ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు దీనివల్ల ఎనలేని ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.
దీనిపై బస్తీ పార్లమెంటు సభ్యుడు శ్రీ హరీష్ ద్వివేది ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఇదొక గొప్ప ప్రయత్నం! వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బస్తీ జిల్లా కేంద్రంలో ఏర్పాటైన ఈ డిజిటల్ గ్రంథాలయం ఎంతగానో ఉపకరిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
शानदार पहल! युवाओं और प्रतियोगी परीक्षाओं में शामिल होने वालों के लिए बस्ती की यह डिजिटल लाइब्रेरी बहुत फायदेमंद साबित होने वाली है। https://t.co/CwCcQ2o7M0
— Narendra Modi (@narendramodi) June 9, 2023