సాహిబ్‌జాదా ల యొక్క మార్గదర్శక ప్రాయం అయినటువంటిధైర్యం, సాహసాల ను గురించి పౌరుల కు తెలిపి, మరి వారి లో చైతన్యాన్ని పాదుగొల్పడం కోసం దేశమంతటా కార్యక్రమాల నునిర్వహించడం జరుగుతున్నది
‘‘భారతీయత నుపరిరక్షించడం కోసం ఏ కార్యాన్ని అయినా నెరవేర్చాలన్న సంకల్పానికి ప్రతీక యే ‘వీర్ బాల్ దివస్’ ’’
‘‘మాత గుజ్‌ రీగారు, గురు గోబింద్సింహ్ గారు మరియు నలుగురు సాహిబ్‌జాదా ల యొక్క పరాక్రమం , ఇంకా ఆదర్శాలు ఇప్పటికీ భారతదేశంలో ప్రతి ఒక్కరి కి బలాన్ని ఇస్తున్నాయి’’
‘‘అణచివేతదారుల నుభారతీయులమైన మనమందరం స్వాభిమానం తో ఎదుర్కొన్నాం’’
‘‘ప్రస్తుతం మనం మనవారసత్వాన్ని చూసుకొని గర్విస్తున్నప్పుడు, ఇక ప్రపంచం యొక్క దృష్టికోణం సైతం మారిపోయింది’’
‘‘వర్తమాన భారతదేశాని కి తన ప్రజల పట్ల, తన సామర్థ్యాల పట్ల మరియు తన ప్రేరణల పట్ల బరోసా ఉంది’’
‘‘ఇవాళ యావత్తు ప్రపంచం భారతదేశాన్ని అవకాశాల నిలయం గా గుర్తిస్తున్నది’’
‘‘భారతదేశం యొక్క అత్యుత్తమమైన సత్తా ను రాబోయే 25 సంవత్సరాలు గొప్ప గా చాటిచెబుతాయి’’
‘‘మనం పంచ్ ప్రణ్ లను అనుసరించవలసినటువంటి మరిన్ని మన జాతీయ స్వభావాన్నిబలపరచుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది’’
‘‘మన యువ శక్తి కైపెద్ద పెద్ద అవకాశాల ను రాబోయే 25 సంవత్సరాలు ప్రసాదించబోతున్నాయి’’
‘‘అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క మహా చిత్రాన్ని తయారు చేయవలసింది మనయువజనులే; మరి ప్రభుత్వం ఒకమిత్రుని వలె వారి వెన్నంటి గట్టి గా నిలబడుతుంది’’
‘‘యువజనుల యొక్క కలల ను నెరవేర్చడం కోసం ప్రభుత్వం వద్దఒక స్పష్టమైనటువంటి మార్గసూచీ, ఇంకా ఒక దృష్టికోణమంటూ ఉన్నాయి సుమా’’

‘వీర్ బాల్ దివస్’ కు గుర్తు గా ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బాల లు పాలుపంచుకేన్న ఒక పఠన సంబంధి కార్యక్రమాన్ని ఆయన ఆలకించడం తో పాటుగా వారు ప్రదర్శించిన మూడు యుద్ధ విద్యల కార్యక్రమాన్ని కూడా చూశారు. ఇదే సందర్భం లో, దిల్లీ లో యువత చేపట్టిన ఒక మార్చ్-పాస్ట్ కు ప్రధాన మంత్రి ప్రారంభ సూచక జెండా ను చూపెట్టారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశ ప్రజలు వీర్ సాహెబ్‌జాదా ల అమర ప్రాణ త్యాగాల ను స్మరించుకొంటున్నది; ‘ఆజాదీ కా అమృత్‌కాల్’ (స్వాతంత్యం సిద్ధించిన అనంతరం 75 సంవత్సరాల కాలం) లో భారతదేశం సమక్షం లో ‘వీర్ బాల్ దివస్’ తాలూకు ఒక క్రొత్త అధ్యాయం ఆవిష్కారం అవుతున్న వేళ వీర్ సాహెబ్‌జాదా ల నుండి దేశ ప్రజలు ప్రేరణ ను పొందుతున్నారు అని పేర్కొన్నారు. కిందటి సంవత్సరం లో ఇదే రోజు న ‘వీర్ బాల్ దివస్’ ను మొట్టమొదటి సారి గా ఘనం గా జరుపుకొన్న సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. అప్పట్లో వీర్ సాహెబ్‌జాదా ల యొక్క శూరత్వ గాథ లు యావత్తు దేశ ప్రజల ను ఉద్విగ్నాని కి లోను చేసి వేశాయి అని ఆయన అన్నారు. ‘‘భారతీయత ను పరిరక్షించడం కోసం దేనికి అయినా సిద్ధం అయ్యే మనస్తత్వాని కి ఒక ప్రతీక యే ‘వీర్ బాల్ దివస్’ ’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ‘‘వీరత్వం యొక్క సమున్నత స్థాయి ని గురించి చెప్పవలసి వచ్చిందా అంటే అప్పుడు వయస్సు అనేది ఒక లెక్క లోకి రానే రాదు అనే సంగతి ని ఈ దినం స్ఫురింప చేస్తుంది’’ అని ఆయన అన్నారు. ఇది సిక్ఖు గురువు ల యొక్క వారసత్వాన్ని మనం ఉత్సవం వలె జరుపుకోవడం తో సమానమైంది అని ప్రధాన మంత్రి అంటూ, గురు గోబింద్ సింహ్ జీ యొక్క మరియు ఆయన సంతానం అయినటువంటి నలుగురు వీర్ సాహెబ్‌జాదా ల యొక్క ధైర్యం, సాహసాలు ఈ నాటి కి కూడా ను భారతదేశం లో ప్రతి ఒక్కరి లో తెగువ ను ప్రేరేపించేవే అని పేర్కొన్నారు. ‘‘అద్వితీయ శౌర్యం రూపు దిద్దుకొన్న బిడ్డల కు జన్మ ను ఇచ్చిన మాతృమూర్తుల కు ఒక జాతీయ శ్రద్ధాంజలి ని సమర్పించేందుకే ‘వీర్ బాల్ దివస్’ ను పాటించుకొంటున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బాబా శ్రీ మోతీ రామ్ మెహ్ రా యొక్క కుటుంబం చేసిన త్యాగాల ను మరియు దివాన్ శ్రీ టోడర్‌మల్ యొక్క సమర్పణ ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. గురువుల పట్ల ఈ విధమైన అచ్చమైన భక్తి అనేది దేశ ప్రజల పట్ల సమర్పణ తాలూకు జ్యోతి ని ప్రజ్వరిల్ల జేస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘వీర్ బాల్ దివస్’ ను ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి లో పాటిస్తూ ఉండటం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. యుఎస్ఎ లో, యుకె లో, ఆస్ట్రేలియా లో, న్యూ జీలండ్ లో, యుఎఇ లో మరియు గ్రీస్ లో ‘వీర్ బాల్ దివస్’ కు సంబంధించిన కార్యక్రమాలు చోటుచేసుకొంటున్న సంగతి ని ఆయన ప్రస్తావించారు. చమ్‌కౌర్ మరియు సర్‌ హింద్ సమరాల యొక్క సాటిలేని అటువంటి చరిత్ర ను ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెస్తూ, ఈ చరిత్ర ను మరచిపోవడం సాధ్యం కాదు అన్నారు. క్రూరత్వాన్ని మరియు నిరంకుశత్వాన్ని ఠీవీ తో ఎదుర్కొన్న భారతీయుల తీరు ను ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు.

 

మన వారసత్వాని కి సముచితమైన గౌరవాన్ని ఇవ్వడాన్ని మనం మొదలు పెట్టుకొన్న తరుణం లో, ప్రపంచ దేశాలు సైతం మన వారసత్వాన్ని శ్రద్ధ తో గమనించ సాగాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఈ రోజు న మనం మన యొక్క వారసత్వాన్ని గర్వం గా తలుచుకొంటున్నాం; మరి ఈ కాలం లో ప్రపంచ దృష్టి కోణం కూడా మారింది.’’ అని ఆయన అన్నారు. వర్తమాన భారతదేశం బానిస మనస్తత్వాన్ని విడచిపెట్టుకొంటూ దేశ ప్రజల దక్షత పట్ల, దేశ ప్రజల స్ఫూర్తి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది అంటూ శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘నేటి భారతదేశాని కి సాహిబ్‌జాదా ల ప్రాణత్యాగం ఒక ప్రేరణాత్మకం అయినటువంటి అంశం గా అయి పోయింది’’ అని ఆయన అన్నారు. అదే విధం గా భగవాన్ శ్రీ బిర్‌సా ముండా మరియు శ్రీ గోవింద్ గురు గారు ల ప్రాణ సమర్పణం యావత్తు దేశ ప్రజల లో స్ఫూర్తి ని నింపుతున్నది అని ఆయన అన్నారు.

 

 

అవకాశాలు మిక్కిలి గా ఉన్న దేశాల జాబితా లో ప్రపంచం భారతదేశాన్ని అగ్రస్థానాన నిలుపుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్థిక వ్యవస్థ, విజ్ఞాన శాస్త్రం, పరిశోధన, క్రీడలు మరియు దౌత్యాని కి సంబంధించినటువంటి ప్రపంచం సతమతం అవుతున్న సమస్యల లో భారతదేశం ఒక కీలక భూమిక ను వహిస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కారణం గానే ఎర్ర కోట నుండి తాను ‘‘యహీ సమయ్ హై సహీ సమయ్ హై’’ (ఈ సమయం సరి అయినటువంటి సమయం) అంటూ నినాదాన్ని ఇచ్చినట్లు ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘ఇది భారతదేశం యొక్క కాలం, రాబోయే 25 సంవత్సరాలు భారతదేశం యొక్క సత్తా ను కళ్ళకు కడతాయి’’ అని ఆయన అన్నారు. పంచ్ ప్రణ్ లను అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది, అంతేకాదు ఏ ఒక్క క్షణాన్ని వృథా పోనీయ కూడదు అని ఆయన నొక్కి పలికారు.

 

యుగాల లో తటస్థించేటటువంటి ఒక కాల ఖండం గుండా భారతదేశం పయనిస్తోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ స్వాతంత్య్రం తాలూకు అమృత కాలం లో భారతదేశాని కి స్వర్ణ యుగాన్ని నిర్ధారించ గలిగిన అనేక అంశాలు ఒక చోటు కు వచ్చి చేరాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం లో యువ శక్తి కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రత్యేకం గా ప్రస్తావించి, దేశం లో ప్రస్తుతం యువజనుల సంఖ్య స్వాతంత్య్ర పోరాట కాలం నాటి కంటే ఎంతో ఎక్కువ గా ఉంది అని నొక్కి పలికారు. ప్రస్తుత తరాని కి చెందిన యువతీ యువకులు దేశాన్ని ఊహించలేనంతటి శిఖర స్థాయిల కు తీసుకు పోగలరు అన్న నమ్మకం తనకు ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. జ్ఞానం అన్వేషణ లో అన్ని అడ్డంకుల ను ఛేదించిన నచికేతుడి ని గురించి, ‘చక్రవ్యూహం’ లోకి చిరు ప్రాయం లోనే ప్రవేశించిన అభిమన్యుడి ని గురించి, ధృవుడు చేసిన తపస్సు ను గురించి, లేత ప్రాయం లో ఒక సామ్రాజ్యాని కి నాయత్వం వహించిన మౌర్య వంశ రాజు చంద్రగుప్తుడు ని గురించి, ఏకలవ్యుడు అతని గురువు అయిన ద్రోణాచార్యుడి పట్ల చాటుకొన్న సమర్పణ భావాన్ని గురించి, దేశం కోసం ప్రాణసమర్పణ కు సైతం వెనుదీయనటువంటి శ్రీ ఖుదీరామ్ బోస్, శ్రీ బటుకేశ్వర్ దత్త్ , కనక్‌లత బరువా గారు, రాణి గాయిదిన్‌ల్యూ గారు, శ్రీ బాజీ రావుత్, ఇంకా మరెందరో జాతీయ వీరులను గురించి, జాతీయ వీరాంగనల ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు.

 

‘‘మన యువ జనుల కు భారీ అవకాశాల ను రాబోయే 25 సంవత్సరాలు తీసుకు వస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘భారతదేశం లో యువతీ యువకులు వారు ఏ ప్రాంతం లో పుట్టారు లేక ఏ సమాజం లో జన్మించారు అనే అంశాల కు అతీతం గా అపరిత కలల ను కలిగి ఉన్నారు. ఆ కలల ను నెరవేర్చడం కోసం ప్రభుత్వం వద్ద ఒక ఖచ్చితమైనటువంటి మార్గసూచీ, ఒక సమగ్రమైనటువంటి దృష్టి కోణం ఉన్నాయి.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. చక్కని బాట ను వేసేటటువంటి జాతీయ విద్య విధానం గురించి, పది వేల అటల్ టింకరింగ్ లేబ్స్ ను గురించి, చైతన్య భరితం అయినటువంటి స్టార్ట్-అప్ సంస్కృతి ని గురించి ఆయన ప్రస్తావించారు. యువజనులు, ఎస్‌సి లు/ఎస్‌టి లు, ఇంకా వెనుకబడిన సముదాయాలు.. వీటి లోని పేద లు ‘ముద్ర యోజన’ యొక్క ఊతం తో 8 కోట్ల సంఖ్య లో ఎదిగినటువంటి యువ నవ పారిశ్రామికవేత్త ల సంగతులను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

 

ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఈవెంట్ లలో భారతదేశాని కి చెందిన క్రీడాకారిణులు, క్రీడాకారుల సాఫల్యాల ను ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, ఈ ఎథ్‌లీట్ లలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల కు చెందిన మధ్య తరగతి కుటుంబాల నుండే వచ్చారు అన్నారు. వారి సాఫల్యాల ఖ్యాతి ‘ఖేలో ఇండియా ప్రచార ఉద్యమాని’కి దక్కుతుంది అని ఆయన అన్నారు. ఖేలో ఇండియా ప్రచార ఉద్యమం క్రీడాకారుల కు వారి స్వస్థలాల కు సమీపం లో మెరుగైనటువంటి క్రీడా సౌకర్యాల ను మరియు శిక్షణ సంబంధి సదుపాయాల ను కల్పించడం తో పాటుగా ఒక పారదర్శకమైనటువంటి ఎంపిక ప్రక్రియ కు కూడా పూచీ పడుతోంది అని ఆయన అన్నారు. యువశక్తి యొక్క సంక్షేమాని కి పెద్ద పీట ను వేసినటువంటి పరిణామం తాలూకు ఫలితాలే ఇవి అని ప్రధాన మంత్రి చెప్పారు.

 

మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మార్పు చెందాలి అనే కల కు గల అర్థాన్ని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో వివరించారు. ఇదే జరిగితే ఎక్కువ గా లాభపడేది యువజనులే, మరి భారతదేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచిందంటే కనుక, అప్పుడు మెరుగైన ఆరోగ్యం, విద్య, అవకాశాలు, ఉద్యోగాలు, జీవనం లో నాణ్యత, మేలైన ఉత్పాదనలు సిద్ధిస్తాయి అని ఆయన వివరించారు. దేశం లో యువత ను వికసిత్ భారత్ తాలూకు సంకల్పం తో మరియు వికసిత్ భారత్ సంబంధి స్వప్నాల తో సంధానించేటటువంటి దేశవ్యాప్త కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువ శ్రోతల తో పేర్కొన్నారు. మై భారత్ పోర్టల్ (MY-Bharat portal) లో యువతీ యువకులు వారి వారి పేరుల ను నమోదు చేసుకోవలసింది గా ప్రతి ఒక్కరి కి ఆయన ఆహ్వానం పలికారు. ‘‘ఈ ప్లాట్‌ఫార్మ్ ప్రస్తుతం దేశం లో యువ పుత్రికలు మరియు యువ పుత్రుల కు ఒక పెద్ద సంస్థ గా మారుతోంది’’ అని ఆయన అన్నారు.

 

యువతీ యువకులు వారి ఆరోగ్యాని కి అగ్ర తాంబూలాన్ని ఇవ్వాలని, జీవనం లో కోరుకొన్న ఫలితాల ను సాధించడాని కి మనిషి ఆరోగ్యం గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం అని ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. యువత వారి కోసం కొన్ని మౌలిక సూత్రాల ను ఏర్పరచుకోవాలని, ఆ సూత్రాల ను తు.చ. తప్పక పాటించాలని ఆయన సూచించారు. ఇదే సందర్భం లో ఆయన శారీరిక వ్యాయామాల లో ఎదురయ్యే సవాళ్ళ ను గురించి, డిజిటల్ సాధనాల కు అలవాటు పడిపోవడం వల్ల తలెత్తే సమస్యల ను గుర్తెరిగి ఆయా సమస్య ల బారి న పడకుండా సంయమనం తో మెలగడాన్ని గురించి, మానసిక పటుత్వాన్ని గురించి, తగినంత నిద్ర ను గురించి, మరి అలాగే వారు తీసుకొనే ఆహార పదార్థాల లో చిరుధాన్యాలు లేదా శ్రీ అన్న ను కూడా చేర్చుకోవడాన్ని గురించి ప్రస్తావించారు. సమాజం లో మత్తు పదార్థాల భూతం విజృంభిస్తుండడాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సమాజం గాను, ఒక దేశం గాను ఏక తాటి మీద నిలచి ఈ భూతాని కి ఎదురొడ్డి పోరాడాలి అని ఆయన కోరారు. మత్తు పదార్థాల వినియోగాని కి వ్యతిరేకం గా ఒక శక్తివంతమైన ప్రచార ఉద్యమాన్ని ఆరంభించడం కోసం ప్రభుత్వాని కి మరియు కుటుంబాల కు తోడు ధార్మిక సంస్థ ల ప్రముఖులు కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘సత్తా కలిగిన మరియు దృఢమైన యువ శక్తి ఏర్పడాలి అంటే ఆ లక్ష్య సాధన లో ‘సబ్ కా ప్రయాస్’ (అందరి కృషి) తప్పనిసరి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆయన తన ప్రసంగం ముగింపు లో, మనకు మన గురువులు బోధించినటువంటి ‘సబ్ కా ప్రయాస్’ తాలూకు బోధన లు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా మలచ గలుగుతాయి అని గుర్తు చేశారు.

 

మహిళ లు మరియు బాల ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, విద్య శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సమాచారం మరియు ప్రసారం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

పూర్వరంగం

వీర్ బాల్ దివస్ ను పాటించుకోవడం కోసం ప్రభుత్వం పౌరుల, ప్రత్యేకం గా చిన్న పిల్లల కు సాహిబ్ జాదా ల యొక్క మార్గదర్శక ప్రాయం అయినటువంటి ధైర్యం, సాహసాల గాథ ను గురించి తెలియజేయడం తో పాటుగా తత్సంబంధి చైతన్యాన్ని వారిలో పాదుగొల్పడం కోసం దేశ వ్యాప్తం గా అనేక ప్రాతినిధ్య పూర్వకం అయినటువంటి కార్యక్రమాల ను ఏర్పాటు చేస్తున్నది. సాహిబ్‌ జాదా ల యొక్క జీవన గాథ ను గురించి మరియు సాహిబ్ జాదా ల ప్రాణసమర్పణాన్ని గురించి కళ్ళకు కట్టేటటువంటి ఒక డిజిటల్ ఎగ్జిబిశన్ ను దేశం అంతటా పాఠశాలల్లోను, బాలల సంరక్షణ సంస్థల లోను ప్రదర్శించడం జరుగుతుంది. ‘వీర్ బాల్ దివస్’ కు చెందిన ఒక చిత్రాన్ని కూడా దేశవ్యాప్తం గా ప్రదర్శించడం జరుగుతుంది. వీటి తో పాటు, ఇంటర్‌ ఏక్టివ్ క్విజ్ ల వంటి వివిధ ఆన్‌లైన్ పోటీల ను మైభారత్ (MYBharat) పోర్టల్ లో మరియు మైగవ్ (MyGov) పోర్టల్ లో నిర్వహించడం జరుగుతుంది.

 

శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో 2022 జనవరి 9 వ తేదీ న ప్రధాన మంత్రి ఒక ప్రకటన ను చేస్తూ, శ్రీ గురు గోబింద్ సింహ్ యొక్క కుమారులైన సాహిబ్‌జాదా లు బాబా జోరావర్ సింహ్ జీ మరియు సాహిబ్‌జాదా బాబా ఫతేహ్ సింహ్ జీ ల ప్రాణ సమర్పణం ఘట్టాన్ని స్మరించుకొంటూ డిసెంబర్ 26 వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా పాటించడం జరుగుతుంది అని ప్రకటించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi