సిఆర్‌పిఎఫ్ 84వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లోగల ‘సిఆర్‌పిఎఫ్’ శిబిరంలో సిబ్బంది కవాతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జవాన్లు ఎంతో శక్తిమంతంగా, ఆకట్టుకునే రీతిలో కవాతు నిర్వహించారని ఆయన అభినందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో తొలిసారి ఈ ఆవిర్భావ దినోత్సవ వవాతు నిర్వహించారు.
దీనిపై ‘సిఆర్‌పిఎఫ్’ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ప్రధాని పంపిన సందేశంలో:
“సీఆర్పీఎఫ్ @crpfindia సిబ్బంది కవాతు అద్భుతం. ఈ విశిష్ట బలగాలకు నా అభినందనలు” అని పేర్కొన్నారు.
Wonderful gesture by @crpfindia. Compliments to this distinguished force. https://t.co/mRoYOBiMqC
— Narendra Modi (@narendramodi) March 26, 2023