యమునానదిని శుభ్రపరచడం, పునరుద్ధరించడంతోపాటు ఢిల్లీలో తాగునీటికి సంబంధించిన అంశాలపై గురువారం నిర్వహించిన ఒక సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఢిల్లీ ప్రజలకు ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించడానికి, వారికి ‘జీవన సౌలభ్యాన్ని’ అందించడానికి  కేంద్రం ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘యమునానది శుద్ధి, పునరుద్ధరణ పనుల అంశంపైన, ఢిల్లీలో తాగునీటికి సంబంధించిన అంశాలపైన గురువారం నిర్వహించిన ఒక సమావేశానికి నేను అధ్యక్షత వహించాను.  ఢిల్లీలో నా సోదర, సోదరీమణులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతోపాటు ‘జీవించడంలో సౌలభ్యాన్ని’ మెరుగుపరచడానికి ఢిల్లీ ప్రభుత్వంతో  కేంద్రం కలిసి పనిచేస్తుంద’’ని పేర్కొన్నారు.