ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం, అంటే జనవరి 18న జరిగిన శ్రీ సోమనాథ్ ట్రస్టు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించడమైంది. ఈ సందర్బం లో ధర్మకర్త లు ట్రస్టు పూర్వ చైర్ మన్ కీర్తిశేషులు శ్రీ కేశుభాయి పటేల్ కు నివాళులు అర్పించారు.
రాబోయే కాలం లో ట్రస్టు కు మార్గదర్శకత్వం వహించేందుకుగాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ట్రస్టు కు తదుపరి చైర్ మన్ గా ధర్మకర్త లు ఏకగ్రీవం గా ఎన్నుకొన్నారు. ఈ బాధ్యత ను ప్రధాన మంత్రి స్వీకరించి, టీమ్ సోమనాథ్ ప్రయాసలను ప్రశంసించారు. కలసికట్టుగా పనిచేస్తూ ట్రస్టు మౌలిక సదుపాయాలను, బస సంబంధి ఏర్పాటులను, వినోద సదుపాయాలను మరింత మెరుగుపరచగలుగుతుందని, మన ఘన వారసత్వంతో యాత్రికులకు బలమైన బంధాన్ని ఏర్పరచగలుగుతుందన్నన ఆశ ను ఆయన వ్యక్తం చేశారు. సౌకర్యాల పైన, ప్రస్తుతం అమలవుతున్న కార్యకలాపాల పైన, పథకాలపైన
సమీక్ష ను కూడా ఈ సమావేశం లో జరిపారు.
ట్రస్టు చైర్ పర్సన్ లు గా ఇదివరకు వ్యవహరించిన కొంతమంది ప్రముఖుల లో ఆదరణీయులు జామ్ సాహెబ్ దిగ్విజయ సింహ్ గారు, శ్రీ కనైయాలాల్ మున్శీ, భారతదేశం పూర్వ ప్రధాని కీర్తిశేషులు శ్రీ మొరార్ జీ దేశాయి, శ్రీ జయ్ కృష్ణ హరి వల్లభ్, శ్రీ దినేశ్ భాయి శాహ్, శ్రీ ప్రసన్న్ వదన్ మెహ్ తా, శ్రీ కేశుభాయి పటేల్ లు కూడా ఉన్నారు.