ఆసియా క్రీడల పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన క్రీడాకారుడు కిషోర్ జెనాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల పురుషుల జావెలిన్ త్రోలో మన క్రీడాకారులు సాధించిన విజయాలు ఆమోఘం. స్వర్ణ పతకాన్ని భారత్ ఇప్పటికే కైవసం చేసుకోగా, ఇప్పుడు రజతం కూడా మనకే దక్కింది. ఈ క్రీడలో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన కిషోర్ జెనాకు నా అభినందనలు. అతడు సాధించిన ఈ విజయాన్ని దేశం ఎంతగానో ఆస్వాదిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Our accomplishments in Men's Javelin at Asian Games are remarkable. The Silver also comes to India. Congratulations to @Kishore78473748 for winning this splendid Silver in the event. The nation cherishes this victory. pic.twitter.com/3X257mE2ju
— Narendra Modi (@narendramodi) October 4, 2023