బసవ జయంతి పవిత్ర పర్వదినం సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. అలాగే ఒక విడియో క్లిప్ ద్వారా జగద్గురు బసవేశ్వరుని గురించి తన మనోభావాలను శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“నేడు పవిత్ర బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి నివాళి అర్పిస్తున్నాను. మానవాళికి సేవ చేయడంలో ఆయన ఆలోచనలు-ఆదర్శాలు మనకెంతో స్ఫూర్తినిస్తాయి. అణగారిన వర్గాలకు సాధికారత కల్పన ద్వారా బలమైన, సంపన్న సమాజ నిర్మాణంపై ఆయన విస్పష్ట ప్రబోధం చేశారు.” అని ప్రధాని పేర్కొన్నారు.
Today, on the sacred occasion of Basava Jayanthi, I bow to Jagadguru Basaveshwara, whose thoughts and ideals give us the inspiration to serve humanity. He rightly emphasised on empowering the downtrodden and building a strong and prosperous society. pic.twitter.com/tmEWfBEeQU
— Narendra Modi (@narendramodi) April 23, 2023
ಬಸವ ಜಯಂತಿಯ ಇಂದಿನ ಈ ಪವಿತ್ರ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನಾನು ಜಗದ್ಗುರು ಬಸವೇಶ್ವರರಿಗೆ ಶಿರಸಾ ನಮಿಸುತ್ತೇನೆ. ಅವರ ಆಲೋಚನೆಗಳು ಮತ್ತು ಚಿಂತನೆಗಳು ಮನುಕುಲಕ್ಕೆ ಸೇವೆ ಮಾಡಲು ಪ್ರೇರಣೆ ನೀಡುತ್ತವೆ. ದಮನಿತರನ್ನು ಸಬಲಗೊಳಿಸಲು ಒತ್ತು ನೀಡುತ್ತಾ ಸದೃಢ ಮತ್ತು ಸಮೃದ್ಧ ಸಮಾಜ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಅವರು ಕೊಡುಗೆ ನೀಡಿದ್ದಾರೆ. pic.twitter.com/rgqoyql5qg
— Narendra Modi (@narendramodi) April 23, 2023
అలాగే 2015 నవంబరులో జగద్గురు బసవేశ్వరుని విగ్రహావిష్కరణను ప్రస్తావిస్తూ పార్లమెంటు సభ్యులు శ్రీ శివకుమార్ ఉదాసి ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“జగద్గురు బసవేశ్వరులు చూపిన బాటను మేం సదా అనుసరిస్తాం. ఆయనకు నివాళి అర్పించే ఇటువంటి అనేక అవకాశాలు లభించడం నాకు దక్కిన అదృష్టం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
We will always follow the path shown by Jagadguru Basaveshwara.
— Narendra Modi (@narendramodi) April 23, 2023
I am honoured to have got many opportunities to pay homage to him. https://t.co/mTT5P8ZvUa
ಜಗದ್ಗುರು ಬಸವೇಶ್ವರರು ತೋರಿಸಿಕೊಟ್ಟ ಹಾದಿಯನ್ನು ನಾವು ಸದಾ ಪಾಲಿಸುತ್ತೇವೆ. ಅವರಿಗೆ ಗೌರವ ಸಲ್ಲಿಸಲು ಅನೇಕ ಅವಕಾಶಗಳು ಒದಗಿರುವುದು ನನ್ನ ಸೌಭಾಗ್ಯ. https://t.co/mTT5P8ZvUa
— Narendra Modi (@narendramodi) April 23, 2023