సెంట్ విన్సెంట్ ఎండ్ దీ గ్రెనాడీన్స్ ప్రధాని శ్రీ రాల్ఫ్ గన్ సాల్వెస్ పై జరిగిన భయంకర దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఆయన త్వరగా కోలుకొని, మళ్లీ చక్కని ఆరోగ్యవంతుడు కావాలంటూ ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘సెంట్ విన్సెంట్ అండ్ దీ గ్రెనాడీన్స్ ప్రధాని శ్రీ రాల్ఫ్ గన్ సాల్వెస్ పై జరిగిన భయంకర దాడి ని నేను ఖండిస్తున్నాను. ఎక్స్ లెన్సీ, మీరు త్వరిత గతి న కోలుకొని మళ్లీ చక్కని ఆరోగ్యవంతులు కావాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. సముద్ర సంబంధి భద్రత పై నేడు జరుగనున్న ఐక్య రాజ్య సమితి భద్రత మండలి (యూఎన్ఎస్ సి) బహిరంగ చర్చ కార్యక్రమం లో మీరు పాలుపంచుకోలేకపోతూ ఉండడం మాకు బాధ ను కలిగించేదే. @ComradeRalph’’ అని పేర్కొన్నారు.
I condemn the ghastly attack on Prime Minister Ralph Gonsalves of St. Vincent and the Grenadines. Excellency, I wish you quick recovery and good health. We will miss your presence at the UNSC Open Debate on Maritime Security today. @ComradeRalph
— Narendra Modi (@narendramodi) August 9, 2021