జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో టోక్యో లోని నిప్పోన్ బుడోకన్ లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు. ఇరవై కి పైగా దేశాధినేతలు / ప్రభుత్వాధినేతలు సహా వంద కు పైగా దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ప్రియమైన మిత్రునిగా మరియు భారతదేశం-జపాన్ భాగస్వామ్యాని కి ఒక గొప్ప విజేత గా భావించిన పూర్వ ప్రధాని శ్రీ ఆబే యొక్క స్మృతి ని ఆదరించడం జరిగింది.
ప్రభుత్వ లాంఛనాల తో అంత్యక్రియలు జరిగిన అనంతరం, దివంగత ప్రధాని శ్రీ ఆబే యొక్క జీవన భాగస్వామి శ్రీమతి ఆకె ఆబే తో అకాసాకా పాలెస్ లో ప్రధాన మంత్రి భేటీ అయ్యారు. శ్రీమతి ఆబే కు తన హృదయ పూర్వక సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. పూర్వ ప్రధాని శ్రీ ఆబే తో తనకు ఉన్న ఆత్మీయ బంధాన్ని గురించి, భారతదేశం-జపాన్ సంబంధాల ను కొత్త శిఖరాల కు చేర్చడం లో శ్రీ ఆబే అందించినటువంటి గణనీయమైన తోడ్పాటు ను శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ తరువాత ప్రధాని శ్రీ కిశిదా కు తన సంతాపాన్ని మరో మారు వ్యక్తం చేయడం కోసం ఆయన తో కూడా ప్రధాన మంత్రి కాసేపు సమావేశమయ్యారు