హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో టెనిస్ మెన్స్ డబల్స్ ఈవెంట్ లో వెండి పతకాన్ని క్రీడాకారులు శ్రీ రామ్ కుమార్ రామనాథన్ మరియు శ్రీ సాకేత్ మైనేని లతో కూడిన పురుషుల డబల్స్ జోడీ గెలిచిన సందర్భం లో వారికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘గొప్ప కబురు. మన టెనిస్ క్రీడాకారుల కు ధన్యవాదాలు. ఏశియాన్ గేమ్స్ లో రజత పతకాన్ని క్రీడాకారులు శ్రీ రామ్ కుమార్ రామనాథన్ మరియు శ్రీ సాకేత్ మైనేని లతో కూడిన పురుషుల డబల్స్ జోడీ గెలుచుకొన్న సందర్భం లో వారికి ఇవే అభినందన లు. వారి యొక్క అసామాన్యమైనటువంటి టీమ్ వర్క్ మనల ను అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. వారు భావి ప్రయాసల లో సైతం రాణించు గాక.’’ అని పేర్కొన్నారు.
Great news thanks to our tennis players. Congratulations to our Men's Doubles pair of @ramkumar1994 and @SakethMyneni on winning an Asian Games Silver Medal. Their exceptional teamwork has left us all in awe. My best wishes for their upcoming endeavours. pic.twitter.com/aA8dnIpoWK
— Narendra Modi (@narendramodi) September 29, 2023