చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ త్రో -F37 ఈవెంట్ లో స్వర్ణపతకం గెలుచుకున్న హనీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘హనీ అద్భుత విజయం సాధించాడు. ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల జావెలిన్ త్రో -F37 ఈవెంట్ లో స్వర్ణపతకం సాధించాడు.
అతను ప్రదర్శించిన సరిపోల్చడానికి వీలులేని నైపుణ్యం భారత్ కు అవధులు లేని సంతోషం, గర్వం తెచ్చింది. రాబోయే క్రీడా వేడుకల్లో కూడా అతను ఇదే తరహా విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు’’ అని పేర్కొన్నారు.
A stellar accomplishment by Haney, securing the Gold Medal in the Men's Javelin Throw-F37 at the Asian Para Games!
— Narendra Modi (@narendramodi) October 25, 2023
His unparalleled skill has ushered in boundless joy and pride for India. Best wishes for the endeavours ahead. pic.twitter.com/Wf6w4ei0Tf