స్వాతంత్ర్యపోరాటం లో పాల్గొన్నప్పటికీ తెరమరుగునే ఉండిపోయినటువంటి ఆదివాసీ వీరుల కు, అమరుల కు నమస్కరించిన ప్రధాన మంత్రి
‘‘మాన్ గఢ్ అనేది రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మరియు గుజరాత్ ప్రజల ఉమ్మడి వారసత్వం గా నిలచింది’’
‘‘గోవిందగురు గారు వంటి గొప్ప స్వాతంత్ర్య యోధుడు భారతదేశం యొక్క సంప్రదాయాని కి మరియు ఆదర్శాల కు ప్రతినిధి అని చెప్పాలి’’
‘‘ఆదివాసి లు లేకుండా భారతదేశం యొక్క గతం, చరిత్ర, వర్తమానం మరియు భవిష్యత్తు సంపూర్ణం కానే కావు’’
‘‘రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, మరియు మహారాష్ట్ర లు మాన్గఢ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి తాలూకు మార్గ సూచి ని కలిసికట్టు గా రూపొందించవలసినఅవసరం ఉంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన ‘మాన్ గఢ్ ధామ్ కీ గౌరవ్ గాథ’ అనే ఒక సార్వజనిక కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. స్వాతంత్ర్య సమరం లో పాల్గొని తెర మరుగునే ఉండిపోయిన ఆదివాసి వీరుల కు మరియు అమరుల కు వారు చేసిన త్యాగాల కు గాను వందనాన్ని ఆచరించారు. కార్యక్రమ స్థలి కి చేరుకొన్న తరువాత ప్రధాన మంత్రి ధుని దర్శనం చేసుకొన్నారు. గోవింద్ గురు గారి విగ్రహం వద్ద పుష్పాంజలి ని కూడా సమర్పించారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మాన్ గఢ్ పవిత్ర భూమి కి రావడం ఎప్పటికీ ప్రేరణ ను ఇచ్చేదే అది మన జనజాతీయ వీరుల యొక్క తపస్సు, త్యాగం, సాహసం మరియు బలిదానాల కు ప్రతీక గా నిలచింది అని అభివర్ణించారు. ‘‘మాన్ గఢ్ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మరియు గుజరాత్ ల ప్రజల ఉమ్మడి వారసత్వం’’ అని ఆయన అన్నారు. గోవింద్ గురు గారి కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని అర్పించారు. అక్టోబర్ 30వ తేదీ నాడు గోవింద్ గురు గారి వర్ధంతి ఉండింది.

గుజరాత్ లో ఓ భాగం గా ఉన్న మాన్ గఢ్ ప్రాంతాని కి- తాను గుజరాత్ ముఖ్యమంత్రి గా- అందించిన సేవల ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. గోవింద్ గురు గారు తన చివరి రోజుల లో ఇక్కడే గడిపారు. ఆయన శక్తి ని మరియు ఆయన బోధనల ను ఈ నేల లో ఇప్పటికీ అనుభూతించవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. వన్ మహోత్సవ్ యొక్క వేదిక తాలూకు మాధ్యం ద్వారా అందరిని అభ్యర్థించిన తరువాత ఒకనాడు నిర్మానుష్య భూమి గా ఉండిన యావత్తు ప్రాంతం ఆకుపచ్చదనం తో నిండిపోయింది అని ఆయన అన్నారు. ఉద్యమం కోసం స్వార్థరహిత భావం తో కృషి చేస్తున్నందుకు గాను ఆదివాసి సముదాయాని కి ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియజేశారు.

ఈ పరిణామం స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా, గోవింద గురు గారి బోధన ల ప్రచారానికి ఉపకరించింది అని ప్రధాన మంత్రి అన్నారు. గోవింద గురు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమర యోధులు భారత సంప్రదాయాని కి, ఆదర్శాల కు ప్రతీక లు అని ఆయన అన్నారు. గోవింద గురు గారు తన కుటుంబాన్ని కోల్పోయారు గాని తన నిబ్బరాన్ని ఎన్నడూ కోల్పోలేదు మరి ప్రతి ఒక్క ఆదివాసి ని తన కుటుంబం గా చేసుకొన్నారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. గోవింద గురు గారు ఒక వైపు జన్ జాతీయ సముదాయం యొక్క హక్కు ల కోసం బ్రిటిషు వారి తో పోరాటం చేసి, మరో వైపు తన సముదాయం లోని దురాచారాల కు వ్యతిరేకం గా కూడాను ఉద్యమాన్ని నడిపారు, ఎందుకంటే ఆయన ఒక సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు, ఒక రుషి, ఒక లోక నేత గా వ్యవహరించారు అని ప్రధాన మంత్రి అన్నారు. గోవింద్ గురు గారి బైద్ధిక, తాత్విక చింతన లు ఆయన యొక్క సాహసం మరియు సామాజిక క్రియాశీలత ల వలెనే జీవం ఉట్టిపడేటటువంటివి అని ప్రధాన మంత్రి అన్నారు.

1913 నవంబర్ 17న మాన్ గఢ్ లో జరిగిన నర సంహారాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం లో బ్రిటిషు పాలన యొక్క అత్యధిక క్రూరత్వాని కి ఇది ఒక ఉదాహరణ గా నిలచింది అన్నారు. ఒకవైపు మన నిర్దోష ఆదివాసి లు స్వాతంత్రం కోసం డిమాండు చేస్తుంటే, మరో వైపు బ్రిటిషు వలస పాలకులు మాన్ గఢ్ కొండ లను చుట్టుముట్టి పట్టపగలే ఒక వేయి అయిదు వందల మంది కి పైచిలుకు అమాయక యువతీయువకుల ను, మహిళల ను, వయస్సు మళ్లిన వారి ని, పిల్లల ను ఊచకోత కోశారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దుర్భాగ్యపూర్ణ పరిస్థితుల కారణం గా స్వతంత్ర పోరాటం లో ఇంతటి మహత్వపూర్ణమైన మరియు ప్రభావశాలి ఘటన కు చరిత్ర పుస్తకాల లో జాగా దక్కనేలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో, భారతదేశం దశాబ్దాల క్రితం జరిగిన తప్పుల ను సరిదిద్దుతూ లోటు ను భర్తీ చేస్తోంది’’ అని ఆయన అన్నారు.

జన్ జాతీయ సముదాయం లేకుండా భారతదేశం యొక్క గతం, చరిత్ర, వర్తమానం మరియు భారతదేశం యొక్క భవిష్యత్తు లు సంపూర్ణం కావు అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర లోని ప్రతి పుట ఆదివాసి సముదాయం యొక్క వీరోచిత ఘట్టాల తో నిండివుంది అని ప్రధాన మంత్రి అన్నారు. తిలకా మాంఝి గారి నాయకత్వం లో 1780లలో జరిగిన సంథాల్ సంగ్రామ్ దగ్గర నుండి ఎన్నో వీరోచిత పోరాటాలు సాగాయి అని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. 1830-‌‌32 సంవత్సరాల మధ్య కాలం లో బుధు భగత్ గారి నాయకత్వం లో దేశం లర్ కా ఆందోళన ను చేపట్టింది అని ఆయన అన్నారు. 1855 లో సిద్దు ‌‌-కాన్హు క్రాంతి దేశాని కి ప్రేరణ ను ఇచ్చిందన్నారు. భగవాన్ బిర్ సా ముండా తన దేశ భక్తి, శక్తి ల ద్వారా ప్రతి ఒక్కరి లో ప్రేరణ ను నింపారన్నారు. శతాబ్దాల క్రితం బానిసత్వం సాగిన రోజుల నుండి 20 వ శతాబ్దం వరకు స్వాతంత్ర జ్వాల ను ఆరిపోకుండా గిరిజనులు చూశారు అంటూ ప్రధాన మంత్రి కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై సాగించిన

పోరాటాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అలాగే రాజస్థాన్ లో ఆదివాసి సమాజ్ మహారాణా ప్రతాప్ కు అండ గా నిలచిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. గిరిజన తెగల కు మనం ఎంతో రుణపడి ఉన్నాం. వీరు భారతదేశ స్వభావాన్ని పర్యావరణాన్ని, సంస్కృతి ని, సంప్రదాయాల ను కాపాడుకుంటూ వస్తున్నారని, వారి త్యాగాల రుణం తీర్చుకోలేనిది అని ప్రధాన మంత్రి అన్నారు. వారికి సేవ చేయడం ద్వారా ఇవాళ వారికి కృతజ్ఞతల ను తెలియజేసుకునే సమయం వచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు.

నవంబర్ 15వ తేదీ నాడు, అంటే భగవాన్ బిర్ సా ముండా యొక్క జయంతి సందర్భం లో, దేశం జనజాతీయ గౌరవ్ దివస్ ను జరుపుకోనుందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘స్వాతంత్ర్య పోరాటం లో ఆదివాసి ల చరిత్ర ను గురించి సామాన్యుల కు తెలియజెప్పే ప్రయాస యే ఈ జన్ జాతీయ గౌరవ్ దివస్’’ అని ఆయన అన్నారు. ఆదివాసి సమాజం యొక్క చరిత్ర ను సాధారణ ప్రజానీకానికి చాటిచెప్పడం కోసం దేశం అంతటా ఆదివాసి స్వాతంత్ర్య యోధుల కు అంకితం చేస్తూ ప్రత్యేకం గా మ్యూజియం లను నిర్మించడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ భవ్యమైనటువంటి వారసత్వం ఇక ఆలోచన ప్రక్రియ లో ఒక భాగం గా అవుతుందని, అంతేకాక యువ తరాల కు ప్రేరణ ను అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.

దేశం లో ఆదివాసి సమాజం యొక్క పాత్ర ను విస్తరింపచేయడం కోసం సమర్పణ భావం తో కృషి చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. రాజస్థాన్ మరియు గుజరాత్ మొదలు ఈశాన్యం మరియు ఒడిశా ల వరకు చూస్తే దేశం లోని అన్ని ప్రాంతాల లో ఉనికి విస్తరించి ఉన్నటువంటి ఆదివాసి సమాజానికి సేవ చేసేందుకు దేశం స్పష్టమైన విధానాల తో పాటుపడుతోందని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. వనబంధు కల్యాణ్ యోజన ద్వారా ఆదివాసి జనాభా కు నీరు, విద్యుత్తు, విద్య, ఆరోగ్య సేవ లు మరియు ఉపాధి అవకాశాల ను కల్పించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రస్తుతం, దేశం లో అడవుల విస్తీర్ణం సైతం పెరుగుతున్నది, వనరుల ను పరిరక్షించడం జరుగుతున్నది’’ అని ఆయన చెప్పారు. అదే కాలం లో, ఆదివాసి నివాస ప్రాంతాల ను డిజిటల్ ఇండియా కు జోడించడం కూడా జరుగుతున్నది’’ అని ఆయన అన్నారు. ఏకలవ్య సాంప్రదాయిక నైపుణ్యాల తో పాటు గా ఆధునిక విద్య ను కూడా ఆదివాసి యువత కు చేరువ గా తీసుకు వస్తున్న ఆశ్రమ పాఠశాల ల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గోవింద్ గురు జీ పేరు తో ఏర్పాటు చేసిన భవ్యమైన పరిపాలన కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించడం కోసం తాను జంబుఘోడా కు వెళ్తున్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు.

అహమదాబాద్-ఉదయ్ పుర్ బ్రాడ్ గేజ్ మార్గం లో ఒక రైలు ను తాను నిన్నటి రోజు సాయంత్రమే ప్రారంభించిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. ఆ 300 కిలోమీటర్ మేర సాగే రైలు మార్గం రాజస్థాన్ ప్రజల కు ఎంత ముఖ్యమైందో ఆయన తెలియజేస్తూ, ఆ మార్గం గుజరాత్ లోని అనేక ఆదివాసి ప్రాంతాల ను రాజస్థాన్ లోని ఆదివాసి ప్రాంతాల తో కలపడం తో పాటు గా ఆయా ప్రాంతాల లో పారిశ్రామిక అభివృద్ధి కి మరియు ఉపాధి కల్పన కు ఊతం గా నిలవనుందని ఆయన అన్నారు.

మాన్ గఢ్ ధామ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి తాలూకు చర్చ ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మాన్ గఢ్ ధామ్ ను పెద్ద ఎత్తున విస్తరించాలనే బలమైన కోరిక ను వెలిబుచ్చారు. రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర ల రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలి అని ప్రధాన మంత్రి అభ్యర్థిస్తూ, ఒక మార్గ సూచీ ని రూపొందించడాన్ని గురించి ఒక సమగ్రమైన చర్చ ను చేపట్టాలి అన్నారు. అదే జరిగితే, గోవింద్ గురు జీ యొక్క స్మారక స్థలం ప్రపంచ పటం లో ఒక జాగా ను సంపాదించుకొంటుందని పేర్కొన్నారు. ‘‘మాన్ గఢ్ ధామ్ యొక్క అభివృద్ధి ఈ ప్రాంతాన్ని నవ తరాని కి ఒక ప్రేరణ స్థలి గా తప్పక మార్చగలదు అని నేను తలుస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి చెప్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్, మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయి పటేల్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్ వాల్, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింహ్ కులస్తే, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తదితరులు ఉన్నారు.

పూర్వరంగం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా, స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని తెర వెనుకనే ఉండిపోయినటువంటి ఆదివాసి నాయకుల ను స్మరించుకొనేందుకు ప్రభుత్వం అనేక నిర్ణయాల ను తీసుకోవడం మొదలుపెట్టింది. వాటిలో నవంబర్ 15వ తేదీ ని (ఆదివాసి స్వతంత్రత సేనాని బిర్ సా ముండా జయంతి) ని జన్ జాతీయ గౌరవ్ దివస్ గా జరపనున్నట్లు ప్రకటించడం ఒకటి. సమాజం లో ఆదివాసి వ్యక్తుల తోడ్పాటుల కు గుర్తింపు ను ఇవ్వడం మరియు స్వాతంత్ర్య సంగ్రామం లో వారి బలిదానాల ను ప్రజల కు పరిచయం చేయడం కోసం దేశ వ్యాప్తం గా ఆదివాసి మ్యూజియమ్ లను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ దిశ లో మరొక అడుగు గానా అన్నట్లు, స్వాతంత్ర్య ఉద్యమం లో పేరు ప్రచారం లోకి రానటువంటి ఆదివాసి నాయకులు మరియు అమరులైన వారి యొక్క బలిదానానికి నమస్కరిస్తూ వారికి శ్రద్ధాంజలి ని సమర్పించడం కోసం ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని మాన్ గఢ్ పర్వతం (బాంస్ వాడ) లో ఏర్పాటైన సార్వజనిక కార్యక్రమం ‘మాన్ గఢ్ ధామ్ కీ గౌరవ్ గాథ’ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి భీల్ స్వతంత్రత సేనాని శ్రీ గోవింద్ గురు కు శ్రద్ధాంజలి ని ఘటించడం తో పాటు గా ఆ ప్రాంతాని కి చెందిన భీల్ మరియు ఇతర ఆదివాసి జన సమూహం హాజరు అయిన ఒక సభ ను ఉద్దేశించి ప్రసంగించారు.

మాన్ గఢ్ లోని పర్వత ప్రాంతం భీల్ సముదాయం మరియు రాజస్థాన్, గుజరాత్ మరియు మద్య ప్రదేశ్ లో ఇతర తెగల కు చాలా ముఖ్యమైనవి. స్వాతంత్ర్య పోరాటం కాలం లో ఇక్కడ భీల్ మరియు ఇతర తెగలు దీర్ఘ కాలం పాటు ఆంగ్లేయుల ను ఎదిరించి పోరాటం సలిపారు. 1913వ సంవత్సరం లో నవంబర్ 17వ తేదీ నాడు శ్రీ గోవింద్ గురు యొక్క నాయకత్వం లో 1.5 లక్షల మంది కి పైగా భీలు లు మాన్ గఢ్ పర్వతం పైన సభ ను నిర్వహించారు. ఆ సభ పై ఆంగ్లేయులు తుపాకి కాల్పులు జరిపారు, దీనితో మాన్ గఢ్ లో నర సంహారం చోటు చేసుకొంది. మరి సుమారు 1500 మంది ఆదివాసి వ్యక్తులు అమరులు అయ్యారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi