కరియప్ప గ్రౌండు లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించడం తో పాటు గా, ఎన్ సిసి దళాలు జరిపిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు. సైనిక కార్యాచరణ, స్లిదరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా సెయిలింగ్, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల లో ఎన్ సిసి కేడెట్ లు వారి యొక్క నైపుణ్యాల ను ప్రదర్శించడాన్ని కూడా ఆయన గమనించారు. ఉత్కృష్ట కేడెట్ లు ప్రధాన మంత్రి వద్ద నుంచి పతకాన్ని, బేటన్ ను స్వీకరించారు.
ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను దేశం జరుపుకొంటున్న వేళ ఉత్సవాల లో ఒక విభిన్న స్థాయి ఉత్సాహం తొణికిసలాడుతోందన్నారు. ఎన్ సిసి తో తనకు గల అనుబంధాన్ని ప్రధాన మంత్రి సగర్వం గా గుర్తు కు తెచ్చుకొన్నారు. దేశ ప్రజల పట్ల తనకు గల బాధ్యతల ను నెరవేర్చడం కోసం శక్తి ని ఇస్తున్న ఖ్యాతి ఎన్ సిసి కేడెట్ గా తాను పొందిన శిక్షణ కు దక్కుతుంది అని ఆయన అన్నారు.
దేశ నిర్మాణం లో లాలా లాజ్ పత్ రాయ్ గారు మరియు ఫీల్డ్ మార్శల్ కరియప్ప గారు లు అందించిన తోడ్పాటుల కు గాను ప్రధాన మంత్రి వారి కి నివాళులు అర్పించారు. ధైర్యవంతులైన ఈ ఇరువురు భారతదేశ పుత్రుల జయంతి ఈ రోజున నే కావడం గమనించదగ్గది.
కొత్త సంకల్పాల తో దేశం ముందుకు సాగిపోతున్నటువంటి కాలం లో ఎన్ సిసి ని బలోపేతం చేయడం కోసం చేపడుతున్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీనికోసం, దేశం లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సంఘాన్ని ఏర్పాటు చేయడమైందన్నారు. గడచిన రెండు సంవత్సరాల లో, ఒక లక్ష మంది కొత్త కేడెట్ లను దేశ సరిహద్దు ప్రాంతాల లో తీర్చి దిద్దడమైందని ఆయన అన్నారు.
రక్షణ సంస్థ ల ద్వారాల ను అమ్మాయి ల కోసం, అలాగే మహిళ ల కోసం తెరచి ఉంచడం కోసం తీసుకొంటున్న నిర్ణయాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. కేడెట్ లలో అమ్మాయి లు పెద్ద సంఖ్య లో ఉండటాన్ని ఆయన గమనించి, ఇది దేశ ప్రజల వైఖరి లో వస్తున్న మార్పునకు ఒక సంకేతం అని అభివర్ణించారు. ‘‘మీ తోడ్పాటు దేశాని కి అవసరం. మరి దీని కోసం అనేకమైన అవకాశాలు ఉన్నాయి’’ అని కేడెట్ లలోని అమ్మాయిల తో ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశం లోని కుమార్తె లు సైనిక్ స్కూళ్ళ లో ప్రవేశాలు తీసుకొంటున్నారు, మరి మహిళ లు సైన్యం లో ప్రధానమైన బాధ్యతల ను స్వీకరిస్తున్నారు అని ఆయన అన్నారు. దేశం లో కుమార్తె లు వాయుసేన లో యుద్ధ విమానాల ను సైతం నడుపుతున్నారు. ‘‘ఈ తరహా స్థితి లో మరింత మంది కుమార్తెల ను ఎన్ సిసి లోకి చేర్చుకోవాలి అనేది మన ప్రయాస కావాలి’’ అని ఆయన చెప్పారు.
కేడెట్ లలో యువత ప్రాతినిధ్యాన్ని గురించి ప్రధాన మంత్రి గమనించారు. వారి లో చాలా మంది ఈ శతాబ్ది లో జన్మించిన వారే అని ఆయన అన్నారు. దేశాన్ని 2047వ సంవత్సరం లోకి తీసుకు పోవడం లో యువత భూమిక ను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘మీ యొక్క ప్రయాస లు, మీ యొక్క సంకల్పం, మరి ఆ సంకల్పాల ను నెరవేర్చడం..ఇవి భారతదేశం యొక్క కార్యసిద్ధి, భారతదేశం సాఫల్యం అవుతాయి’’ అని ఆయన అన్నారు. ఏ దేశం లో అయితే యువత దేశ ప్రజల కే మొదటి ప్రాధాన్యం అనేటటువంటి ఆలోచన వైఖరి తో ముందుకు సాగుతుందో అటువంటి దేశాన్ని ప్రపంచం లో ఏ శక్తి కూడాను ఆపజాలదు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆట మైదానం లో మరియు స్టార్ట్-అప్ ఇకోస్పియర్ లో భారతదేశం యొక్క సాఫల్యం ఈ విషయాన్ని చాలా స్పష్టం గా వివరిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘అమృత కాలం’ లో అంటే, వర్తమానం నుంచి మొదలు పెడితే రాబోయే 25 సంవత్సరాల లో, దేశం యొక్క ఆకాంక్షల తో, దేశం యొక్క అభివృద్ధి తో కేడెట్ లు వారి కార్యాచరణల ను, ఆకాంక్షల ను పెనవేసుకోవాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘వోకల్ ఫార్ లోకల్’ ప్రచార ఉద్యమం లో నేటి యువజనులు పోషించదగిన ప్రధాన పాత్ర ను కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘భారతదేశం లో ఉండే వ్యక్తి యొక్క శ్రమ తో, స్వేదం తో రూపుదిద్దుకొన్న వస్తువుల ను మాత్రమే ఉపయోగించుదాం అని నేటి యువత సంకల్పాన్ని తీసుకొంటే గనక భారతదేశం యొక్క భవితవ్యాన్ని మార్చవచ్చును’’ అని ఆయన దృఢం గా చెప్పారు.
ప్రస్తుతం ఒక పక్క డిజిటల్ టెక్నాలజీ కి, సమాచారానికి సంబంధించి మంచి అవకాశాలు ఉంటే, మరో పక్క దుష్ప్రచారం తాలూకు అపాయాలు పొంచి ఉన్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. మన దేశం లో సామాన్య మానవుడు ఎటువంటి వదంతి యొక్క ప్రభావం లోనూ పడకపోవడం అనేది కూడా అవసరం అని ఆయన నొక్కిచెప్పారు. దీనికి గాను ఒక చైతన్య కారకమైనటువంటి ప్రచార ఉద్యమాన్ని ఎన్ సిసి కేడెట్ లు నిర్వహించాలి అంటూ ఆయన ప్రతిపాదించారు.
ఎన్ సిసి గాని లేదా ఎన్ ఎస్ఎస్ గానీ ఉన్న పాఠశాల లోకి/కళాశాల లోకి మత్తు పదార్థాలు చేరకూడదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. కేడెట్ లు వారంతట వారు మాదక ద్రవ్యాల జోలికి పోకూడదు, మరి అదే కాలం లో వారి విద్యాసంస్థల ఆవరణల ను డ్రగ్స్ కు తావు ఉండనివి గా తీర్చిదిద్దాలి అంటూ ఆయన సలహా ను ఇచ్చారు. ఎన్ సిసి లో లేదా ఎన్ఎస్ఎస్ లో లేనటువంటి మిత్రులు సైతం ఈ చెడు అలవాటు ను వదలి వేసేటట్లు గా వారి కి సాయం చేయండి అని ఆయన నొక్కిచెప్పారు.
దేశం లో ఉమ్మడి ప్రయాసల కు ఒక కొత్త శక్తి ని ఇవ్వడం కోసం కృషి చేస్తున్నSelf4Society పోర్టల్ తో అనుబంధాన్ని కలిగి ఉండాలి అని కేడెట్ లకు ప్రధాన మంత్రి సూచన చేశారు. ఈ పోర్టల్ తో 7 వేల కు పైగా సంస్థ లు మరియు 2.25 లక్షల మంది జతపడ్డారు.
इस समय देश अपनी आज़ादी का अमृत महोत्सव मना रहा है।
— PMO India (@PMOIndia) January 28, 2022
और जब एक युवा देश, इस तरह के किसी ऐतिहासिक अवसर का साक्षी बनता है, तो उसके उत्सव में एक अलग ही उत्साह दिखता है।
यही उत्साह मैं अभी करियप्पा ग्राउंड में देख रहा हूं: PM @narendramodi
मुझे गर्व है कि मैं भी कभी आपकी तरह ही एनसीसी का सक्रिय कैडेट रहा हूँ।
— PMO India (@PMOIndia) January 28, 2022
मुझे एनसीसी में जो ट्रेनिंग मिली, जो जानने सीखने को मिला, आज देश के प्रति अपनी जिम्मेदारियों के निर्वहन में मुझे उससे असीम ताकत मिलती है: PM @narendramodi
आज जब देश नए संकल्पों के साथ आगे बढ़ रहा है, तब देश में एनसीसी को मजबूत करने के लिए भी हमारे प्रयास जारी हैं।
— PMO India (@PMOIndia) January 28, 2022
इसके लिए देश में एक हाई लेवेल रिव्यू कमेटी की स्थापना की गई है।
पिछले दो सालों में हमने देश के सीमावर्ती क्षेत्रों में 1 लाख नए कैडेट्स बनाए हैं: PM @narendramodi
अब देश की बेटियाँ सैनिक स्कूलों में एड्मिशन ले रही हैं।
— PMO India (@PMOIndia) January 28, 2022
सेना में महिलाओं को बड़ी जिम्मेदारियाँ मिल रही हैं।
एयरफोर्स में देश की बेटियाँ फाइटर प्लेन उड़ा रही हैं।
ऐसे में हमारा प्रयास होना चाहिए कि एनसीसी में भी ज्यादा से ज्यादा बेटियाँ शामिल हों: PM @narendramodi
आज इस समय जितने भी युवक-युवतियां NCC में हैं, NSS में हैं, उसमें से ज्यादातर इस शताब्दी में ही पैदा हुए हैं।
— PMO India (@PMOIndia) January 28, 2022
आपको ही भारत को 2047 तक लेकर जाना है।
इसलिए आपकी कोशिशें, आपके संकल्प, उन संकल्पों की सिद्धि, भारत की सिद्धि होगी, भारत की सफलता होगी: PM @narendramodi
जिस देश का युवा, राष्ट्र प्रथम की सोच के साथ आगे बढ़ने लगता है, उसे कोई दुनिया की कोई ताकत रोक नहीं सकती।
— PMO India (@PMOIndia) January 28, 2022
आज खेल के मैदान में, भारत की सफलता भी इसका एक बड़ा उदाहरण है: PM @narendramodi
आजादी के अमृतकाल में, आज से लेकर अगले 25 वर्ष, आपको अपनी प्रवृतियों को, अपने कार्यों को देश के विकास के साथ, देश की अपेक्षाओं के साथ जोड़ना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 28, 2022
सभी युवा, वोकल फॉर लोकल के अभियान में बहुत बड़ी भूमिका निभा सकते हैं।
— PMO India (@PMOIndia) January 28, 2022
अगर भारत के युवा ठान लें कि जिस चीज के निर्माण में किसी भारतीय का श्रम लगा है, किसी भारतीय का पसीना बहा, सिर्फ वही चीज इस्तेमाल करेंगे, तो भारत का भाग्य बदल सकता है: PM @narendramodi
आज एक ओर डिजिटल टेक्नोलॉजी और इन्फॉर्मेशन से जुड़ी अच्छी संभावनाएं हैं, तो दूसरी ओर misinformation के खतरे भी हैं।
— PMO India (@PMOIndia) January 28, 2022
हमारे देश का सामान्य मानवी, किसी अफवाह का शिकार न हो ये भी जरूरी है।
NCC कैडेट्स इसके लिए एक जागरूकता अभियान चला सकते हैं: PM @narendramodi
जिस स्कूल-कॉलेज में NCC हो, NSS हो वहां पर ड्रग्स कैसे पहुंच सकती है।
— PMO India (@PMOIndia) January 28, 2022
आप कैडेट के तौर पर खुद ड्रग्स से मुक्त रहें और साथ ही साथ अपने कैंपस को भी ड्रग्स से मुक्त रखें।
आपके साथी, जो NCC-NSS में नहीं हैं, उन्हें भी इस बुरी आदत को छोड़ने में मदद करिए: PM @narendramodi