నూతన ఆవిష్కరణ లో సదా అగ్రగామిగా ఉంటున్నందుకు మరియు వైద్య చికిత్స జగతి లో కొత్త మార్పుల ను అనుసరిస్తున్నందుకు వైద్యుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. నడవడం లో ఇబ్బందుల ను ఎదుర్కొంటున్న ఒక రోగి కి చెందిన మోకాలు కీళ్ళు నాలుగింటి మార్పిడి సంబంధి శస్త్ర చికిత్స ను ఎఐఐఎమ్ఎస్ భువనేశ్వర్ విజయవంతం గా నిర్వహించింది. ఇది ఒడిశా లో ఈ తరహా ఒకటో శస్త్ర చికిత్స యే కాకుండా, ప్రపంచ స్థాయి లో చూసినప్పుడు ఇటువంటి రెండో కేసు గా కూడాను ఉంది.
ఎఐఐఎమ్ఎస్ భువనేశ్వర్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –
‘‘నూతన ఆవిష్కరణ లో ఎప్పుడూ అందరికంటే ముందు ఉంటున్నందుకు మరియు వైద్య చికిత్స జగతి లో కొత్త కొత్త మార్పుల ను అవలంబిస్తున్నందుకు మన వైద్యుల కు ఇవే అభినందన లు. వారి ప్రావీణ్యం మనలను గర్వపడేటట్టు చేస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
Compliments to our doctors for always being at the forefront of innovation and embracing new changes in the medical world. Their dexterity makes us proud! https://t.co/TsCaHhAxJP
— Narendra Modi (@narendramodi) February 13, 2023