Testing has gone up from around 50 lakh tests per week in early March to around 1.3 crore tests per week now
Localised containment strategies are the need of the hour: PM
PM instructed that testing needs to be scaled up further in areas with high test positivity rates
PM asks for augmentation of healthcare resources in rural areas to focus on door to door testing & surveillance.
Empower ASHA & Anganwadi workers with all necessary tools to boost fight in rural areas: PM
Important to ensure proper distribution of oxygen supply in rural areas: PM
Necessary training should be provided to health workers in the operation of ventilators & other equipment: PM

దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన  అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. ఈ మేరకు మార్చి ఆరంభంలో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య వారానికి 50 లక్షలు కాగా… ప్రస్తుతం వారానికి 1.3 కోట్ల స్థాయికి పెరిగినట్లు వారు తెలియజేశారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధారిత కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతుండగా కోలుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని వారు తెలిపారు. దేశంలో రోజువారీ 4 లక్షలకుపైగా కేసులు నమోదైన పరిస్థితిపై సమావేశం చర్చించింది. అయితే, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలుసహా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో కోవిడ్, రోగ నిర్ధారణ పరీక్షలు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు, టీకాలపై మార్గ ప్రణాళిక తదితరాల గురించి అధికారులు ప్రధానికి సమగ్రంగా నివేదించారు.

   వివిధ రాష్ట్రాల్లో అధిక పాజిటివ్ కేసులు నిష్పత్తి నమోదవుతున్న జిల్లాలకు ప్రత్యేకించి.. స్థానిక నియంత్రణ వ్యూహాలు తక్షణావసరమని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ‘‘ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్’’.. రెండు విధానాల్లోనూ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రధాని ఆదేశించారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో నియంత్రణ లోపం లేకున్నా అధిక కేసుల ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఒత్తిడికి గురికాకుండా కేసుల సంఖ్యను పారదర్శకంగా నివేదించేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా పరీక్ష-నిఘాపై నిశితంగా దృష్టి సారించడం కోసం ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని ప్రధాని కోరారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మరిపై పోరు ముమ్మరం చేయడం కోసం ‘ఆశా, అంగన్వాడీ’ కార్యకర్తలకు సకల ఉపకరణాలతో సాధికారత కల్పించడం గురించి ప్రధాని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘చికిత్స, ఏకాంత గృహవాసం’పై సోదాహరణ అవగాహన కల్పించాలని, అదే సమయంలో ఈ సరంజామాను ప్రజలకు సులువుగా అర్థమయ్యే భాషలో రూపొందించాలని ప్రధాని ఆదేశించారు.

   గ్రామీణ ప్రాంతాల్లో కాన్‌సెంట్రేట‌ర్లు అందించడంసహా ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేలా తగు పంపిణీ ప్రణాళిక తయారీకి కూడా ప్రధానమంత్రి ఆదేశించారు. ఆయా పరికరాల నిర్వహణపై ఆరోగ్య కార్యకర్తలకు తగిన శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. దీంతోపాటు సదరు వైద్య పరికరాలు అవరోధాలు లేకుండా పనిచేసేలా విద్యుత్ సరఫరా సజావుగా సాగేలా చూడాలని ప్రధాని స్పష్టం చేశారు.

   దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వెంటిలేటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయన్న నివేదికలపై  ప్రధానమంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అందజేసిన ఈ పరికరాల ఏర్పాటు-వినియోగంపై తక్షణం తనిఖీ నిర్వహించాల్సిందిగా ప్రధాని ఆదేశించారు. అంతేకాకుండా అవసరమైతే వెంటిలేటర్ల నిర్వహణలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు శిక్షణ పునశ్చరణ చేపట్టాలని కోరారు.

   కోవిడ్ మహమ్మారిపై భారత్ పోరాటానికి శాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణుల మార్గనిర్దేశం చేస్తున్నారని, భవిష్యత్తులోనూ దేశాన్ని నడిపించేది వారేనని  ప్రధాని చెప్పారు. రాష్ట్రాలవారీగా 45 ఏళ్లకు పైబడినవారికి టీకాల ప్రక్రియ గురించి అధికారులు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో టీకా మోతాదుల భవిష్యత్ లభ్యత మార్గ ప్రణాళికపైనా సమావేశం చర్చించగా, టీకాల ప్రక్రియ వేగం పెంపుదిశగా రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Employment increases 36 pc to 64.33 cr in last ten years: Mansukh Mandaviya

Media Coverage

Employment increases 36 pc to 64.33 cr in last ten years: Mansukh Mandaviya
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.