ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 ఏళ్ల వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 సంవత్సరాల క్రితం 2003 సెప్టెంబర్ 28న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ప్రారంభమైంది. కాలక్రమేణా, ఇది ఒక గ్లోబల్ ఈవెంట్‌గా రూపాంతరం చెందింది, భారతదేశంలోని ప్రధాన వ్యాపార శిఖరాగ్ర సమావేశాలలో ఒకటిగా హోదాను పొందింది.
ఈ సందర్బంగా పరిశ్రమల దిగ్గజాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
వెల్స్ పన్ చైర్మన్ శ్రీ బికె గోయెంకా వైబ్రంట్ గుజరాత్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇది నిజమైన ప్రపంచ ఈవెంట్‌గా మారిందని అన్నారు. పెట్టుబడి ప్రోత్సాహమే ధ్యేయంగా ఉన్న నాటి ముఖ్యమంత్రి అయిన ప్రస్తుత ప్రధాని దార్శనికతను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇటీవలే భూకంపం వల్ల దెబ్బతిన్న కచ్ ప్రాంతంలో విస్తరించాలని శ్రీ మోదీ తనకు మొదటి వైబ్రెంట్ గుజరాత్ సమయంలో ఇచ్చిన సలహాను, అప్పట్లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రి సలహా తమకు చారిత్రాత్మకమైనదని, పూర్తి సహాయ సహకారాలతో చాలా తక్కువ సమయంలో ఉత్పత్తిని ప్రారంభించగలిగామని గోయెంకా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత కచ్, ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతం కాకుండా అందని ద్రాక్ష వంటిదని, త్వరలో ఈ ప్రాంతం ప్రపంచానికి గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా మారుతుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య 2009లో ప్రధానమంత్రి ఆశావాదాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. వైబ్రెంట్ గుజరాత్ ఆ సంవత్సరం కూడా గొప్ప విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 70 శాతానికి పైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పారు.
వైబ్రంట్ గుజరాత్ 20వ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వానికి జెట్రో (దక్షిణాసియా) చీఫ్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ అభినందనలు తెలుపుతూ, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జపాన్ అతిపెద్ద సహకారాన్ని అందించిందని అన్నారు. 2009 నుండి గుజరాత్‌తో జెట్రో భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, సుజుకి గుజరాత్‌తో సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు కాలక్రమేణా మరింతగా పెరిగాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వం కారణంగా జెట్రో తన ప్రాజెక్ట్ కార్యాలయాన్ని 2013లో అహ్మదాబాద్‌లో ప్రారంభించిందని చెప్పారు. పెట్టుబడులను ప్రోత్సహించిన భారతదేశ కేంద్రీకృత టౌన్‌షిప్‌లను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. గుజరాత్‌లోని ప్రాజెక్ట్ ఆఫీస్ 2018లో ప్రాంతీయ కార్యాలయాన్నీ అప్‌గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. గుజరాత్ దాదాపు 360 జపాన్ కంపెనీలు, ఫ్యాక్టరీలకు నిలయంగా ఉందని సుజుకి తెలియజేశారు. భారతదేశంలో సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఔషధ రంగాల వంటి భవిష్యత్ వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్‌లో సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టి సారించే జపాన్ వ్యాపార ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించడం గురించి తెలియజేశారు. భారతదేశాన్ని పెట్టుబడులకు కావాల్సిన ప్రదేశంగా మార్చడంలో మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాని మోదీకి సుజుకీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీ లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ వైబ్రంట్ గుజరాత్ ప్రారంభించిన ట్రెండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలకు అవకాశం కలిపిస్తుందని, భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా మార్చిందని అన్నారు. ఇందుకు ప్రధానమంత్రి దార్శనికత, సమర్థతలే కారణమని కొనియాడారు. ప్రధాన మంత్రి సారథ్యంలో గ్లోబల్ ఏకాభిప్రాయ నిర్మాతగా అవతరించిన జి20కి ఆయన అభినందించారు. ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా గుజరాత్ స్థితిని, ప్రపంచ పోటీతత్వాన్ని ప్రభావవంతమైన మార్గంలో ఎలా ప్రదర్శిస్తుందో శ్రీ మిట్టల్ నొక్కిచెప్పారు. రాష్ట్రంలోని ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు
సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఇరవై ఏళ్ల క్రితం నాటిన విత్తనాలు అద్భుతమైన, వైవిధ్యమైన వైబ్రెంట్ గుజరాత్ రూపాన్ని సంతరించుకున్నాయని వ్యాఖ్యానించారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాలుపంచుకుంటున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వైబ్రంట్ గుజరాత్ అనేది రాష్ట్రానికి బ్రాండింగ్ వరకే కాదని, బంధాన్ని బలోపేతం చేసే సందర్భమని పునరుద్ఘాటించిన ప్రధాని, ఈ శిఖరాగ్ర సమావేశం తనతో ముడిపడి ఉన్న దృఢమైన బంధానికి, రాష్ట్రంలోని 7 కోట్ల మంది ప్రజల సామర్థ్యాలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. "ఈ బంధం ప్రజలకు నాపై ఉన్న అపారమైన ప్రేమపై ఆధారపడి ఉంది" అని ఆయన చెప్పారు.
2001 భూకంపం తర్వాత గుజరాత్ పరిస్థితిని ఊహించడం కష్టమని అన్నారు. భూకంపం రాకముందే గుజరాత్‌లో సుదీర్ఘ కరువు నెలకొంది. మాధవ్‌పురా మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ పతనంతో ఇతర సహకార బ్యాంకుల్లో కూడా చైన్ రియాక్షన్‌కు దారితీసింది. ఆ సమయంలో ప్రభుత్వంలో తాను కొత్త పాత్రలో ఉన్నానని, ఇది తనకు కొత్త అనుభవమని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, హృదయ విదారకమైన గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్‌లో హింస చెలరేగింది. ముఖ్యమంత్రిగా తనకు అనుభవం లేకపోయినా గుజరాత్‌పై, అక్కడి ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీ మోదీ అన్నారు. గుజరాత్ పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని, ఆ నాటి ఎజెండాతో నడిచే సంక్షోభ కారకులను ఆయన గుర్తు చేసుకున్నారు.
“పరిస్థితులు ఎలాగైనా గుజరాత్‌ను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కిస్తానని నేను ప్రతిన బూనాను. మేము పునర్నిర్మాణం గురించి మాత్రమే ఆలోచించడం లేదు, దాని భవిష్యత్తు కోసం కూడా ప్రణాళికలు వేస్తున్నాము. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌ను దీనికి ప్రధాన మాధ్యమంగా మార్చాము”, అని ప్రధాన మంత్రి అన్నారు. వైబ్రంట్ గుజరాత్ రాష్ట్ర స్ఫూర్తిని పెంపొందించడానికి, ప్రపంచంతో మరింత దగ్గరవడానికి ఒక మాధ్యమంగా మారిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాధికారం, దృష్టి కేంద్రీకరించే విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం ఒక మాధ్యమంగా మారిందని, అదే సమయంలో దేశంలోని పరిశ్రమ సామర్థ్యాన్ని కూడా తెరపైకి తెచ్చిందని ఆయన నొక్కి చెప్పారు. అనేక రంగాలలో లెక్కలేనన్ని అవకాశాలను అందించడానికి, దేశంలోని ప్రతిభను ప్రదర్శించడానికి, దేశం పవిత్రత, వైభవం, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రముఖంగా ఆకర్షణీయంగా చేసేలా, వైబ్రంట్ గుజరాత్ సమర్థవంతంగా ఉపయోగం అయిందని ఆయన అన్నారు. సమ్మిట్ నిర్వహణ సమయం గురించి ప్రస్తావిస్తూ, నవరాత్రి, గర్బా సందడి సమయంలో వైబ్రంట్ గుజరాత్ నిర్వహించడం వల్ల రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఒక పండుగగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.
గుజరాత్ పట్ల అప్పటి కేంద్ర ప్రభుత్వం చూపిన ఉదాసీనతను ప్రధాని గుర్తు చేసుకున్నారు. 'గుజరాత్ అభివృద్ధి ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది' అని ఆయన చెప్పినప్పటికీ, గుజరాత్ అభివృద్ధి రాజకీయ పార్శ్వం నుండి చూసారని, బెదిరింపులకు పాల్పడినా గుజరాత్‌నే విదేశీ ఇన్వెస్టర్లు ఎంచుకున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం లేనప్పటికీ ఇది జరిగింది. సుపరిపాలన, న్యాయమైన, విధాన ఆధారిత పాలన, వృద్ధి, పారదర్శకతతో సమానమైన వ్యవస్థ ప్రధాన ఆకర్షణ అని ఆయన అన్నారు.
2009లో వైబ్రంట్ గుజరాత్ ఎడిషన్ ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకు పోతున్నప్పుడు ప్రధాని గుర్తు చేసుకుంటూ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ముందుకెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించానని ఉద్ఘాటించారు. ఫలితంగా, 2009 వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా గుజరాత్ విజయానికి కొత్త అధ్యాయం లిఖించబడిందని ప్రధాని నొక్కిచెప్పారు.
సమ్మిట్ విజయానికి ప్రస్థానాన్ని ప్రధాని వివరించారు. 2003 ఎడిషన్ కేవలం కొన్ని వందల మందిని మాత్రమే ఆకర్షించింది; ఈరోజు 40000 మందికి పైగా ప్రతినిధులు, 135 దేశాల నుంచి సమ్మిట్‌లో పాల్గొంటున్నాయని ఆయన తెలియజేశారు. ఎగ్జిబిటర్ల సంఖ్య కూడా 2003లో 30 మంది నుండి నేడు 2000కి పైగా పెరిగింది.
వైబ్రెంట్ గుజరాత్ విజయానికి ప్రధాన అంశాలు ఆలోచన, భావన మరియు అమలు అని ప్రధాన మంత్రి అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ వెనుక ఉన్న ఆలోచన, భావనల ధైర్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఇతర రాష్ట్రాల్లో దీనిని అనుసరించారని చెప్పారు.
"ఆలోచన ఎంత గొప్పదైనా, వ్యవస్థను సమీకరించడం, ఫలితాలను అందించడం వారికి అత్యవసరం", అటువంటి స్థాయి సంస్థకు తీవ్రమైన ప్రణాళిక, సామర్థ్య పెంపుదలలో పెట్టుబడులు, ఖచ్చితమైన పర్యవేక్షణ, అంకితభావం అవసరమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వైబ్రంట్ గుజరాత్‌తో, అదే అధికారులు, వనరులు, నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం మరే ఇతర ప్రభుత్వం ఊహించలేనిది సాధించిందని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రభుత్వం లోపల మరియు వెలుపల కొనసాగుతున్న వ్యవస్థ, ప్రక్రియతో ఈ రోజు వైబ్రెంట్ గుజరాత్ ఒకే సారి జరిగిన కార్యక్రమం నుండి ఒక సంస్థగా మారిందని ప్రధాన మంత్రి అన్నారు.
దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉన్న వైబ్రెంట్ గుజరాత్ స్ఫూర్తిని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. సమ్మిట్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇతర రాష్ట్రాలను అభ్యర్థించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
20వ శతాబ్దపు గుజరాత్ గుర్తింపు, వ్యాపార ఆధారితమైందని పేర్కొన్న ప్రధాన మంత్రి, 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దానికి జరిగిన పరివర్తన గుజరాత్ వ్యవసాయంలో పవర్‌హౌస్‌గా మరియు ఆర్థిక కేంద్రంగా మారడానికి దారితీసిందని, పారిశ్రామిక, ఉత్పాదక పర్యావరణ వ్యవస్థగా గుర్తింపు పొందిందని తెలిపారు. గుజరాత్ వాణిజ్య ఆధారిత ఖ్యాతిని బలపరిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిశ్రమలకు ఇంక్యుబేటర్‌గా పనిచేస్తున్న వైబ్రెంట్ గుజరాత్‌కు ఇటువంటి పరిణామాల విజయానికి ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతమైన విధాన రూపకల్పన, సమర్థవంతమైన ప్రాజెక్ట్ అమలుతో సాధ్యమైన గత 20 సంవత్సరాల నుండి సాధించిన విజయ గాథలు, కేస్ స్టడీలను ప్రస్తావిస్తూ, టెక్స్‌టైల్, వస్త్ర పరిశ్రమలో పెట్టుబడులు, ఉపాధి వృద్ధికి ప్రధాన మంత్రి ఉదాహరణగా చెప్పారు. ఎగుమతుల్లో రికార్డు వృద్ధి సాధించిందని తెలిపారు. 2001తో పోల్చితే పెట్టుబడులు 9 రెట్లు పెరిగాయని, తయారీ రంగంలో 12 రెట్లు పెరిగిందని, భారతదేశ రంగుల తయారీలో 75 శాతం, సహకారం, వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల్లోనూ, పెట్టుబడిలో అత్యధిక వాటా ఉన్న ఆటోమొబైల్ రంగాన్ని శ్రీ మోదీ స్పృశించారు. దేశం, 30,000 కంటే ఎక్కువ కార్యాచరణ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, వైద్య పరికరాల తయారీలో 50 శాతానికి పైగా వాటా మరియు కార్డియాక్ స్టెంట్ల తయారీలో 80 శాతం వాటా, ప్రపంచంలోని 70 శాతానికి పైగా వజ్రాల ప్రాసెసింగ్, భారతదేశ వజ్రాల ఎగుమతులకు 80 శాతం సహకారం, మరియు సిరామిక్ టైల్స్, శానిటరీ వేర్ మరియు వివిధ సిరామిక్ ఉత్పత్తుల తయారీ యూనిట్లతో దేశంలోని సిరామిక్ మార్కెట్‌లో 90 శాతం వాటా ఉంది. ప్రస్తుత లావాదేవీ విలువ 2 బిలియన్ అమెరికన్ డాలర్లతో భారతదేశంలో గుజరాత్ అతిపెద్ద ఎగుమతిదారు అని కూడా శ్రీ మోదీ తెలియజేశారు. "రాబోయే కాలంలో డిఫెన్స్ తయారీ చాలా పెద్ద రంగం అవుతుంది" అన్నారాయన.
“మేము వైబ్రట్ గుజరాత్‌ను ప్రారంభించినప్పుడు, ఈ రాష్ట్రం దేశ ప్రగతిలో గ్రోత్ ఇంజిన్‌గా మారాలనేది మా ఉద్దేశం. ఈ దృక్పథం వాస్తవంగా మారడాన్ని దేశం చూసింది. 2014లో భారత్‌ను ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా మార్చాలనే లక్ష్యం అంతర్జాతీయ ఏజెన్సీలు, నిపుణులలో కదలిక తెచ్చింది" అని ఆయన అన్నారు. “ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మనం భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా మారే మలుపులో నిలబడి ఉన్నాం. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాల్సి ఉంది.'' అని ప్రధాని స్పష్టం చేశారు. భారతదేశానికి కొత్త అవకాశాలను అందించడంలో సహాయపడే రంగాలపై దృష్టి పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. స్టార్టప్ ఎకోసిస్టమ్, అగ్రి-టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, శ్రీ అన్నకు ఊపందుకునే మార్గాల గురించి చర్చించాలని ఆయన కోరారు.
ఆర్థిక సహకార సంస్థలకు పెరుగుతున్న ఆవశ్యకత గురించి మాట్లాడిన ప్రధాన మంత్రి, గిఫ్ట్ సిటీకి పెరుగుతున్న ఔచిత్యాన్ని గురించి వ్యాఖ్యానించారు. “గిఫ్ట్ సిటీ మా మొత్తం ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కేంద్రం, రాష్ట్రం, ఐఎఫ్ఎస్సి అధికారులు ప్రపంచంలోనే అత్యుత్తమ నియంత్రణ వాతావరణాన్ని సృష్టించేందుకు కలిసి పని చేస్తారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా పోటీ ఆర్థిక మార్కెట్‌గా మార్చడానికి మనం ప్రయత్నాలను ముమ్మరం చేయాలి”, అన్నారాయన.
విరామం ఇవ్వడానికి ఇది సమయం కాదని ప్రధాని అన్నారు. “గత 20 సంవత్సరాల కంటే రాబోయే 20 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. వైబ్రెంట్ గుజరాత్ 40 ఏళ్లు పూర్తి చేసుకుంటే, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి శతాబ్దికి ఎంతో దూరంలో లేదు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన దేశంగా మార్చే రోడ్‌మ్యాప్‌ను రూపొందించాల్సిన సమయం ఇది”, ఈ సమ్మిట్ ఈ దిశగా సాగుతుందనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ సీఆర్ పాటిల్, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పరిశ్రమల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం...
అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 సంవత్సరాల వేడుకను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పరిశ్రమ సంఘాలు, వర్తక, వాణిజ్య రంగానికి చెందిన ప్రముఖులు, యువ పారిశ్రామికవేత్తలు, ఉన్నత, సాంకేతిక విద్యా కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 సంవత్సరాల క్రితం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ప్రారంభమైంది. 28 సెప్టెంబర్ 2003న, వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రయాణం ప్రారంభమైంది. కాలక్రమేణా, ఇది గ్లోబల్ ఈవెంట్‌గా రూపాంతరం చెందింది, భారతదేశంలోని ప్రధాన వ్యాపార శిఖరాగ్ర సమావేశాలలో ఒకటిగా హోదాను పొందింది. 2003లో దాదాపు 300 మంది అంతర్జాతీయ భాగస్వాములతో, 2019లో 135 పైగా దేశాల నుండి వేలాది మంది ప్రతినిధుల నుండి సమ్మిట్ అఖండమైన భాగస్వామ్యాన్ని సాధించింది.
గత 20 సంవత్సరాలలో, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ "గుజరాత్‌ను ఒక ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడం" నుండి "నవ భారతాన్ని రూపొందించడం" వరకు అభివృద్ధి చెందింది. వైబ్రంట్ గుజరాత్ అసమాన విజయం, దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్‌గా మారింది. ఇతర భారతీయ రాష్ట్రాలను కూడా ఇటువంటి పెట్టుబడి సదస్సుల నిర్వహణకు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.
Vibrant Gujarat is not merely an event of branding, but also an event of bonding. pic.twitter.com/Cy3vibykSW
— PMO India (@PMOIndia) September 27, 2023
Vibrant Gujarat Summit stands as a proof of Gujarat's steadfast dedication to economic growth. pic.twitter.com/AlAII9VZSQ
— PMO India (@PMOIndia) September 27, 2023
Idea, Imagination and Implementation are at the core of Vibrant Gujarat Summits. pic.twitter.com/yqDotdHhF9
— PMO India (@PMOIndia) September 27, 2023
Vibrant Gujarat Summits also served as a platform for other states. pic.twitter.com/2x6Rnqi4UO
— PMO India (@PMOIndia) September 27, 2023
Today India is the fastest growing economy in the world.
— PMO India (@PMOIndia) September 27, 2023
We are at a turning point where India is going to become a global economic powerhouse. pic.twitter.com/ChfkZbNWEH
India is set to become the third largest economy in the world. Therefore, I would also like to make an appeal to the industry: PM @narendramodi pic.twitter.com/OnexYsnitU
— PMO India (@PMOIndia) September 27, 2023
Gujarat has the GIFT City, the relevance of which is increasing every day. pic.twitter.com/0HY6RcALAU
— PMO India (@PMOIndia) September 27, 2023