దేశమంతటా ఆక్సీజన్ ఉత్పత్తి ని పెంచడం గురించి, ఆక్సీజన్ లభ్యత లో పురోగతి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు.
దేశవ్యాప్తం గా పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు ల ను నెలకొల్పడం లో ప్రగతి ని గురించిన సమాచారాన్ని అధికారులు ప్రధాన మంత్రి కి తెలియజేశారు. దేశం లో 1500 కు పైగా పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు లు ఏర్పాటు అవుతుండగా, వాటి లో పిఎమ్ కేర్స్ తోడ్పాటు తో స్థాపిస్తున్న ప్లాంటుల తో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, పిఎస్ యుల తోడ్పాటు తో స్థాపిస్తున్న ప్లాంటు లు కలసి ఉన్నాయి.
పిఎమ్ కేర్స్ తోడ్పాటు తో స్థాపిస్తున్న పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు లు దేశం లోని అన్ని రాష్ట్రాల లోను, జిల్లాల లోను ఏర్పాటు అవుతున్నాయి. పిఎమ్ కేర్స్ తోడ్పాటు తో స్థాపిస్తున్న అన్ని పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు లు ఒకసారి ప్రారంభం అయ్యాయి అంటే గనక అప్పుడు అవి 4 లక్షల కు పైచిలుకు ఆక్సీజన్ సహిత పడకల కు ఊతాన్ని అందించగలవు.
ఈ ప్లాంటు లు వీలయినంత త్వరలో పనిచేసేటట్టు చూడాలని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాల తో కలసి పనిచేయవలసిందని అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశించారు. ఆక్సీజన్ ప్లాంటుల ను సాధ్యమైనంత తొందరలో పని చేయించేటట్టు చూసేందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల తో క్రమం తప్పక సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు ప్రధాన మంత్రి కి తెలియజేశారు.
ఆక్సీజన్ ప్లాంటుల ను నడపడం, ఆ ప్లాంటుల ను నిర్వహించడం లో ఆసుపత్రి సిబ్బంది కి తగినంత శిక్షణ లభించేలా చూడండంటూ అధికారుల కు ప్రధాన మంత్రి సూచించారు. ప్రతి జిల్లా లో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేటట్టు చూడవలసిందని కూడా అధికారుల ను ఆయన ఆదేశించారు. నిపుణుల ద్వారా ఒక శిక్షణ మాడ్యూల్ ను రూపొందించడం జరిగిందని, తాము దేశం లో సుమారు 8000 మంది కి శిక్షణ ను ఇవ్వాలి అని లక్ష్యం గా పెట్టుకొన్నట్లు అధికారులు ప్రధాన మంత్రి కి తెలిపారు.
స్థానికంగాను, జాతీయ స్థాయి లోను ఈ ఆక్సీజన్ ప్లాంటుల పని తీరు ను గమనిస్తూ ఉండటానికి ఐఒటి వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
మనం నియోగించాలి అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ఆక్సీజన్ ప్లాంటు ల పనితీరు ను పర్యవేక్షించేందుకు ఐఒటి ని ఉపయోగిస్తున్న ఒక పైలట్ కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఆయన కు వివరించారు.
ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, ఆరోగ్య కార్యదర్శి, ఎమ్ఒహెచ్ యుఎ కార్యదర్శి, ఇతర ప్రముఖ అధికారులు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.
Reviewed oxygen augmentation progress across the nation. Was briefed on installation of PSA Oxygen plants and using technology to track their performance. https://t.co/Z1NBGdKnLQ
— Narendra Modi (@narendramodi) July 9, 2021