ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఫుమియో కిషిదా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినందుకు, ప్రపంచ శ్రేయస్సు కోసం క్వాడ్‌ను ఒక శక్తిగా బలోపేతం చేసే విషయంలో వ్యక్తిగత నిబద్ధతను చాటుతుందన్నందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్రిక్తతలు, సంఘర్షణలతో ప్రపంచం సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉమ్మడి ప్రజాస్వామిక నైతికత, విలువలతో కూడిన క్వాడ్ దేశాలు ఏకతాటిపైకి రావడం మానవాళికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే నిబద్ధతతో అంతర్జాతీయ సమతౌల్యాన్ని కాపాడేందుకు ఈ బృందం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, సుసంపన్న ఇండో-పసిఫిక్ పరిస్థితులు... క్వాడ్ దేశాల ఉమ్మడి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ దేశాల కార్యక్రమాలను కొనసాగించడానికీ, సహాయం చేయడానికీ, భాగస్వామ్యాన్ని సాకారం చేసుకోవడానికీ క్వాడ్ ఇక్కడ ఉందని ఆయన ప్రధానంగా చెప్పారు.
"ప్రపంచ శ్రేయస్సు కోసం శక్తి"గా క్వాడ్ ఉంటుందని పునరుద్ఘాటించిన నాయకులు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు మొత్తం ప్రపంచ అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించి ఈ కింది ప్రకటనలు చేశారు:
* "క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్", గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను ఎదుర్కోవడం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాణాలను కాపాడటానికి అద్భుతమైన భాగస్వామ్యం.
* ఇండో-పసిఫిక్ భాగస్వాములు ఐపీఎండీఏ, ఇతర క్వాడ్ కార్యక్రమాల ద్వారా అందించే సముద్రయాన సాధనాలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకునేందుకు 'మారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ది ఇండో-పసిఫిక్' (మైత్రి/ఎంఏఐటీఆర్ఐ) ఏర్పాటు.
* 2025లో తొలిసారిగా “క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్” ద్వారా విభిన్న వ్యవస్థలు కలిసి పనిచేయటాన్ని, సముద్ర భద్రతను పెంపొందించనున్నారు.
* ఇండో-పసిఫిక్ అంతటా సుస్థిర, బలమైన నౌకాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతునిచ్చే విషయంలో సమష్టి నైపుణ్యాన్ని ఉపయోగించుకునేందుకు "క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ పార్టనర్షిప్".
* ఇండో పసిఫిక్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో "ప్రజా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మోహరింపు కోసం క్వాడ్ సూత్రాలు".
* క్వాడ్ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ బంధాలను బలోపేతం చేసేందుకు "సెమీకండక్టర్ సప్లై చైన్స్ కంటింజెన్సీ నెట్వర్క్ మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్".
* ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అధిక సామర్థ్యం కలిగిన సరసమైన ధరల్లో ఉండే శీతలీకరణ వ్యవస్థల మోహరింపు , తయారీతో సహా శక్తిసామర్ధ్యాలను పెంచడానికి క్వాడ్ దేశాల ఉమ్మడి ప్రయత్నం.
* ప్రతికూల వాతావరణ సంఘటనలు, వాతావరణ ప్రభావాన్ని అంతరిక్షం ఆధారంగా పర్యవేక్షించటం కోసం ఓపెన్ సైన్స్ భావనకు మద్దతుగా మారిషస్ కోసం భారత అంతరిక్ష ఆధారిత వెబ్ పోర్టల్.
* భారత ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో 4 సంవత్సరాల బ్యాచిలర్ ఇంజినీరింగ్ కోర్సును ఇండో-పసిఫిక్ ప్రాంత విద్యార్థులు అభ్యసించడానికి భారత్ ప్రకటించిన క్వాడ్ స్టెమ్ ఫెలోషిప్ కింద కొత్త ఉప విభాగం.
2025లో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సును భారత్ నిర్వహించడాన్ని నేతలు స్వాగతించారు. క్వాడ్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు క్వాడ్ విల్మింగ్టన్ డిక్లరేషన్‌ను ఆమోదించారు.
Click here to read full text speech
Glad to have met Quad Leaders during today’s Summit in Wilmington, Delaware. The discussions were fruitful, focusing on how Quad can keep working to further global good. We will keep working together in key sectors like healthcare, technology, climate change and capacity… pic.twitter.com/xVRlg9RYaF
— Narendra Modi (@narendramodi) September 22, 2024