అరుణాచల్ ప్రదేశ్‌లో జల్‌జీవన్ మిషన్ అమలులో భాగంగా 75 శాతానికిపైగా ప్రజలకు.. అంటే- 1.73 గ్రామీణ కుటుంబాలకు తాగునీరు సరఫరా కావడపై రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పెమాఖండూ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“అమృత మహోత్సవాల సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని 75 శాతానికిపైగా కుటుంబాలకు తాగునీటి సరఫరా కల సాకారం కావడం అభినందనీయం. అందునా దుర్గమ ప్రాంతాలు అధికంగాగల రాష్ట్రంలో ఈ విజయం సాధించిన అరుణాచల్ జట్టును ప్రశంసిస్తూ, మిగిలిన 25 శాతం లక్ష్యాన్ని సత్వరం పూర్తిచేయగలదని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
75% coverage in the time of Amrit Mahotsav is commendable, keeping in mind the difficult terrain in parts of Arunachal Pradesh. Compliments to the team delivering this and best wishes to complete the remaining part. https://t.co/O1vR3ew1Wp
— Narendra Modi (@narendramodi) April 2, 2023