పేద-మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లు తగ్గింపు.. ఇంధన రంగంలో భారత్ స్వావలంబన లక్ష్యంగా పథకం ప్రారంభం;
అధిక సంఖ్యలో పైకప్పు సౌరశక్తి వ్యవస్థ స్వీకరణ దిశగా నివాస వినియోగదారుల సమీకరణకు భారీ జాతీయ కార్యక్రమం ప్రారంభించాలని ప్రధానమంత్రి ఆదేశం

   యోధ్యలో సూర్యవంశ తిలకుడైన శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీకి రాగానే లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో నిర్వహించిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంపై ప్రతిపాదనపై ఆమోదముద్ర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- క‌రెంటు బిల్లుల త‌గ్గింపుతోపాటు అవసరాల మేరకు విద్యుదుత్పాదన ద్వారా వారికి అసలైన స్వావలంబన కల్పించబడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అవసరాలకు పోగా మిగిలే విద్యుత్ విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు.

  ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద స్వల్ప-మధ్యాదాయ వర్గాలవారు తమ ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి ఉత్పాదక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారావారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించడడమే కాకుండా, అవసరాలు తీర్చుకోగా మిగిలిన విద్యుత్తును విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం లభించేలా చూడటం ఈ పథకం లక్ష్యం.

ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పైకప్పు సౌరశక్తి వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా నివాస వినియోగదారుల సమీకరణ కోసం భారీ జాతీయ కార్యక్రమం చేపట్టాలని కూడా ప్రధానమంత్రి ఆదేశించారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India