ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం లో ఈ రోజు న జరిగిన మొదటి ‘ప్రగతి’ సమావేశాని కి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి పాలుపంచుకొన్న ముప్పై రెండో ముఖాముఖి సమావేశం ఇది.
నేటి ‘ప్రగతి’ సమావేశం లో భాగం గా ప్రధాన మంత్రి మొత్తం పదకొండు అంశాల ను చర్చించారు. వాటి లో తొమ్మిది అంశాలు జాప్యం జరిగిన పథకాల కు సంబంధించినవి. ఈ తొమ్మిది పథకాల విలువ 24,000 కోట్ల రూపాయల కు పైనే. ఈ పథకాలు తొమ్మిది రాష్ట్రాలు.. ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఝార్ ఖండ్, బిహార్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, ఉత్తర్ ప్రదేశ్.. లో విస్తరించివున్నాయి. అంతే కాదు వీటి తో మూడు కేంద్ర మంత్రిత్వ శాఖల కు కూడా సంబంధం ఉంది. వీటి లో రైల్వేల మంత్రిత్వ శాఖ కు చెందినవి మూడు, రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖకు చెందిన అయిదు పథకాలకు తోడు పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కు చెందిన ఒక పథకం కూడా ఉంది.
బీమా పథకాలు- పిఎంజెజెబివై, ఇంకా పిఎంఎస్‌బివై ల పురోగతి ని సమీక్షించడమైంది
ఈ సమావేశం లో ఆర్థిక సేవల విభాగం పరిధి లోని బీమా పథకాలైన.. ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ (పిఎంజెజెబివై) మరియు ‘ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన’ (పిఎంఎస్‌బివై) లకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల స్పందన ను ప్రధాన మంత్రి సమీక్షించారు.
ఇ- గవర్నెన్స్ ద్వారా సమర్ధమైన పోలీసింగ్ కు సంబంధించిన సమగ్ర మరియు సమీకృత వ్యవస్థ ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ ఎండ్ సిస్టమ్స్’ (సిసిటిఎన్ఎస్) ప్రాజెక్టు ఏ విధం గా పురోగమిస్తోందో ప్రధాన మంత్రి సమీక్షించారు.
మునుపటి ముప్పై ఒక్క ‘ప్రగతి’ సమావేశాల లో ప్రధాన మంత్రి మొత్తం 12.30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తో కూడిన 269 పథకాల పైన సమీక్ష నిర్వహించారు. అదే విధం గా 17 వేరు వేరు రంగాల కు చెందిన ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాలు నలభైఏడిటి కి సంబంధించిన ఫిర్యాదుల ను పరిష్కరించిన తీరు ను కూడా ఆయన సమీక్షించారు.