ఆసియా క్రీడల పురుషుల కబడ్డీలో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆనందం ఆకాశం అంచులు దాటిన క్షణమిది! మన కబడ్డీ పురుషుల జట్టు అజేయం! ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం సాధించినందుకు వారికి నా అభినందనలు. ఆద్యంతం వారు చూపిన పట్టుదల, దృఢ సంకల్పం, అద్భుతమైన జట్టు కృషి భారతదేశానికి కీర్తినార్జించి పెట్టాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A moment of jubilation! Our Kabbadi Men's Team is Invincible!
— Narendra Modi (@narendramodi) October 7, 2023
Congratulations on clinching the Gold Medal at Asian Games.
Their relentless determination and impeccable teamwork have brought glory to India. pic.twitter.com/d0ySCCgZs9