‘‘పదిహేడో లోక్ సభ అనేకపరివర్తనాత్మకమైన శాసన సంబంధి కార్యక్రమాల కు సాక్షి గా ఉండింది’’
‘‘పార్లమెంటు అంటే కేవలంగోడల చేర్పు కాదు, అది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షల నిలయం’’

శ్రీ ఓం బిర్ లా లోక్ సభ కు స్పీకర్ గా ఎన్నిక అయిన అనంతరం సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

వరుసగా రెండో సారి స్పీకర్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ ఓం బిర్ లా కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. సభ పక్షాన స్పీకరు కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. అమృత కాలం లో రెండో సారి శ్రీ ఓం బిర్ లా పదవీ బాధ్యతల ను చేపట్టడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తెలియపరుస్తూ, అయిదు సంవత్సరాలు గా ఆయన కు ఉన్న అనుభవం మరియు ఆయన తో సభ్యుల కు ఉన్న అనుభవం.. ఇవి రెండు కూడాను తిరిగి ఎన్నికైన స్పీకరు ఈ ముఖ్యమైన కాలాల్లో సభ కు మార్గదర్శకత్వం వహించేందుకు వీలు ను కల్పించగలవన్న ఆశ ను ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. స్పీకరు కు ఉన్నటువంటి నమ్రత నిండిన వ్యక్తిత్వం మరియు ఆయన మోము లోని విజయం తొణికిసలాడే చిరునవ్వు .. ఈ రెండు అంశాలు సభ ను నిర్వహించడం లో స్పీకరు కు అండదండలను అందిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

 

తిరిగి ఎన్నికైన స్పీకరు కొత్త విజయాల ను సాధిస్తూనే ఉంటారన్న విశ్వాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఇంత క్రితం శ్రీ బలరాం జాఖడ్ వరుస గా అయిదు సంవత్సరాల అనంతరం మరో మారు అదే పదవి ని అలంకరించిన తొలి స్పీకర్ అని ప్రధాన మంత్రి తెలియజేస్తూ, పదిహేడో లోక్ సభ ను విజయవంతం గా ముగించిన తరువాత శ్రీ ఓం బిర్ లా కు పద్దెనిమిదో లోక్ సభ కు నాయకత్వాన్ని వహించే బాధ్యత దక్కింది అని ప్రధాన మంత్రి అన్నారు. మధ్యలో 20 సంవత్సరాల కాలం లో స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తులు ఏదైనా ఎన్నికల లో పోటీ చేయడం గాని, లేదా వారి నియామకం తరువాత జరిగిన ఎన్నికలలో గెలవడం గాని జరిగిన దాఖలాలు లేవు, కానీ శ్రీ ఓం బిర్ లా ఎన్నికల లో మళ్లీ గెలిచిన తరువాత స్పీకర్ గా తిరిగి వచ్చి చరిత్ర ను లిఖించారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

 

పార్లమెంటు సభ్యుని గా స్పీకర్ యొక్క పనిపాటులను గురించి ప్రధాన మంత్రి వివరించారు. శ్రీ ఓం బిర్ లా యొక్క నియోజకవర్గం లో ఆరోగ్యవంతమైన మాత మరియు ఆరోగ్యవంతమైన శిశువు ల తాలూకు ప్రచార ఉద్యమం ప్రశంసాయోగ్యమైందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వాస్థ్య సేవల ను శ్రీ ఓం బిర్ లా ఆయన నియోజకవర్గం అయిన కోటా లోని గ్రామీణ ప్రాంతాల కు చేర్చి చేసిన మంచి పనుల ను గురించి కూడా వ్యాఖ్యానించారు. శ్రీ ఓం బిర్ లా ఆయన నియోజకవర్గం లో క్రీడల ను ఎంతగానో ప్రోత్సాహించారంటూ ప్రధాన మంత్రి ప్రశంసించారు.

 

గడచిన లోక్ సభ కాలం లో శ్రీ ఓం బిర్ లా యొక్క నాయకత్వాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొంటూ, ఆ కాలం మన పార్లమెంటరీ చరిత్ర లో ఒక సువర్ణ కాలం అంటూ అభివర్ణించారు. పదిహేడో లోక్ సభ లో పరివర్తనకారి నిర్ణయాల ను తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, స్పీకర్ యొక్క నాయకత్వాన్ని ప్రశంసించారు. నారీ శక్తి వందన్ అధినియమ్, జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ, భారతీయ న్యాయ్ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, సామాజిక్ సురక్ష సంహిత, వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు, ముస్లిమ్ మహిళా వివాహ్ అధికార్ సంరక్షణ్ విధేయక్, ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్శన్ ఆఫ్ రైట్స్ బిల్, వినియోగదారు పరిరక్షణ బిల్లు, ప్రత్యక్ష పన్ను - వివాద్ సే విశ్వాస్ విధేయక్ వంటివి అన్నీ కూడాను శ్రీ ఓం బిర్ లా స్పీకర్ గా ఉన్న కాలం లో ఆమోదాన్ని పొందిన ప్రతిష్టాత్మకమైన చట్టాలు అని ప్రధాన మంత్రి వివరించారు.

 

ప్రజాస్వామ్యం యొక్క సుదీర్ఘ ప్రస్థానం కొత్త రికార్డుల ను సృష్టించేందుకు అవకాశాన్ని అందించి, వేరు వేరు మజిలీలకు సాక్షి గా నిలవడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పదిహేడో లోక్ సభ ను ఆ సభ సాధించిన విజయాల కు గాను భారతదేశ ప్రజలు రాబోయే కాలం లో వారి యొక్క మనస్సుల లో పదిలపరచుకొంటారు అనే విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. భారతదేశాన్ని ఒక ఆధునిక దేశం గా తీర్చి దిద్దే దిశ లో పదిహేడో లోక్ సభ పూర్తి చేసినటువంటి కార్యాల ను ఆయన ప్రశంసించారు. పార్లమెంటు నూతన భవనం గౌరవనీయులైన స్పీకర్ యొక్క మార్గదర్శకత్వం లో భావి అమృత కాలాని కి బాట ను పరుస్తుందంటూ ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. కొత్త పార్లమెంటు భవనం యొక్క ప్రారంభ కార్యక్రమం కూడా వర్తమాన స్పీకర్ అధ్యక్షత ననే జరిగిన విషయాన్ని శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు; మరి ప్రజాస్వామిక పద్ధతుల పునాదిని బల పరచే దిశ లో తీసుకొన్న చర్యల ను కూడా ఆయన ప్రశంసించారు. సభ లో చర్చల కు ఉత్తేజాన్ని అందించడం కోసం స్పీకర్ శ్రీ ఓం బిర్ లా చొరవ తీసుకొని ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థాగతమైన వివరణనిచ్చే ప్రక్రియ ను మరియు కాగితాల ను ఉపయోగించనక్కరలేకుండానే పనుల ను చేసే పద్ధతి ని ప్రధాన మంత్రి కొనియాడారు.

 

జి-20 సభ్యత్వ దేశాల శాసన నిర్మాణ వ్యవస్థ ల యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ పి-20 కి రికార్డు స్థాయి లో దేశాలు హాజరు అయ్యాయి, ఆ సమావేశం చాలా విజయవంతమైంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ విషయం లోనూ స్పీకరు ను ప్రశంసించారు.

 

పార్లమెంటు భవనం అంటే అది గోడల కూర్పు మాత్రమే కాదు అది 140 కోట్ల మంది పౌరుల యొక్క ఆకాంక్షల కు కేంద్రం గా కూడా ను ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సభ యొక్క కార్యప్రణాళిక, ఆచరణ మరి జవాబుదారుతనం అనేవి మన దేశం లో ప్రజాస్వామ్యం యొక్క పునాది ని బలోపేతం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. పదిహేడో లోక్ సభ యొక్క ఉత్పాదకత 97 శాతం స్థాయి లో ఉండి, రికార్డు ను నెలకొల్పింది అని ప్రధాన మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన కాలం లో సభ యొక్క సభ్యుల పట్ల స్పీకరు యొక్క వ్యక్తిగత సంబంధాల ను మరియు చింత ను గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సభ పనితీరు ను మహమ్మారి అడ్డుకోనివ్వకుండా శ్రీ ఓమ్ బిర్ లా చూశారని, మరి ఆ కాలం లో సభ యొక్క ఫలితాలు 170 శాతాని కి చేరుకొన్నాయంటూ శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

 

సభ యొక్క మర్యాద ను కాపాడడం లో స్పీకరు చాటిన సమతుల్యత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. ఈ క్రమం లో అనేకమైన కఠిన నిర్ణయాల ను తీసుకోవడం కూడా ఇమిడివుందని ప్రధాన మంత్రి అన్నారు. సంప్రదాయాల ను పాటిస్తూ, సభ యొక్క విలువల ను నిలబెట్టాలని తలపోసినందుకు స్పీకరు కు కృతజ్ఞత ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

ప్రజల కు సేవ చేయడం లో మరియు వారు కంటున్న కలల ను మరియు వారి ఆకాంక్షల ను నెరవేర్చడం లో పద్దెనిమిదో లోక్ సభ సఫలం అవుతుందన్న అత్యదిక విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. శ్రీ ఓమ్ బిర్ లా కు అప్పగించినటువంటి మహత్తర బాధ్యత ను నిర్వర్తించడం లో మరియు దేశాన్ని విజయం తాలూకు నూతన శిఖరాల కు చేర్చడం లో శ్రీ ఓమ్ బిర్ లా సఫలీకృతులు కావాలంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేసి, ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi