ఆరోగ్య మౌలిక సదుపాయాలు ,లాజిస్టిక్స్ సంసిద్ధత, వ్యాక్సినేషన్ ప్రచార స్థితి, కొత్త కోవిడ్ -19 వేరియంట్లు , ఇన్ ఫ్లుయంజా రకాల వ్యాప్తి, ప్రజారోగ్యం పై వాటి ప్రభావాల పరంగా దేశంలో కోవిడ్ -19, ఇన్ ఫ్లుయంజా, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.
గత 2 వారాల్లో దేశంలో ఇన్ ఫ్లుయంజా కేసులు , కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
భారతదేశంలో పెరుగుతున్న కేసులతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 పరిస్థితిని వివరిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఒక సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. 2023 మార్చి 22తో ముగిసిన వారంలో భారతదేశంలో కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోందని, సగటు రోజువారీ కేసులు 888 గా, వీక్లీ పాజిటివిటీ 0.98 శాతంగా నమోదయ్యాయని ప్రధానికి వివరించారు. కాగా, ఇదే వారంలో ప్రపంచవ్యాప్తంగా రోజువారీ సగటు కేసులు 1.08 లక్షలు నమోదయ్యాయి.
2022 డిసెంబర్ 22 న జరిగిన చివరి కోవిడ్ -19 సమీక్షలో ప్రధాన మంత్రి ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలను కూడా వివరించారు. 20 ప్రధాన కోవిడ్ మందులు, 12 ఇతర మందులు, 8 బఫర్ డ్రగ్స్, 1 ఇన్ ఫ్లుయంజా డ్రగ్ లభ్యత, ధరలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
2022 డిసెంబర్ 27న 22,000 ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించి, ఆ తర్వాత ఆసుపత్రులు తీసుకున్న పలు నివారణ చర్యలను చేపట్టాయి.
గత కొన్ని నెలలుగా హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యం లో దేశంలో ఇన్ ఫ్లుయంజా పరిస్థితిని ప్రధానికి వివరించారు.
నిర్దేశిత ఇన్సాకోగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీలతో పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే వాటిని ట్రాక్ చేయడానికి, సకాలంలో స్పందించడానికి ఇది తోడ్పడుతుంది.
రోగులు, ఆరోగ్య నిపుణులు ,ఆరోగ్య కార్యకర్తలు ఆసుపత్రి ఆవరణలో మాస్కులు ధరించడం సహా కోవిడ్ నిర్దేశిత ప్రవర్తనకు కట్టుబడి ఉండాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. నొక్కి చెప్పారు. సీనియర్ సిటిజన్లు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
ఐఆర్ఐ/ఎస్ఏఆర్ఐ కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడం, ఇన్ ఫ్లుయంజా, సార్స్-కోవ్-2, అడెనోవైరస్ పరీక్షలపై రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
అంతేకాక, ఆరోగ్య కేంద్రాల్లో ఇన్ ఫ్లుయెంజా , కోవిడ్-19 కోసం అవసరమైన ఔషధాలు , లాజిస్టిక్స్ లభ్యతతో పాటు
తగినన్ని పడకలు , ఆరోగ్య మానవ వనరుల లభ్యతను ధృవీకరించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
కోవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని, దేశవ్యాప్తంగా పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ - కోవిడ్ సముచిత ప్రవర్తన అనే ఐదు అంచెల వ్యూహంపై దృష్టిని కొనసాగించాలని, అన్ని తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఎఆర్ఐ) కేసులపై ల్యాబ్ నిఘా , పరీక్షలను పెంచాలని ప్రధాన మంత్రి సూచించారు. మన ఆసుపత్రులు అన్ని అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు.
రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో శ్వాసకోశ పరిశుభ్రత పాటించాలని, కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండాలని ప్రధాని సమాజానికి ఉద్బోధించారు.
ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పి కె మిశ్రా, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్, కేబినెట్ కార్యదర్శి శ్రీ. రాజీవ్ గౌబా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి. ఫార్మాస్యూటికల్స్ కార్యదర్శి, బయోటెక్నాలజీ కార్యదర్శి; ఐసీఎంఆర్ డీజీ, పీఎంవో సలహాదారు అమిత్ ఖరే, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.