చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్‌లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ వేదికగా తన సందేశాన్ని విడుదల చేశారు.
“బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్‌లో అద్భుతమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న నితేష్ కుమార్, తులసిమతి మురుగేశన్‌లకు అభినందనలు" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వారి విజయాలు మన దేశం శ్రేష్ఠత, సామర్థ్యానికి నిదర్శనం అని అన్నారు.
Congratulations to @niteshnk11 & @Thulasimathi11 on a spectacular Bronze Medal win in the Badminton Mixed Doubles SL3-SU5 event.
— Narendra Modi (@narendramodi) October 25, 2023
Their achievements are a testament to the caliber of excellence our nation stands for. pic.twitter.com/ogBziNLzLL