శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.
కో-బ్రాండెడ్ రూపే కార్డు కు మారిశస్ లో డమెస్టిక్ కార్డు గా పేరుపెట్టడం జరుగుతుంది అని మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ తెలియ జేశారు. ఈ రోజు న ప్రారంభించుకొంటున్న ఈ కార్డు తో రెండు దేశాల పౌరుల కు ఎంతో సౌకర్యం లభిస్తుంది అని ఆయన అన్నారు.
అయోధ్య ధామ్ లో శ్రీ రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కు గాను శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రానీల్ విక్రమ సింఘె ప్రధాన మంత్రి కి అభినందనల ను తెలియ జేశారు. శతాబ్దాల తరబడి గా ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల ను గురించి ఆయన ఈ సందర్భం లో నొక్కి చెప్పారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ యొక్క గతి ని కొనసాగించడం తో పాటు సంబంధాల ను గాఢతరం చేసుకోవడం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అనేటటువంటి ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మూడు మిత్ర దేశాలు.. భారతదేశం, శ్రీ లంక, మరియు మారీశస్.. లకు ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్తూ, వాటి మధ్య గల చరిత్రాత్మక సంబంధాలు ఆధునిక డిజిటల్ సంధానం రూపాన్ని సంతరించుకొన్నాయి అన్నారు. ప్రజల కు అభివృద్ధి ఫలాల ను అందించే దిశ లో ప్రభుత్వం యొక్క నిబద్ధత కు ఇది రుజువు అని ఆయన అన్నారు. ఫిన్‌టెక్ కనెక్టివిటీ సరిహద్దుల కు ఆవల లావాదేవీల ను మరియు సంబంధాల ను పెంపొందింప చేస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ‘‘భారతదేశం యొక్క యుపిఐ లేదా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఈ రోజు న ఒక క్రొత్త భూమిక తో ముందుకు వస్తున్నది; అదే, యునైటింగ్ పార్ట్ నర్స్ విద్ ఇండియా ’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది భారతదేశం లో ఒక విప్లవాత్మకమైన మార్పు ను తీసుకు వచ్చింది. దీనిలో పాలుపంచుకొనే మారుమూల పల్లెల లోని అతి చిన్న విక్రయదారులు కూడాను యుపిఐ మాధ్యం ద్వారా లావాదేవీల ను జరుపుతున్నారు. వారు డిజిటల్ చెల్లింపుల ను చేస్తున్నారు అని పేర్కొన్నారు. యుపిఐ లావాదేవీల సౌలభ్యాన్ని మరియు వేగాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కిందటి సంవత్సరం లో 2 లక్షల కోట్ల రూపాయల లేదా 8 ట్రలియన్ శ్రీ లంక రూపాయల లేదా ఒక ట్రిలియన్ మారీశస్ రూపాయల విలువ కలిగిన 100 బిలియన్ కు పైచిలకు లావాదేవీ లు యుపిఐ మాధ్యం ద్వారా జరిగాయి అని వివరించారు. జిఇఎమ్ ద్వారా వరుస లో ఆఖరి వ్యక్తి వరకు సేవల ను అందించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు; జిఇఎమ్ త్రయం అనేది ఒకటి: బ్యాంకు ఖాతా, రెండు: ఆధార్ మరియు మూడు: మొబైల్ ఫోన్ లను సూచిస్తుంది. ఈ మార్గం లో 34 లక్షల కోట్ల రూపాయల ను (ఇది 400 బిలియన్ యుఎస్ డాలర్ విలువ కు సమానం) లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల లోకి బదలాయించడం జరిగింది. ప్రపంచం లో అతి పెద్దది అయినటువంటి టీకా మందు ను ఇప్పించే కార్యక్రమాన్ని భారతదేశం కోవిన్ (CoWin) ప్లాట్ ఫార్మ్ ద్వారా అమలు పరచింది అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం అనేది పారదర్శకత్వాన్ని ప్రోత్సహిస్తూ, అవినీతి ని తగ్గిస్తూ, సమాజం లో అన్ని వర్గాల వారి ని కలుపుకొని ముందుకు సాగిపోతూ ఉండడాన్ని పెంచుతున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ ‘పొరుగు దేశాల కు ప్రాధాన్యం’ అనేది భారతదేశం యొక్క విధానం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు; మా సముద్ర సంబంధి దృష్టి కోణం సాగర్ (ఎస్ఎజిఎఆర్), అంటే.. సెక్యూరిటీ ఎండ్ గ్రోథ్ ఫార్ ఆల్ ఇన్ ద రీజియన్ కు సంకేత చిహ్నం. భారతదేశం తన అభివృద్ధి ని తన ఇరుగు పొరుగు దేశాల అభివృద్ధి నుండి వేరు చేసి చూడదు.’’ అని ఆయన అన్నారు.
శ్రీ లంక అధ్యక్షుడు కిందటి సారి సందర్శన కు వచ్చిన సందర్భం లో, ఆమోదించినటువంటి విజన్ డాక్యుమెంటు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఫినాన్శల్ కనెక్టివిటీ ని బలపరచడం ఆ పత్రం లోని కీలకాంశం అని ప్రముఖం గా ప్రకటించారు. ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ తో కూడా ఆయన జి-20 సమిట్ లో విశిష్ట అతిథి గా పాల్గొన్నందువల్ల ఈ విధమైన చర్చల ను జరపడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు.
యుపిఐ తో జత పడడం అనేది శ్రీ లంక కు మరియు మారీశస్ కు ప్రయోజనకారి కాగలదు అనే విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. దీని వల్ల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేశన్ కు దన్ను లభిస్తుంది, స్థానిక ఆర్థిక వ్యవస్థ లు సకారాత్మకమైన మార్పున కు నోచుకొంటాయి; పర్యటన రంగాని కి ప్రోత్సాహం లభిస్తుంది అని ఆయన అన్నారు. ‘‘యుపిఐ తో ముడిపడి ఉన్న ప్రదేశాల కు వెళ్ళేందుకు భారతీయ పర్యటకులు ప్రాధాన్యాన్ని ఇస్తారని నేను నమ్మకం తో ఉన్నాను. శ్రీలంక లో నివసిస్తున్న భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు మరియు అక్కడ చదువుకొంటున్న విద్యార్థులు కూడా దీని ద్వారా ప్రత్యేక ప్రయోజనాల ను అందుకొంటారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నేపాల్, భూటాన్, సింగపూర్, గల్ఫ్ లో యుఎఇ ల తరువాత ప్రస్తుతం ఆఫ్రికా లో మారీశస్ నుండి రూపే కార్డు ను ప్రారంభించడం జరుగుతున్నది. ఇది మారీశస్ నుండి భారతదేశాని కి విచ్చేసే ప్రజల కు కూడా సౌకర్యవంతం గా ఉంటుంది. నగదు ను కొనుగోలు చేయవలసిన అవసరం సైతం తగ్గుతుంది. యుపిఐ మరియు రూపే కార్డు వ్యవస్థ లు మన సొంత కరెన్సీ లో చెల్లింపుల ను జరుపుకొనే సౌలభ్యాన్ని తక్కువ ఖర్చు లో వాస్తవ కాల ప్రాతిపదిక న వీలు కల్పిస్తాయి. రాబోయే కాలం లో, మనం సరిహద్దు ఆవల జరపవలసిన చెల్లింపుల ను పర్సన్ టు పర్సన్ (పి2పి) చెల్లింపు సదుపాయం పద్ధతి కి మారవచ్చును అని ప్రధాన మంత్రి వివరించారు.
ఈ రోజు న ప్రారంభించుకొన్న సౌకర్యాలు గ్లోబల్ సౌథ్ (వికాస శీల దేశాల) సహకారం తాలూకు సాఫల్యాన్ని సూచిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మన సంబంధాలు లావాదేవీల కు మాత్రమే పరిమితమైనవి కావు, అవి చరిత్రాత్మకమైనటువంటి సంబంధాలు’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మూడు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు శక్తివంతం గా మారాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారతదేశం గత పది సంవత్సరాల లో తన ఇరుగు పొరుగు మిత్ర దేశాల కు సమర్థన ను అందిస్తున్న విషయాన్ని ప్రధాన మంత్రి పేర్కొంటూ, భారతదేశం తన మిత్రుల కు సంక్షోభ ఘడియల లో వెన్నంటి నిలుస్తుంది, అటువంటి సంక్షోభ ఘడియల లో ప్రాకృతిక ఆపద లు, లేదా ఆరోగ్యం సంబంధి సమస్యలు, లేదా ఆర్థిక సమస్యలు లేదా అంతర్జాతీయ వేదిక లో సమర్థన.. వంటివి కావచ్చు అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం మొట్టమొదటగా స్పందించే దేశం; మరి భారతదేశం ఇదే ధోరణి ని కొనసాగిస్తుంది కూడా’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించిన కాలం లో సైతం గ్లోబల్ సౌథ్ దేశాల ఆందోళనల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్న విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు. భారతదేశం యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాలూకు ప్రయోజనాల ను గ్లోబల్ సౌథ్ దేశాల కు విస్తరించడాని కి గాను ఒక సోశల్ ఇంపాక్ట్ ఫండు ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ రోజు న జరిగిన ప్రారంభ కార్యక్రమం లో ఒక ముఖ్య పాత్ర ను పోషించినటువంటి అధ్యక్షుడు శ్రీ రానీల్ విక్రమ సింఘె కు మరియు ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ కు ప్రధాన మంత్రి హృదయ పూర్వక కృతజ్ఞత ను తెలియజేసి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మూడు దేశాల కేంద్ర బ్యాంకుల కు మరియు ఏజెన్సీల కు కూడా ఆయన ధన్యవాదాల ను తెలియ జేశారు.
పూర్వరంగం
భారతదేశం ఫిన్‌టెక్ ఇనొవేశన్ లో మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో ఒక నాయకత్వ స్థానాని కి ఎదిగింది. అభివృద్ధి సాధన లో మన అనుభవాల ను మరియు నూతన ఆవిష్కరణల ను భాగస్వామ్య దేశాల కు వెల్లడించాలి అంటూ ప్రధాన మంత్రి గట్టిగా చెప్పారు. శ్రీ లంక తో, మారీశస్ తో భారతదేశాని కి పటిష్టమైన, సాంస్కృతిక ప్రజా సంబంధాలు ఉన్నందువల్ల ఈ రోజు న ప్రారంభించిన సేవలు వేగవంతమైనటువంటి మరియు అంతరాయాల కు తావు లేని అటువంటి డిజిటల్ లావాదేవీ ల సౌలభ్యాన్ని విస్తృత శ్రేణి ప్రజానీకాని కి అందుబాటు లోకి తీసుకు వచ్చి, దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీ ని వృద్ధి చెందింపచేయగలదు.
ఈ తరహా సేవల ప్రారంభం శ్రీ లంక కు, మారీశస్ కు ప్రయాణించే భారతదేశ పౌరుల కు మరియు భారతదేశాని కి ప్రయాణించే మారిశస్ పౌరుల కు యుపిఐ ద్వారా సెటిల్‌మెంట్ సంబంధి సేవల లభ్యత కు వీలు కల్పిస్తాయి. మారీశస్ లో రూపే కార్డు సేవల విస్తరణ, రూపే యంత్రాంగం ల పై ఆధారపడిన కార్డుల ను జారీ చేసేందుకు మారిశస్ లోని బ్యాంకుల కు వీలు ను కల్పిస్తుంది; అలాగే, భారతదేశం లోను, మారిశస్ లోను సెటిల్‌మెంట్ లకు రూపే కార్డు ను ఉపయోగించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
A special day for digital connectivity between India, Sri Lanka and Mauritius. pic.twitter.com/Ra0FPTN4qy
— PMO India (@PMOIndia) February 12, 2024
भारत का Unified Payments Interface, यानि UPI, अब नया दायित्व निभा रहा है – Uniting Partners with India: PM @narendramodi pic.twitter.com/Xj9OOJOJIp
— PMO India (@PMOIndia) February 12, 2024
भारत में Digital Public Infrastructure से एक क्रांतिकारी परिवर्तन आया है: PM @narendramodi pic.twitter.com/q5LfOBlvLm
— PMO India (@PMOIndia) February 12, 2024
भारत की नीति है Neighbourhood First: PM @narendramodi pic.twitter.com/vcqS8e0DoC
— PMO India (@PMOIndia) February 12, 2024
मुझे विश्वास है कि श्रीलंका और मॉरीशस का UPI प्रणाली से
— PMO India (@PMOIndia) February 12, 2024
जुड़ने से, दोनों देशों को भी लाभ मिलेगा: PM pic.twitter.com/ZT6A98EAg5
चाहे आपदा प्राकृतिक हो, हेल्थ संबंधी हो, economic हो या अंतर्राष्ट्रीय पटल पर साथ देने की बात हो, भारत first responder रहा है, और आगे भी रहेगा: PM @narendramodi pic.twitter.com/FMr92Zj9zG
— PMO India (@PMOIndia) February 12, 2024