‘బిపర్ జాయ్’ చక్రవాతాన్ని దృష్టి లో పెట్టుకొని తల ఎత్తగల స్థితి ని ఎదుర్కోవడాని కి కేంద్రం తో పాటు గుజరాత్ లో మంత్రిత్వ శాఖలు /ఏజెన్సీల సన్నాహాల ను సమీక్షించడం కోసం ఈ రోజు న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
అపాయం బారిన పడే ప్రమాదం పొంచి ఉన్న స్థానాల లో కాపురం ఉంటున్న వారి ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సురక్షిత ప్రదేశాల కు చేర్చడం జరగాలని, అలాగే విద్యుత్తు, టెలి కమ్యూనికేశన్స్, ఆరోగ్యం, త్రాగునీరు మొదలైన అవసరమైన అన్ని సేవల ను తగిన జాగ్రతల తో సంబాళించడానికి పూచీ పడాలని సీనియర్ అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశాలు ఇచ్చారు. వాటికి ఏవైనా నష్టాలు వాటిల్లినట్లయితే గనక ఆయా సేవల ను తక్షణం పునరుద్ధరించాలి అని ఆయన పేర్కొన్నారు. పశువుల సురక్షత విషయం లో కూడాను పూచీ పడవలసింది గా ప్రధాన మంత్రి ఆదేశాల ను ఇచ్చారు. కంట్రోల్ రూములను 24 గంటలు క్రియాత్మకం గా ఉండాలి అని ఆయన ఆదేశించారు.
సమావేశం సాగిన క్రమం లో, భారతదేశం వాతావరణ అధ్యయన విభాగం (ఐఎమ్ డి) ‘బిపర్ జాయ్’ చక్రవాతం జూన్ 15 వ తేదీ నాడు మధ్యాహ్నాని కల్లా గుజరాత్ లోని జఖామూ నౌకాశ్రయం సమీపం లో మాండవి మరియు పాకిస్తాన్ లోని కరాచీ ల మధ్య సౌరాష్ట్ర, ఇంకా కచ్ఛ్ లను దాటేందుకు అవకాశం ఉంది అని వెల్లడించింది. ఇది మహాచక్రవాతం గా మార్పు చెందిందా అంటే గంట కు 125 కి.మీ. నుండి 135 కి.మీ. వేగం మొదలుకొని గంట కు 145 కి.మీ. వేగం కలిగివుండే ఈదురు గాలుల తో కూడి గుజరాత్ లోని కోస్తా తీర ప్రాంత జిల్లాల లో భారీ వర్షం కురియవచ్చని భావిస్తున్నారు. తత్ప్రభావం తో కచ్ఛ్, దేవభూమి ద్వారక మరియు జామ్ నగర్ లలో అత్యధిక వర్షాలు కురుస్తాయని, గుజరాత్ లోని పోర్ బందర్, రాజ్ కోట్, మోర్ బీ, జూనాగఢ్ జిల్లాల లో కొన్ని చోట్ల లో జూన్ 14 వ, 15 వ తేదీల లో భారీ నుండి అతి భారీ వర్షపాతం ఉండవచ్చని తెలియ జేయడమైంది. జూన్ 6 వ తేదీ న గాలివాన తో తుపాను ఆరంభం అయిన తరువాత నుండి అన్ని రాష్ట్రాల కు మరియు సంబంధిత ఏజెన్సీల కు తాజా ముందస్తు సమాచారం సహా క్రమం తప్పక బులెటిన్ ల ను జారీ చేస్తూ వస్తున్నట్లు ఐఎమ్ డి పేర్కొన్నది.
గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ఎ) 24 గంటలూ స్థితి ఎలా ఉంటున్నదీ సమీక్షిస్తున్నదని, గుజరాత్ ప్రభుత్వం మరియు సంబంధి కేంద్రీయ ఏజెన్సీల తో సంప్రదింపులు జరుపుతోందని కూడా సమావేశం లో వెల్లడించడమైంది. ఎన్ డిఆర్ఎఫ్ 12 దళాల ను మొదట నుండే మోహరించింది; ఆ బృందాల కు పడవల ను, చెట్ల నరికివేత యంత్రాల ను, టెలికం ఉపకరణాల ను తదితర అవసర వస్తువుల ను సమకూర్చడం జరిగింది; దీనికి అదనం గా 15 జట్టుల ను కార్యరంగం లో దిగేందుకు తయారు గా ఉంచడమైంది.
సహాయం, వెతకులాట మరియు రక్షణ కార్యాల కోసం ఓడల ను మరియు హెలికాప్టర్ లను భారతీయ కోస్తా రక్షక దళం మరియు నౌకాదళం మోహరించాయి. వీటికి తోడు పడవల తోను, కాపాడే సామగ్రి తోను కూడి ఉన్న వాయు సేన మరియు సైన్యాని కి చెందిన ఇంజినీర్ టాస్క్ ఫోర్స్ యూనిట్ లు అవసరం తలెత్తిన వెనువెంటనే కార్యరంగం లోకి దిగేందుకు సిద్ధం గా ఉన్నాయి. నిఘా విమానాలు మరియు హెలికాప్టర్ లు కోస్తా తీరం వెంబడి అదే పని గా పర్యవేక్షణ ను గిస్తున్నాయి. సైన్యం, నౌకాదళం, ఇంకా కోస్తా తీర ప్రాంత రక్షక దళాని కి చెందిన విపత్తు రక్షక జట్టు లు (డిఆర్ టి స్) మరియు వైద్య చికిత్స బృందాల (ఎమ్ టి స్) ను అప్రమత్తమై ఏ క్షణాన్నైనా విధులు నిర్వర్తించేటందుకు సన్నద్ధం చేయడమైంది.
చక్రవాతం వేళ లో అన్ని చర్యల ను తీసుకోవడాని కి గుజరాత్ ప్రభుత్వం సిద్ధం గా ఉంది అనే విషయాన్ని సైతం ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి జిల్లా పాలన యంత్రాంగం తో సమీక్ష సమావేశాల ను నిర్వహించారు. ఏ అత్యవసర స్థితి ని అయినా తట్టుకోవడానికని రాష్ట్రం లోని పాలన సంబంధి యంత్రాంగాన్ని అంతటిని సర్వసన్నద్ధం గా ఉంచడమైంది. దీనికి తోడు, కేబినెట్ సెక్రట్రి మరియు హోం సెక్రట్రి లు గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో మరియు సంబంధిత కేంద్రీయ మంత్రిత్వ శాఖల తో/ఏజెన్సీల తో నిరంతరం సంప్రదింపులు సాగిస్తున్నారు.
ఈ సమావేశం లో హోం మంత్రి, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.