ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, కొత్త సంవత్సరంలో భారతీయ శాస్ర్తవేత్తలు విజయవంతంగా రెండుకోవిడ్ వాక్సిన్‌లను అభివృద్ధి చేయడం పట్ల ప్రధానమంత్రి భారతీయ శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. భారత దేశ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ప్రంపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని, ఇది త్వరలో ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. దేశం ఎదుర్కొన్న వివిధ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు సిఎస్ఐఆర్‌తో సహా వివిధ శాస్త్రవిజ్ఞాన సంస్థలు కలసికట్టుగా ముందుకు రావడం పట్ల ప్రధానమంత్రి ప్రశంసించారు.
సిఎస్ఐఆర్ సాగిస్తున్న కృషిపై పాఠశాల విద్యార్ధులలో అవగాహన పెంచేందుకు వారితో మాట్లాడాల్సిందిగా ప్రధానమంత్రి సిఎస్ఐఆర్‌కు సూచించారు.ఇది వారిని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా చేసేందుకు ప్రేరణనిస్తుందని ఆయన చెప్పారు. దేశ అభివృద్ధిలో సిఎస్ఐఆర్ ఎన్‌పిఎల్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. గతంలో సాధించిన విజయాలను చర్చించడానికి ,భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందని ఆయన అన్నారు. నూతన ప్రమాణాలకు అనుగుణంగా సంస్థ కీలక పాత్ర పోషించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. స్వావలంబిత భారతదేశం దిశగా ముందుకు పొవడానికి ముందుకు రావలసిందిగా ఆయన కోరారు.
భారతదేశ టైమ్‌కీపర్‌గా సిఎస్ఐఆర్-ఎన్‌పిఎల్‌కి భారతదేశ భవిష్యత్తును మార్చే బాధ్యత ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు.
రాగల దశాబ్దాలలో, ఇండియా నాణ్యత, కొలతల విషయంలొ విదేశీ ప్రమాణాలపై దశాబ్దాలుగా ఆధారపడుతూ వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇండియా ప్రగతి వేగం, ఎదుగుదల, ప్రతిష్ఠ , ఇండియా బలం అన్నీ మన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయింపబడతాయని అన్నారు. మెట్రాలజీ అనేది ఏదైనా శాస్త్రీయమైన దాని సాధనకు ఒక కొలమానానికి పునాదిగా నిలుస్తుందన్నారు.కొలమానం లేకుండా పరిశోధన ముందుకు సాగలేదని ప్రధానమంత్రి అన్నారు.
మెట్రాలజీ అనేది కొలమానానికి సంబంధించిన శాస్త్రమని, ఇది ఏదైనా శాస్త్రీయ లక్ష్యసాధనకు పునాదిని ఏర్పరుస్తుందని ఆయన అన్నారు. ఏ పరిశోధన కూడా కొలమానం లేకుండా సాగదని అన్నారు. మనం సాధించే విజయం సైతం ఏదో ఒక కొలమానం కింద కొలవాల్సిందేనని అన్నారు. దేశ విశ్వసనీయత ఆ దేశ మెట్రాలజీ విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. మెట్రాలజీ అనేది ఒక అద్దం వంటిదని, మన స్థాయి ఏమిటో అది ప్రపంచానికి చూపుతుందని అన్నారు.
స్వావలంబిత భారతదేశ సాధన లో పరిమాణం, నాణ్యత రెండూ కలిగి ఉన్నాయన్నారుప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులు కేవలం నింపడం కాక భారతీయ ఉత్పత్తులు కొనుగోలు చేసే ప్రతి ఒక్క కస్టమర్ హృదయాన్ని గెలుచుకోవలసిందిగా ఆయన కోరారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవడమే కాక అంతర్జాతీయ ఆమోదాన్ని పొందాలన్నారు.
ఈ రోజు జాతికి అంకితం చేసిన భారతీయ నిర్దేశక్ ద్రవ్య, భారలోహాలు, పురుగుమందులు, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి రంగాల విషయంలో నాణ్యమైన ఉత్పత్తుల కు దోహద కారి అవుతుందని ఇందుకు సర్టిఫైట్ రెఫరెన్స్ మెటీరియల్ సిస్టమ్‌కు రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు.పరిశ్రమ ప్రస్తుతం నియంత్రణల కేంద్రిత వ్యవస్థకు బదులు వినియోగదారు కేంద్రిత విధానంవైపు వెళుతున్నదని అన్నారు. ఈ నూతన ప్రమాణాలతో, దేశవ్యాప్తంగా జిల్లాలలో స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు నిచ్చే ప్రచారం జరుగుతుందని ఇది ప్రత్యేకించి మన ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం అనేదానివల్ల పెద్ద ఎత్తున విదేశీ తయారీ కంపెనీలు ఇండియాకు స్థానిక సరఫరా చెయిన్ కోసం వస్తాయని అన్నారు. నూతన నాణ్యతా ప్రమాణాలతో ఎగుమతులు, దిగుమతులకు పూచీ ఉంటుందన్నారు. ఇది ఇది సాధారణ వినియోగదారుకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి అలాగే ఎగుమతిదారు ఎదుర్కొనే సమస్యలు తగ్గించడానికి ఉపకరిస్తుందని అన్నారు.
ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశ శాస్త్ర విజ్ఞాన ప్రగతికి అది చేసే కృషితో నేరుగా ముడిపడి ఉంటుందని అన్నారు. ఇది శాస్త్రవిజ్ఞానం, సాంకేతికత, పరిశ్రమకు సంబంధించి విలువ జోడింపు సైకిల్ వంటిదని అన్నారు. దీనిని వివరిస్తూ ప్రధానమంత్రి, శాస్త్రవిజ్ఞానం సాంకేతికతకు దారితీస్తుందని, సాంకేతికత పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఇందుకు బదులుగా పరిశ్రమ నూతన పరిశోధనకు సంబంధించి మరింతగా పెట్టుబడి పెడుతుందని అన్నారు. ఈ సైకిల్ మనల్ని నూతన అవకాశాలవైపు తీసుకువెళుతుందని చెప్పారు. సిఎస్ఐఆర్-ఎన్‌పిఎల్ లు వాల్యూ సైకిల్‌ను ముందుకు తీసుకుపోవడంలో ప్రధాన పోషించాయని ప్రధానమంత్రి అన్నారు.
సైన్సుకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్పత్తికి విలువ సృష్టింపు అనేది ఇవాళ్టి ప్రపంచంలో ఎంతో ముఖ్యమైనదని, ప్రత్యేకించి దేశం ఆత్మనిర్భర్ ఇండియా లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్న దశలో ఇది ముఖ్యమని అన్నారు. సిఎస్ఐఆర్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి తెలిపారు.
సిఎస్ఐఆర్ – ఎన్‌పిఎల్ నేషనల్ అటామిక్ టైమ్ స్కేలు విషయంలో ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దీనిని ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేశారు. నానా సెకండ్ వరకు కొలవడంలో దేశం స్వావలంబన సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. 2.8 నానో సెకండ్ ఖచ్చతితత్వం స్థాయి వరకు సాధించడం అనేది దానికదే ఒక పెద్ద సమర్ధతగా ప్రధాని తెలిపారు. ప్రస్తుతం భారత స్టాండర్డ్ టైమ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైమ్ తో 3 నానో సెకండ్లకంటే తక్కువ ఖచ్చితత్వంతో సరిపొలుతున్నదని అన్నారు. ఇది ఇస్రో వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతొ పనిచేసే సంస్థలకు ఎంతో ఉపయోగకారి అని ప్రధానమంత్రి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సంబంధమైన బ్యాంకింగ్, రైల్వేలు, రక్షణ, ఆరోగ్యం, టెలికం, వాతావరణ సూచనలు, విపత్తు నిర్వహణ, ఇలాగే చాలా రంగాలు ఈ విజయం ద్వారా ఎంతో లబ్ధి పొందనున్నాయని చెప్పారు.
ఇండస్ట్రీ 4.0ను బలోపేతం చేయడంలో టైమ్‌స్కేల్ పాత్ర గురించి ప్రధానమంత్రి సవివరంగా ప్రస్తావించారు. పర్యావరణ రంగంలో భారతదేశం కీలక స్థానానికి వెళుతున్నది. ఇప్పటివరకు వాయు నాణ్యత, ఉద్గారాలను కొలిచేందుకు అవసరమైన సాంకేతికత, ఉపకరణాలకు ఇండియా ఇతరులపై ఆధారపడుతూ వచ్చిందని అన్నారు. కానీ ప్రస్తుత విజయంతో ఈ రంగంలో స్వావలంబన సాధనకు వీలు కలుగుతుందని, ఇది మరింత సమర్ధమైన తక్కువ ఖర్చుతో కూడిన ఉపకరణాలు కాలుష్య నియంత్రణకు తయారు చేయడానికి వీలు పడుతుందని అన్నారు. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో వాయు నాణ్యత, ఉద్గారాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మన మార్కెట్ పెంచడానికి దోహదపడుతుందని అన్నారు. మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషి వల్ల మనం దీనిని సాధించగలిగినట్టు శ్రీ నరేంద్ర మోడీ తెలిపారు.
ప్రధానమంత్రి వివిధ విజ్ఞాన రంగాలలో పరిశోధన పాత్ర గురించి సవివరంగా ప్రస్తావించారుఉ. ఏ పురోగామి సమాజంలో అయినా పరిశోధన అనేది సహజ స్వభావం మాత్రమే కాక సహజ ప్రక్రియ అని అన్నారు. పరిశోధన ప్రభావం వాణిజ్య పరంగా లేదా సామాజికంగా కూడా ఉండవచ్చని, పరిశోధన మన విజ్ఞానాన్ని విస్తృతం చేసేందుకు , అవగాహనను పెంచేందుకు సహాయపడుతుందని అన్నారు. పరిశోధన నిర్దేశిత లక్ష్యంకాక, దాని భవిష్యత్ దిశ, పరిశోధన ఉపయోగాలను అన్ని వేళలా ఊహించడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు. అయితే ఖచ్చితంగా చెప్పగలిగినదేమంటే, పరిశోధన వినూత్న విజ్ఞానాకి దారితీస్తుందని, ఇది ఎన్నటికీ వృధా కాదని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి పలు ఉదాహరణలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. జెనిటిక్స్ పితామహుడుగా చెప్పుకునే మెండెల్ , నికొలాస్ టెసలాలు సాగించిన కృషి కి ఎంతో కాలం అనంతరం గుర్తింపు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా సందర్బాలలో పరిశోధన తక్షణ లక్ష్యాలను నెరవేర్చలేకపోవచ్చని , అయితే అదే పరిశోధన మరో ఇతర రంగానికి సంబంధించి మున్నెన్నడూ లేని కొత్త విషయాన్ని కనుగొనేందుకు దారితీయవచ్చని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి జగదీశ్ చంద్రబోస్ ఉదాహరణ తెలిపారు. జగదీశ్ చంద్ర బోస్ మైక్రోవేవ్ సిద్దాంతాన్ని వాణిజ్యపరంగా ముందుకు తీసుకుపోలేక పోయారని, కానీ ఇవాళ మొత్తం రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా దానిపైనే ఆధారపడి ఉన్నదని చెప్పారు.
ప్రపంచ యుద్దాల సమయంలో జరిగిన పరిశోధనలను ఉదహరిస్తూ ప్రధానమంత్రి ఆ పరిశోధనలు ఆ తర్వాతి కాలంలో వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పుల తెచ్చాయన్నారు. ఉదాహరణకు యుద్ధాలకోసం రూపొందించిన డ్రోన్ల ను ఫోటో షూట్‌లకు , సరకు సరఫరాకు వాడుతున్నారన్నారు. అందువల్ల మన యువ శాస్త్రవేత్తలు వివిధ రంగాలకు ఉపయోగపడేవిధంగా పరిశొధనలు సాగించాలని తమ రంగానికి మాత్రమే కాక ఇతర రంగాలకు కూడా తమ పరిశోధన ఉపయోగపడుతుందన్న దృష్టి తమ ముందుంచుకోవాలన్నారు.
ఎంత చిన్న పరిశోధన అయినా ప్రపంచ స్వరూపాన్ని ఎలా మార్చగలదో కూడా ప్రధానమంత్రి వివరించారు. ఇందుకు సంబంధించి ఆయన పలు ఉదాహరణలు ఇచ్చారు. విద్యుత్ ఇవాళ ప్రతి రంగాన్ని నడిపిస్తున్నదని అన్నారు. అది రవాణా, కమ్యూనికేషన్, పరిశ్రమ లేదా నిత్య జీవితం…ఇలా సకల రంగాలను నడిపిస్తున్నదని అన్నారు. అలాగే సెమికండక్టర్ ఆవిష్కరణ మన జీవితాలను డిజిటల్ విప్లవం దిశగా తీసుకువెళ్లిందన్నారు. ఇలాంటి ఎన్నో అవకాశాలు మన యువ పరిశొధకుల ముందు ఉన్నాయని ఆయన అన్నారు. వారుమొత్తంగా భిన్నమైన భవిష్యత్తునుతమ పరిశోధనల ద్వారా ఆవిష్కరించగలరని అన్నారు.
భవిష్యత్‌కు సన్నద్థత కలిగిన వాతావరణ వ్యవస్థలను రూపొందించేందుకు మన కృషికి సంబంధించిన వివరాలను ఆయన పొందుపరిచారు. ఇండియా గ్లోబల్ ఇన్నొవేషన్ ర్యాంకింగ్‌లలో అత్యున్నత 5 ర్యాంకులలోకి ఎగబాకిందని అంటూ ఇండియా పీర్ రివ్యూ సైన్స్ ఇంజనీరింగ్ పబ్లికేషన్లలో మూడవ స్థానంలో ఉందని అన్నారు. ఇది మౌలిక పరిశోధనపై ప్రత్యేక దృష్టిని తెలియజేస్తున్నదని చెప్పారు. పరిశ్రమ, సంస్థల మధ్య పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేయడం జరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలు తమ పరిశోధన శాలలను ఇండియాలొ ఏర్పాటు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంస్థలు చెప్పుకోదగిన రీతిలో పెరిగాయని చెప్పారు.
పరిశోధన ,ఆవిష్కరణల రంగంలో భారతీయ యువతకు అవకాశాలు అనంతంగా ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. అందువల్ల ఆవిష్కరణలను సంస్థాగతం చేయడం ఆవిష్కరణలంత కీలకమని అన్నారు. మేధోపరమైన ఆస్తులను రక్షించుకోవడాన్ని మన యువత అర్థం చేసుకోవాలని ప్రధాని అన్నారు. మన పేటెంట్లు చాలా ఉంటే వాటి ఉపయోగం కూడా ఎక్కువే ఉంటుందని గుర్తు చేశారు.మన పరిశోధన బలంగా ఉన్న రంగాలలో మన గుర్తింపు బలంగా ఉంటుందని , మనం నాయకత్వం వహిస్తామని అన్నారు. ఇది బలమైన బ్రాండ్ ఇండియాకు దారితీస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
శాస్త్రవేత్తలు కర్మయోగులని అంటూ ప్రధానమంత్రి, పరిశొధన శాలల్లో వరు రుషుల లాగా కృషి చేస్తున్నారని, 130 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలకు వారు ప్రతిరూపమని ప్రధానమంత్రి కొనియాడారు.