“'వికసిత్ భారత్ కు యువశక్తి ఆధారం'
“ మహాదేవుని ఆశీస్సులతో గత పదేళ్లుగా కాశీలో వికాస ఢమరుకం (వికాస్ కా డమ్రూ) మ్రోగు తోంది”
“"కాశీ మన విశ్వాస తీర్థయాత్ర ప్రదేశం మాత్రమే కాదు, ఇది భారతదేశ శాశ్వత చైతన్యానికి శక్తివంతమైన కేంద్రం"
“విశ్వనాథ్ ధామ్ నిర్ణయాత్మక దిశానిర్దేశంతో భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తుంది”’
“నవ భారతావనికి స్ఫూర్తిగా నవ కాశీ ఆవిర్భవించింది”
“భారతదేశం ఒక ఆలోచన, సంస్కృతం దాని ప్రధాన వ్యక్తీకరణ. భారతదేశం ఒక ప్రయాణం, సంస్కృతం దాని చరిత్రలో ప్రధాన అధ్యాయం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి పుట్టినిల్లు, సంస్కృతం దాని మూలం”
“నేడు కాశీని వారసత్వానికి, అభివృద్ధికి నమూనాగా ఆదర్శంగా చూస్తున్నారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మికత చుట్టూ ఆధునికత ఎలా విస్తరిస్తోందో నేడు ప్రపంచం చూస్తోంది”
“కాశీ, కంచిలో వేద పారాయణం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' సూత్రాలు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలోని బి హెచ్ యు లో స్వతంత్ర సభగర్ లో జరిగిన సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాశీ సంసద్ ప్రతియోగిత బుక్ లెట్ ను, కాఫీ టేబుల్ బుక్ ను ఆయన ఆవిష్కరించారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగిత, కాశీ సంసద్ ఫోటోగ్రఫీ ప్రతియోగిత, కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత విజేతలకు, వారణాసిలోని సంస్కృత విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం సెట్లు, సంగీత వాయిద్యాలు, మెరిట్ స్కాలర్ షిప్ లను ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగిత గ్యాలరీని సందర్శించిన ఆయన 'సన్వర్తి కాశీ' థీమ్ పై ఫొటో ఎంట్రీలతో పాల్గొన్న వారితో ముచ్చటించారు.

 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ యువ విద్వాంసుల మధ్య ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేసి, ఇది జ్ఞాన గంగలో స్నానం చేసిన అనుభూతి లాంటిదని అన్నారు. పురాతన నగరం గుర్తింపును బలోపేతం చేస్తున్న యువత కృషిని ఆయన కొనియాడారు. భారత యువత అమృత్ కాల్ లో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం గర్వకారణమని ఆయన అన్నారు. "కాశీ నిత్య జ్ఞానానికి రాజధాని" అని ప్రధాన మంత్రి అన్నారు, కాశీ సామర్థ్యాలు,  స్వరూపం తిరిగి పూర్వ వైభవాన్ని పొందడం యావత్ దేశానికి గర్వకారణమని నొక్కి చెప్పారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగిత, కాశీ సంసద్ ఫోటోగ్రఫీ ప్రతియోగిత, కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత అవార్డులను ప్రదానం చేసి విజేతలను అభినందించారు. విజేతల జాబితాలో చోటు దక్కించు కోలేకపోయిన వారిని ప్రోత్సహించారు. "పాల్గొన్న వారెవరూ ఓడిపోలేదు లేదా వెనుకబడలేదు, బదులుగా, ప్రతి ఒక్కరూ ఈ అనుభవం నుండి నేర్చుకున్నారు" అని ప్రధాన మంత్రి అన్నారు, పాల్గొన్న వారందరూ ప్రశంసనీయులేనని పేర్కొన్నారు. కాశీ ఎంపీగా తన దార్శనికతను ముందుకు తీసుకెళ్లినందుకు శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర న్యాస్, కాశీ విద్వత్ పరిషత్, పండితులకు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు విడుదల చేసిన కాఫీ టేబుల్ పుస్తకాల్లో గత పదేళ్లలో కాశీ పునరుజ్జీవనం గురించిన కథ ఉందని ఆయన పేర్కొన్నారు.

 

గత పదేళ్లలో కాశీ సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ , మనమందరం మహదేవుడి సంకల్పానికి కేవలం సాధనాలు మాత్రమేనని ప్రధాన మంత్రి  స్పష్టంగా చెప్పారు. మహదేవ్ ఆశీస్సులతో గత పదేళ్లుగా కాశీలో 'వికాస్ కా డమ్రూ' ప్రతిధ్వనిస్తోందన్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టుల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ,  శివరాత్రి, రంగ్ భ రి ఏకాదశికి ముందు కాశీ నేడు అభివృద్ధి పండుగను జరుపుకుంటోందన్నారు. 'వికాస్ కీ గంగ' ద్వారా ప్రతి ఒక్కరూ మార్పును  చూశారని ఆయన అన్నారు.

కాశీ కేవలం విశ్వాస కేంద్రం మాత్రమే కాదని, భారతదేశ శాశ్వత చైతన్యానికి ఇది ఒక శక్తివంతమైన కేంద్రం అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచంలో భారతదేశ ప్రాచీన ప్రతిష్ఠ కేవలం ఆర్థిక శక్తిపై ఆధారపడి లేదని, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సంపద దాని వెనుక ఉందని ఆయన అన్నారు. కాశీ, విశ్వనాథ్ ధామ్ వంటి తీర్థాలు దేశాభివృద్ధికి 'యజ్ఞశాల' వంటివి అని అంటూ సంస్కృతి, ఆధ్యాత్మిక ప్రదేశాలతో భారత విజ్ఞాన సంప్రదాయానికి ఉన్న సంబంధాలను వివరించారు. కాశీ ఉదాహరణ ద్వారా తన అభిప్రాయాన్ని వివరిస్తూ, కాశీ శివుని భూమితో పాటు, బుద్ధుని బోధనల ప్రదేశం అని,  జైన తీర్థంకరుల జన్మస్థలం అలాగే ఆది శంకరాచార్యులకు జ్ఞానోదయ ప్రదేశం అని అన్నారు. దేశం నలుమూలల నుంచి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కాశీకి వస్తుండటంతో కాశీ కాస్మోపాలిటన్ ఆకర్షణ సంతరించుకుందని ఆయన అన్నారు. “ఇంత వైవిధ్యం ఉన్న చోట కొత్త ఆదర్శాలు పుట్టుకొస్తాయి. కొత్త ఆలోచనలు పురోభివృద్ధికి దోహదపడతాయి'' అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు.

 

"విశ్వనాథ్ ధామ్ ఒక నిర్ణయాత్మక దిశను ఇస్తుంది. భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తుంది" అని కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ రోజు ఆ నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. విశ్వనాథ్ ధామ్ కారిడార్ నేడు పాండిత్య ప్రకటనకు సాక్ష్యంగా నిలుస్తోందని, న్యాయశాస్త్ర సంప్రదాయాలను పునరుద్ధరిస్తోందని ఆయన ఉద్ఘాటించారు. "కాశీ శాస్త్రీయ స్వరాలను అలాగే లేఖన సంభాషణలను వినగలదు" అని ప్రధాన మంత్రి అన్నారు, ఇది ఆలోచనల మార్పిడిని ప్రోత్సహిస్తుందని, పురాతన విజ్ఞానాన్ని పరిరక్షిస్తుందని,  కొత్త భావజాలాలను సృష్టిస్తుందని చెప్పారు. కాశీ సంసద్ సంస్కృత ప్రతియోగిత, కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగిత ఇటువంటి ప్రయత్నాలలో భాగమని, సంస్కృతం చదవాలనుకునే వేలాది మంది యువతకు స్కాలర్ షిప్ లతో పాటు పుస్తకాలు, దుస్తులు,  ఇతర అవసరమైన వనరులను అందిస్తున్నామని ఆయన అన్నారు. ఉపాధ్యాయులకు కూడా సహకరిస్తున్నట్టు తెలిపారు. కాశీ తమిళ సంగమం, గంగా పుష్కరాల మహోత్సవ్ వంటి 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' ప్రచారాల్లో విశ్వనాథ్ ధామ్ కూడా భాగమైందని, గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సామాజిక సమ్మిళిత సంకల్పాన్ని ఈ విశ్వాస కేంద్రం బలపరుస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. కాశీ పండితులు, విద్వత్ పరిషత్ లు కూడా ఆధునిక విజ్ఞాన దృక్పథంతో ప్రాచీన విజ్ఞానంపై కొత్త పరిశోధనలు చేస్తున్నాయని శ్రీ మోదీ తెలియజేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉచిత భోజన ఏర్పాట్లు చేసిన ఆలయ ట్రస్టు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. "కొత్త కాశీ నవ భారతదేశానికి ప్రేరణగా ఆవిర్భవించింది" అని ప్రధాని అన్నారు, విశ్వాస కేంద్రం సామాజిక , జాతీయ సంకల్పాలకు శక్తి కేంద్రంగా ఎలా మారుతుందో వివరించారు. ఇక్కడి నుంచి వచ్చే యువత ప్రపంచవ్యాప్తంగా భారతీయ విజ్ఞానం, సంప్రదాయం, సంస్కృతికి పతాకధారులుగా నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

"మన జ్ఞానం, సైన్స్ , ఆధ్యాత్మికత అభివృద్ధికి అమితంగా దోహదం చేసిన భాషలలో సంస్కృతం అత్యంత ముఖ్యమైనది. భారతదేశం ఒక ఆలోచన, సంస్కృతం దాని ప్రధాన వ్యక్తీకరణ. భారతదేశం ఒక ప్రయాణం, సంస్కృతం దాని చరిత్రలో ప్రధాన అధ్యాయం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి పుట్టినిల్లు, సంస్కృతం దాని మూలం” అన్నారు. ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం, సాహిత్యం, సంగీతం, కళలలో పరిశోధనలకు సంస్కృతం ప్రధాన భాషగా ఉన్న కాలాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఈ విభాగాల ద్వారానే భారత్ కు గుర్తింపు వచ్చిందన్నారు. కాశీ, కంచిలో వేద పారాయణం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'కు మూలమని అన్నారు.

 

ప్రధానమంత్రి మాట్లాడుతూ, ''ప్రస్తుతం కాశీని వారసత్వానికి, అభివృద్ధికి ఒక నమూనాగా చూస్తున్నారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మికత చుట్టూ ఆధునికత ఎలా విస్తరిస్తుందో నేడు ప్రపంచం చూస్తోంది” అన్నారు.  కొత్తగా నిర్మించిన ఆలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కాశీ మాదిరిగానే అయోధ్య ఎలా అభివృద్ధి చెందుతోందో వివరించారు. కుషినగర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రస్తావిస్తూ, దేశంలో బుద్ధుడికి సంబంధించిన ప్రదేశాలలో ఆధునిక మౌలిక సదుపాయాలు , సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రముఖంగా వివరించారు. వచ్చే ఐదేళ్లలో దేశం అభివృద్ధికి కొత్త వేగాన్ని అందిస్తుందని,  విజయానికి కొత్త నమూనాలను సృష్టిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇది మోదీ గ్యారంటీ అని, మోదీ గ్యారంటీ అంటే హామీ ని నెరవేర్చే హామీ అని స్పష్టం చేశారు. ఓటింగ్ ద్వారా ఎంపిక చేసిన ఎగ్జిబిషన్ లోని ఉత్తమ ఛాయాచిత్రాలను పర్యాటకులకు పిక్చర్ పోస్ట్ కార్డ్ లుగా ఉపయోగించాలని ప్రధాని కోరారు. స్కెచింగ్ కాంపిటీషన్ నిర్వహించాలని, ఉత్తమ స్కెచ్ లను పిక్చర్ పోస్ట్ కార్డ్ లుగా రూపొందించాలని సూచించారు. కాశీకి రాయబారులు, అనువాదకులను తయారు చేయడానికి గైడ్ పోటీ పెట్టాలని తాను చేసిన సూచనను ఆయన పునరుద్ఘాటించారు. కాశీ ప్రజలే తమకు గొప్ప బలమని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, ప్రతి కాశీ నివాసికి సేవకుడిగా, స్నేహితుడిగా సహాయం చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"