉన్నారు. ఆయన నిరంతరం కులాసా గాను, మంచి ఆరోగ్యం తోను ఉండేటట్టు చూడాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. భారతదేశం హింస తాలూకు అన్ని చేష్టల ను ఎప్పటికీ ఖండిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
Learnt of a violent incident at a public event at Wakayama in Japan where my friend PM @Kishida230 was present. Relieved that he is safe. Praying for his continued well-being and good health. India condemns all acts of violence.
— Narendra Modi (@narendramodi) April 15, 2023