రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“వీరనారి రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెకు అభివందనం సమర్పిస్తున్నాను. భారతదేశ చరిత్రలో ఆమెది ప్రత్యేక స్థానం. ఆమె ధైర్యసాహసాలు తరతరాలకూ చిరస్మరణీయాలు. ఈ సందర్భంగా భారత రక్షణ రంగానికి ఉత్తేజమిచ్చే కార్యక్రమాలకు ఇవాళ హాజరవడం కోసం ఝాన్సీ వెళ్లేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
I bow to the valorous Rani Lakshmibai on her Jayanti. She has a special place in the history of India. Her bravery will not be forgotten by generations. I look forward to being in Jhansi later today to attend programmes relating to boosting India’s defence sector.
— Narendra Modi (@narendramodi) November 19, 2021