Quoteమధ్యప్రదేశ్లో 17,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి.
Quoteఈ అభివృద్ధి ప్రాజెక్టులలో నీటిపారుదల, విద్యుత్, రోడ్డు, రైలు, నీటిసరఫరా, బొగ్గు, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి.
Quoteమధ్యప్రదేశ్లో సైబర్ తహసిల్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధానమంత్రి.
Quote“మధ్యప్రదేశ్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది”
Quote“రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, ఇండియా అభివృద్ధి చెందుతుంది”
Quote“ఇండియా అభివృద్ధిపథంలో పయనిస్తూ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో, ఉజ్జయినిలోని విక్రమాదిత్య వేద కాలసూచిక, కాల చక్రానికి సాక్షి”గా నిలుస్తుందన్న ప్రధానమంత్రి.
Quote“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, రెట్టింపు వేగంతో అభివృద్ధి పనులను చేపడుతున్నది”
Quote“గ్రామాలు ఆత్మనిర్భరత సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.”
Quote“మధ్యప్రదేశ్లో నీటిపారుదల రంగంలో మనం విప్లవాత్మక మార్పులు చూస్తున్నాం.”
Quote“గత పది సంవత్సరాలలో, ప్రపంచంలో ఇండియా ప్రతిష్ట ఎంతో పెరిగింది”
Quote“యువత కలలే మోడీ సంకల్పం”

ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ, వికసిత్‌భారత్‌, వికసిత్‌ మధ్యప్రదేశ్‌ కార్యక్రమంలో ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, మధ్యప్రదేశ్‌లో సుమారు 17,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు పలు కీలక రంగాలకు సంబంధించినవి. ఇవి నీటిపారుదల, విద్యుత్‌, రోడ్డు, రైలు , నీటి సరఫరా, బొగ్గు, పరిశ్రమతో పాటు పలు ఇతర రంగాలకు సంబంధించినవి. ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌లో సైబర్‌ తహసిల్‌ప్రాజెక్టును కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో రోడ్డుప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అన్నిఏర్పాట్లూ చేసినట్టు తెలిపారు. ‘‘ ఈ విషాద సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రజలకు అండగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

 

|

వికసిత్‌ భారత్‌ సంకల్పంతో లక్షలాది మంది ప్రజలు మధ్యప్రదేశ్‌లోని వివిధ పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలనుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారని ప్రధానమంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇదే తరహా తీర్మానాలను ఇతర రాష్ట్రాలప్రజలు కూడా చేశారని, రాష్ట్రాలు వికసితమైతే , దేశం వికసితమౌతుందని ప్రధానమంత్రి అన్నారు.
మధ్యప్రదేశ్‌లో రేపటినుంచి ప్రారంభం కానున్న 9 రోజుల విక్రమోత్సవ్‌ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, రాష్ట్రానికి గల అద్భుత వారసత్వాన్ని, ప్రస్తుత పరిణామాలను ఉత్సవంగా నిర్వహించుకుంటున్న సందర్భమని అన్నారు. దేశ ఘన వారసత్వాన్ని అభివృద్ధిని సమాంతరంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నదనడానికి నిదర్శనం, ఉజ్జయినిలో ఏర్పాటుచేసిన వేదగడియారమే సాక్షి అని ప్రధానమంత్రి అన్నారు.  ప్రపంచానికి కాలాన్ని గణించి చెప్పిన ప్రాంతం, బాబా మహాకాలుడి దివ్యపట్టణమని, ఇది కాల గణనకు ప్రపంచానికే కేంద్రమని , అయితే దీని ప్రాధాన్యతను మరిచిపోయామని  ప్రధానమంత్రి అన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రంపంచంలోనే తొలి విక్రమాదిత్య వేదిక్‌ గడియారాన్ని ఉజ్జయినిలో పునరుద్ధరించిందని ప్రధానమంత్రి తెలిపారు. దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగుతున్న వేళ ఇది కాలచక్రానికి సాక్షీభూతమని ప్రధానమంత్రి అన్నారు.

ఇవాల్టి కార్యక్రమంలో సుమారు 17,000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి , ఈ ప్రాజెక్టులలో కీలక రంగాలైన నీరు, నీటిపారుదల, విద్యుత్‌,రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, కమ్యూనిటీ హాళ్లు తదితరాలు ఉన్నాయన్నారు. వీటికి తోడు మధ్యప్రదేశ్‌లోని 30 రైల్వేస్టేషన్లలో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.

 

|

వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగంపైపై డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ శ్రద్ధను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.నర్మదానదిపైమూడు ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో నీటిపారుదల సమస్యను పరిష్కరించడమే కాక,మంచినీటి సరఫరా సమస్యను కూడా తీర్చనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో మధ్య ప్రదేశ్‌లో  నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులు చూడబోతున్నామన్నారు. కెన్‌`బెత్వా నది అనుసంధాన ప్రాజెక్టు బుందేల్‌ ఖండ్‌ ప్రాంతంలోని లక్షలాది కుటుంబాల జీవితాలలో మార్పు తీసుకురానున్నదని తెలిపారు.  రైతుల పొలాలకు నీటిని చేరవేయడం , రైతులకు జరుగుతున్న అతి పెద్ద సేవ అని ప్రధానమంత్రి అన్నారు. 2014కు ముందు  నీటిపారుదల రంగపరిస్థితికి, ప్రస్తుత పరిస్థితికి  మధ్య తేడాను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.దేశంలో 40 లక్షల హెక్టార్లుగా ఉన్న సూక్ష్మ సేద్యాన్ని ఇవాళ 90 లక్షల హెక్టార్లకు పెంచినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతను, అది ఏ స్థాయిలో ప్రగతిసాధిస్తున్నదన్న విషయాన్ని  స్పష్టం చేస్తున్నదన్నారు.
 చిన్న రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన పంట నిల్వ సమస్యగురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజ్‌ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. రానున్న రోజుల్ల వేలాదిపెద్ద గోడౌన్లను నిర్మించనున్నామని, వీటి సామర్ధ్యం దేశంలో 700 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకోనున్నదని తెలిపారు.  ప్రభుత్వం ఈ రంగంలో 1.25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నదన్నారు.
గ్రామం ఆత్మనిర్భరతను సాధించేలా చేసేందుకు  ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా, సంకల్పించిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.పాలు, చెరకు వంటి వాటి నుంచి సహకార సంఘాలు ప్రస్తుతం  ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, మత్స్య సంపద వరకు విస్తరించాయన్నారు. లక్షలాది గ్రామాలలో సహకార సంఘాలను ఏర్పాటు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి స్వమిత్వ యోజన కింద గ్రామీణ ఆస్తి వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ పథకాన్ని నూరు శాతం అమలు చేస్తున్నందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. గ్రామాలలో డ్రోన్లద్వారా సర్వేలు నిర్వహించి 20 లక్షలకు పైగా స్వమిత్వ కార్డులు ఇప్పటివరకు జారీచేయడం జరిగిందని అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలలో సైబర్‌ తహసిల్‌ ప్రాజెక్టు అమలు గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, దీని ద్వారా పేర్ల బదిలీ, రిజిస్ట్రేషన్‌ సంబంధిత సమస్యలకు డిజిటల్‌ పరిష్కారం లభిస్తుందని, తద్వారా ప్రజల సమయం, ఖర్చు ఆదా అవుతుందని అన్నారు.
మధ్యప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,పారిశ్రామికంగా కీలకరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ యువత కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నదని చెప్పారు.  యువత కలలే మోదీ హామీలని ప్రధానమంత్రి అన్నారు.  ఆత్మనిర్భర్‌భారత్‌ లో, మేక్‌ ఇన్‌ ఇండియాలో మధ్యప్రదేశ్‌ ఒక కీలక స్తంభం కానున్నదని చెప్పారు. సీతాపూర్‌ ,మోరేనాలలో మెగా లెదర్‌, ఫుట్‌వేర్‌ క్లస్టర్‌్‌, ఇండోర్‌ లో రెడీమేడ్‌ వస్త్రాల కోసం టెక్స్‌టైల్‌ పార్క్‌ , మందసౌర్‌లో  పారిశ్రామిక పార్క్‌ విస్తరణ
 

|
వంటివి మధ్యప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తాయని అన్నారు. దేశంలో బొమ్మల తయారీని పెద్ద ఎత్తున పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. బొమ్మల తయారీ పరిశ్రమకు సంబంధించి పలుఅవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ఈప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధికార్యక్రమాలు బుధినిలో బొమ్మల తయారీ కమ్యూనిటీకి మరిన్ని అవకాశాలు కల్పించనున్నదని తెలిపారు.
సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వారిని ఆదరించడంలో తనకు గల చిత్తశుద్ధిని ప్రధానమంత్రి మరోసారి ప్రకటించారు. సంప్రదాయ చేతివృత్తుల వారికి తగిన ప్రచారం కల్పిస్తున్నట్టు కూడా తెలిపారు. అవకాశం దొరికిన ప్రతి వేదిక నుంచీ చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు తాను ప్రచారం కల్పిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. కుటీర పరిశ్రమల ఉత్పత్తులను తాను వివిధ కార్యక్రమాల సందర్భంగా అతిథులకు బహుకరించి వాటిని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఓకల్‌ ఫర్‌ లోకల్‌, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యతా నినాదం స్థానిక చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహిస్తుందన్నారు.
గత 10 సంవత్సరాలలో ఇండియా అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, పెట్టుబడులు,పర్యాటకరంగప్రత్యక్ష ప్రయోజనాలను తెలియజేశారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల టూరిజం రంగంలో సాధించిన ప్రగతిగురించి పేర్కొన్నారు.ఓంకారేశ్వర్‌, మామలేశ్వర్‌లను ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆదిగురు శంకరాచార్య స్మృత్యర్థం, ఉజ్జయిని సింహస్థ 2028ని పురస్కరించుకుని ఓంకారేశ్వర్‌లో నెలకొల్పనున్న ఏకాత్మధామ్‌ పర్యాటక రంగానికి మరింత ఊతం ఇవ్వనున్నదన్నారు.ఇచ్ఛాపూర్‌ నుంచి ఇండోర్‌ లోని ఓంకారేశ్వర్‌ వరకు నాలుగులేన్ల నిర్మాణం భక్తులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇవాళ ప్రారంభమైన రైల్వే ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌కు అనుసంధానత పెంచుతాయన్నారు. అనుసంధానత పెరిగితే పరిశ్రమలు, పర్యాటకం, వ్యవసాయ రంగం అన్నీ ప్రయోజనం పొందుతాయన్నారు.

 దేశంలో మహిళల పురోగతిని అడ్డుకునేలా ఉన్న అడ్డంకులను తొలగించేందుకు గత దశాబ్దకాలంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి వివరించారు. రాగల 5 సంవత్సరాలలో సోదర, సోదరీమణుల అభ్యున్నతి, సాధికారత తిరుగులేని విధంగా ఉండనున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి గ్రామంలో లక్షాధికారైన మహిళ ఉండాలన్నది తమ సంకల్పమని, ద్రోన్ దీదీలు దేశంలో నూతన వ్యవసాయ విప్లవాన్ని తీసుకురానున్నారన్నారు. రాగల 5 సంవత్సరాలలో గ్రామీణ కుటుంబాల రాబడి పెరగనున్నదని తెలిపారు. గత పది సంవత్సరాలలో గ్రామాల అభివృద్దికి జరిగిన కృషితో ఇది సాధ్యం కానున్నదని తెలిపారు. ఒకా నొక నివేదిక ప్రకారం గ్రామాలలో రాబడి, పట్టణాలు, నగరాలలో రాబడి కన్నా త్వరితగతిన పెరుగుతున్నట్టు తేలిందన్నారు.  గత 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి తెలిపారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిలో నూతన శిఖరాలు అధిరోహించనున్నదని తెలిపారు. 

నేపథ్యం.....

 

ప్రధానమంత్రి , మధ్యప్రదేశ్లో సుమారు 5500 కోట్ల రూపాయల విలువగల నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులలో ఎగువ నర్మదా ప్రాజెక్టు, రాఘవపూర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు,బసనియ బహుళార్ద సాధక ప్రాజెక్టు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దిండోరి, అనుపూర్, మాండ్ల జిల్లాలలో 75,000 హెక్టార్ల వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురానున్నాయి. అలాగే విద్యుదుత్పత్తి, ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యను తీర్చనున్నాయి. ప్రధానమంత్రి రాష్ట్రంలో 800 కోట్ల రూపాయల విలేవగల రెండు సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో పరస్దోష్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, ఔలియా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నాయి. ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు  బెత్వా, ఖండ్వా జిల్లాలలో 26,000 హెక్టార్ల భూమికి నీటిపారుదల సదుపాయం కల్పించనున్నాయి.

 

|

ప్రధానమంత్రి 2,200 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.ఈ ప్రాజెక్టులలో వీరాంగన లక్ష్మీబాయ్ ఝాన్సి–జక్లౌన్, దౌరా– అగసౌద్ రూట్, న్యూ సుమౌలి–జోరా అలపూర్ రైల్వే లైన్ గేజ్ మార్పిడి, పవర్ఖేడా–జుజ్హర్పూర్ రైల్వే లైన్ ప్లైఓవర్ ప్రాజెక్టు వంటివి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రైల్వే అనుసంధానతను మరింత మెరుగు పరచడమే కాక, ఈ ప్రాంత సామాజిక ఆర్ధిక ప్రగతికి దోహదపడనున్నాయి. 

మధ్యప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు, ప్రధానమంత్రి పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటి విలువ సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులలో మెగా లెదర్ ప్రాజెక్టు, మొరేనా జిల్లా సీతాపూర్లో ఫుట్వేర్, ఇతర ఉపకరణాల క్లస్టర్ ఇండోర్లో వస్త్ర పరిశ్రమ కోసం ప్లగ్ అండ్ ప్లే పార్క్, మందసౌర్లో (జగ్గఖేడి ఫేజ్ 2) పారిశ్రామిక పార్కు, ధర్ జిల్లాలోని పితామ్పుర్లో పారిశ్రామిక పార్కు ఉన్నాయి. ప్రధానమంత్రి బొగ్గు రంగానికి సంబంధించి సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువగల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వీటిలో జయంత్ ఒసిపి సిహెచ్పి సిలో, ఎన్సిఎల్ సింగ్రౌలి, దుధిచువా ఒసిపి సిహెచ్పి –సిలో ప్రాజెక్టులు ఉన్నాయి.

మధ్యప్రదేశ్లో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి, పన్నా, రైసెన్,చింద్వారా, నర్మదాపురం  జిల్లాలలో ఆరు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.ఈ సబ్స్టేషన్లు ఈ ప్రాంతంలోని 11 జిల్లాలలో అంటే భోపాల్,పన్నా,రైసెన్, చింద్వారా, నర్మదాపురం, విదిశ, సాగర్,దామోహ్,చాతర్పూర్,హర్దా, సెహోర్లలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరాకు వీలు కల్పిస్తాయి. మండిదీప్పారిశ్రామిక ప్రాంతానికి కూడా ఇవి ప్రయోజనం కలిగిస్తాయి. 

అమృత్ 2.0 కింద ప్రధానమంత్రి 880 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకుశంకు స్థాపన చేశారు. ఇవి ఈ ప్రాంతంలోని పలు జిల్లాలలో నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడానికి పనికివస్తాయి. ఖర్గాంలో నీటిపారదల సరఫరాను మెరుగుపరిచే ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

 

ప్రభుత్వ   సేవలను ప్రజలకు అందేలా చేయడాన్ని మరింత మెరగుపరిచేందుకు మధ్యప్రదేశ్లో సైబర్ తెహసిల్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా కాగిత రహిత, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖాముఖి కలుసుకునే అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా ఆస్తుల అమ్మకం,కొనుగోలు,మ్యుటేషన్,రెవిన్యూ రికార్డులలో తప్పుల దిద్దుబాటు వంటివి చేస్తారు. ఈ ప్రాజెక్టును మధ్యప్రదేశ్లోని 55 జిల్లాలలో చేపట్టారు. మొత్తం మధ్యప్రదేశ్కు ఒకే ఒక రెవిన్యూ కోర్టుఉంటుంది. ఇది ఇమెయిల్, వాట్సప్ ను వినియోగిస్తుంది. దరఖాస్తుదారుకు సర్టిఫైడ్ ఫైనల్ ఆర్డర్ కాపీని పంపేందుకు వీటిని వినియోగిస్తారు.

ప్రధానమంత్రి మధ్యప్రదేశ్లో పలు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు ప్రధానమంత్రి దార్శనికతకు అద్దంపడతాయి. రాష్ట్రంలో మౌలికసదుపాయాలకు మరింత ఊతం ఇవ్వడంతోపాటు, మధ్యప్రదేశ్ సామాజిక ఆర్ధిక ప్రగతికి, సులభతర జీవనానికి వీలు కల్పించేందుకు ఇవి దోహదం చేస్తాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • krishangopal sharma Bjp January 07, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 07, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷
  • krishangopal sharma Bjp January 07, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷
  • Reena chaurasia August 31, 2024

    बीजेपी
  • Jitender Kumar Haryana BJP State President August 09, 2024

    is Sandhya Maurya alive ?
  • Jitender Kumar Haryana BJP State President August 09, 2024

    🇮🇳
  • Jitender Kumar Haryana BJP State President July 04, 2024

    uwudlove2knowme@yahoo.com
  • Jitender Kumar Haryana BJP State President July 04, 2024

    officialmailforjk@gmail.com
  • Jitender Kumar BJP May 22, 2024

    jitender kumar email id kumarjitender90561@gnail.com j0817725@gmail.com officialmailforjk@gmail.com
  • Pradhuman Singh Tomar April 30, 2024

    BJP
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas

Media Coverage

India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to revered Shri Kushabhau Thackeray in Bhopal
February 23, 2025

Prime Minister Shri Narendra Modi paid tributes to the statue of revered Shri Kushabhau Thackeray in Bhopal today.

In a post on X, he wrote:

“भोपाल में श्रद्धेय कुशाभाऊ ठाकरे जी की प्रतिमा पर श्रद्धा-सुमन अर्पित किए। उनका जीवन देशभर के भाजपा कार्यकर्ताओं को प्रेरित करता रहा है। सार्वजनिक जीवन में भी उनका योगदान सदैव स्मरणीय रहेगा।”