Quote‘‘స్వాతంత్య్రానికి 100 వ సంవత్సరం వచ్చే వరకు మనంచేయవలసిన యాత్ర ఏమిటంటే అది మన వ్యవసాయాన్ని కొత్త అవసరాల కు, కొత్త సవాళ్ళ కు తగినట్లు గా మార్చుకోవడమే’’
Quote‘‘మనం మన వ్యవసాయాన్ని రసాయనప్రయోగశాల నుంచి వెలుపల కు తెచ్చి దానినిప్రకృతి తాలూకు ప్రయోగశాల కు జత పరచాలి. నేను ప్రకృతి యొక్క ప్రయోగశాల ను గురించి నేను మాట్లాడుతున్నానంటేదాని అర్థం అది పూర్తి గా విజ్ఞాన శాస్త్రం పై ఆధారపడి ఉంటుంది అనేదే’’
Quote‘‘మనం వ్యవసాయం తాలూకు పురాతనజ్ఞానాన్ని నేర్చుకోవడం ఒక్కటే కాకుండా దానిని ఆధునిక కాలాల కు తగినట్లు పదును పెట్టుకోవలసిన అవసరం ఉంది. ఈ దిశలో, మనం పరిశోధన ను సరికొత్త గాచేపట్టి, పురాతన జ్ఞానాన్ని నవీన శాస్త్రీయ చట్రం లోకి మలచుకోవాలి’’
Quote‘‘ప్రాకృతిక వ్యవసాయం నుంచి అత్యధికంగా లాభపడే వారు దేశం లోని రైతుల లో దాదాపు గా 80 శాతం మంది దాకా ఉంటారు’’
Quote‘‘21వ శాతాబ్దం లో ‘లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్’ (ఎల్ఐఎఫ్ఇ)కై ఉద్దేశించిన గ్లోబల్ మిశన్ కు నాయకత్వం వహించేది భారతదేశం మరియు భారతదేశ రైతులే’’
Quote‘‘ఈ అమృత్ మహోత్సవ్ లో ప్రతి పంచాయతీ లో కనీసం ఒక పల్లె ను ప్రాకృతిక వ్యవసాయం తో ముడిపెట్టే కృషి జరగాలి’’
Quote‘‘ఈ అమృత్ మహోత్సవ్ లో ప్రతి పంచాయతీ లో కనీసం ఒక పల్లె ను ప్రాకృతిక వ్యవసాయం తో ముడిపెట్టే కృషి జరగాలి’’

‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ లో రైతుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీయుతులు అమిత్ శాహ్, నరేంద్ర సింహ్ తోమర్, గుజరాత్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తదితరులు ఉన్నారు.

రైతుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్వాతంత్య్రాని కి 100వ సంవత్సరం వచ్చే వరకు సాగే ప్రస్థానం లో కొత్త అవసరాల , కొత్త సవాళ్ళ ప్రకారం వ్యవసాయాన్ని మార్పుల తో అనుకూలింప జేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. గడచిన ఆరేడు సంవత్సరాల లో, రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం విత్తనం నుంచి బజారు వరకు అనేక చర్యల ను తీసుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలిపారు. మట్టి ని పరీక్ష చేయడం మొదలుకొని వందల కొద్దీ కొత్త విత్తనాలు, పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి మొదలుకొని ఎమ్ఎస్ పి ని ఉత్పత్తి ఖర్చు కు ఒకటిన్నర రెట్ల వద్ద ఖరారు చేయడం వరకు, సేద్యపు నీటిపారుదల నుంచి కిసాన్ రైల్ తాలూకు ఒక బలమైన నెట్ వర్క్ ను నెలకొల్పడం వరకు.. వ్యవసాయ రంగాన్ని ఆ దిశ లోకి తీసుకుపోవడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం తో ముడిపడిన దేశాలన్నింటి కి చెందిన రైతుల కు ఆయన అభినందనల ను తెలియజేశారు.

|

హరిత క్రాంతి లో రసాయనాలు, ఎరువులు పోషించిన ముఖ్య పాత్ర ను ప్రధాన మంత్రి గుర్తిస్తూ, దాని తాలూకు ప్రత్యామ్నాయాలపై ఏక కాలం లో కృషి చేయవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. పురుగు మందులు, దిగుమతి చేసుకొన్న ఎరువులు ఇన్ పుట్స్ యొక్క ఖర్చుల ను పెంచడానికి దారి తీశాయని, అవి ఆరోగ్యాన్ని కూడా నష్ట పరుస్తాయంటూ వాటి తాలూకు ప్రమాదాల ను గురించి హెచ్చరిక చేశారు. వ్యవసాయాని కి సంబంధించిన సమస్యలు చేయి దాటిపోక ముందే ప్రధానమైన చర్యల ను తీసుకోవడానికి ఇదే సరైన అదును అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘మనం మన వ్యవసాయాన్ని రసాయన శాస్త్ర ప్రయోగశాల నుంచి బయటి కి తీసుకు వచ్చి, దానిని ప్రకృతి యొక్క ప్రయోగశాల తో కలపవలసి ఉంది. నేను ప్రకృతి యొక్క ప్రయోగశాల ను గురించి చెబుతున్నాను అంటే అది పూర్తి గా విజ్ఞాన శాస్త్రం పైన ఆధారపడి ఉన్నటువంటిది’’ అని ప్రధాన మంత్రి విడమరచి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మరింత ఆధునికం గా మారుతున్న కొద్దీ ‘తిరిగి మూలాల వైపునకు సాగుతున్నది’ అని అర్థం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దీనికి అర్థం మీరు మీ మూలాల తో జత పడుతున్నారు అని. ఈ విషయాన్ని మీ రైతు మిత్రులందరి కంటే మరెవరు బాగా అర్థం చేసుకొంటారు? మనం వేరుల కు మనం ఎంత ఎక్కువ గా నీటి ని అందిస్తే మొక్క అంత గా పెరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘మనం వ్యవసాయం తాలూకు ఈ విధమైన పురాతన జ్ఞానాన్ని తిరిగి నేర్చుకోవలసిన అవసరం ఒక్కటే కాకుండా దానిని ఆధునిక కాలాల కోసం పదును పెట్టుకోవలసిన అవసరం కూడా ఉంది. ఈ దిశ లో, మనం సరికొత్త గా పరిశోధన చేయాలి; పురాతన జ్ఞానాన్ని నవీన శాస్త్రీయ చట్రం లోకి మూస పోసుకోవాలి’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అందుకొనే జ్ఞానం విషయం లో జాగరూకత తో ఉండవలసింది గా ప్రధాన మంత్రి సూచించారు. పంట అవశేషాల ను తగలబెట్టడానికి సంబంధించి ప్రస్తుతం నెలకొన్న ఉద్దేశాల ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, పొలాని కి మంట పెట్టడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుంది అని నిపుణులు రూఢి గా చెప్పినప్పటికీ కూడాను ఇదే జరుగుతున్నది అని ఆయన అన్నారు. రసాయనాలు లేనిదే పంట బాగా చేతి కి రాదనే ఒక భ్రమ కూడా తల ఎత్తింది అని ఆయన అన్నారు. కాగా నిజం దీనికి భిన్నం గా ఉంది. ఇదివరకు ఎటువంటి రసాయనాలు లేవు; కానీ పంట బాగుంది. దీనికి మానవాళి వికాస సంబంధి చరిత్రయే సాక్షి గా ఉంది అని ఆయన అన్నారు. ‘‘కొత్త విషయాల ను నేర్చుకోవడం తో పాటు గా మన వ్యవసాయం లోకి పాకిన తప్పుడు పద్ధతుల ను మనం విడనాడవలసిన అవసరం ఉంది’’ ఆయన అన్నారు. ఐసిఎఆర్ వంటి సంస్థ లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాలు దీనిలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ను పోషించగలవు, అవి దీనిని పత్రాల ను మించి ఆచరణాత్మక సాఫల్యం వైపునకు తీసుకు పోవడం ద్వారా ఆ పని ని చేయగలవు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

|

ప్రాకృతిక సేద్యం నుంచి అత్యధికం గా లబ్ధి ని పొందేది ఎవరు అంటే వారు దేశం లోని రైతుల లో సుమారు గా 80 శాతం వరకు ఉన్న వారేనని ప్రధాన మంత్రి అన్నారు. ఆ చిన్న రైతులు, 2 హెక్టేర్ ల కంటే తక్కువ భూమి ఉన్న వారు. ఈ రైతుల లో చాలామంది రసాయనిక ఎరువుల కు ఎంతో డబ్బు ను ఖర్చు పెడతారు. వారు గనుక ప్రాకృతిక వ్యవసాయం వైపునకు మళ్ళారంటే, వారి స్థితి మెరుగు పడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రాకృతిక సాగు ను ఒక సామూహిక ఉద్యమం గా మార్చడానికి ముందుకు రావలసింది గా ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి కోరారు. ఈ అమృత్ మహోత్సవ్ లో ప్రతి పంచాయతీ లో కనీసం ఒక గ్రామం ప్రాకృతిక వ్యవసాయం తో అనుబంధం పెట్టుకొనేలా ప్రయత్నాలు జరగాలి అని ఆయన నొక్కిచెప్పారు.

ప్రపంచాన్ని ‘లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్’ (ఎల్ఐఎఫ్ఇ) తాలూకు ఒక గ్లోబల్ మిశన్ గా తీర్చిదిద్దాలి అంటూ క్లయిమేట్ ఛేంజ్ సమిట్ లో తాను పిలుపు ను ఇచ్చిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఈ విషయం లో 21వ శతాబ్దం లో భారతదేశం మరియు భారతదేశ రైతులు ముందుండి మార్గాన్ని చూపనున్నారు. రసాయనిక ఎరువులకు, కీటకనాశనుల కు తావు ఉండనిది గా భరత మాత కు చెందిన నేలల ను తీర్చిదిద్దేందుకు స్వాతంత్య్రం తాలూకు అమృత్ మహోత్సవ్ లో మనమంతా ఒక ప్రతిజ్ఞ ను స్వీకరించుదాం అంటూ ప్రజల కు ప్రధాన మంత్రి ఉద్బోధించారు.

‘నేశనల్ కాన్ క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ ను గుజరాత్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ మూడు రోజుల శిఖర సమ్మేళనాన్ని 2021 డిసెంబర్ 14 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు ఏర్పాటు చేయడమైంది. దీని కి హాజరు అయిన వారి లో 5,000 మంది కి పైగా రైతుల తో పాటు ఐసిఎఆర్ కు చెందిన కేంద్రీయ సంస్థ లు, రాష్ట్రాల లోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇంకా ఎగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ (ఎటిఎమ్ఎ) నెట్ వర్క్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసార మాధ్యమం సాయం తో జతపడ్డ రైతులు కూడా ఉన్నారు.

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఫెబ్రవరి 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research