11 ల‌క్ష‌ల మంది నూత‌న ల‌క్షాధికార మ‌హిళ‌ల‌కు స‌త్కారం, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలను పంపిణీ చేసిన ప్ర‌ధాని
రూ.2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుద‌ల‌, రూ. 5,000 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ
మాతృమూర్తుల‌, సోద‌రీమ‌ణుల జీవితాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి మా ప్ర‌భుత్వం పూర్తి నిబ‌ద్ద‌తతో ఉంది: ప్ర‌ధాని శ్రీ మోదీ
మ‌హారాష్ట్ర సంప్ర‌దాయాలు దేశ‌వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాయి: ప్ర‌ధాని శ్రీ మోదీ
భార‌త‌దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిన‌ మ‌హారాష్ట్ర మాతృశ‌క్తి : ప్ర‌ధాని శ్రీ మోదీ
స‌మాజంతోపాటు దేశ భ‌విష్య‌త్తు నిర్మాణం కోసం ఎల్ల‌ప్పూడూ ఎన‌లేని సేవ‌లందించిన భార‌త‌దేశ మాతృశ‌క్తి: ప్ర‌ధాని శ్రీ మోదీ
ఒక సోద‌రి ల‌క్షాధికారి అయితే (లాఖ్ ప‌తి దీదీ) ఆ కుటుంబం మొత్తానికి ల‌బ్ధి జ‌రిగి వారి జీవితాల్లో మార్పు వ‌స్తుంది: ప్ర‌ధాని శ్రీ మోదీ
ఒక‌ప్పుడు భార‌తీయ మ‌హిళ‌ల్ని దూరం పెట్టిన‌ ప్ర‌తి రంగంలోకి వారికి ప్ర‌వేశం క‌ల్పిస్తున్నాం: ప్ర‌ధాని శ్రీ మోదీ
ప్ర‌భుత్వాలు మార‌వచ్చు, కానీ, ప్ర‌భుత్వ‌ప‌రంగా మా ముఖ్య‌మైన బాధ్య‌త మ‌హిలనీ, వారి జీవితాలనీ , వారి గౌర‌వ మ‌ర్యాద‌లనీ కాపాడ‌డ‌మే: ప్ర‌ధాని శ్రీ మోదీ
మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను నిలువ‌రించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి కేంద్ర‌ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌ను తీసుకుంటుంది: ప్ర‌ధాని భ‌రోసా

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్‌గావ్‌లో నిర్వ‌హించిన  ల‌ఖ్ ప‌తి దీదీ స‌మ్మేళ‌న్ (ల‌క్షాధికార సోద‌రీమ‌ణుల స‌మావేశం)లో పాల్గొన్నారు. మూడో ప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఇటీవ‌ల ల‌క్షాధికారులైన 11 ల‌క్ష‌ల‌మంది సోద‌రీమ‌ణుల‌కు ధ్రువ‌ ప‌త్రాల‌ను అందించి స‌త్క‌రించింది. 

 

దేశ‌వ్యాప్తంగా ఈ ప‌థ‌కం ద్వారా ల‌క్షాధికారులైన మ‌హిళ‌ల‌తో  ప్ర‌ధాని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న  రూ. 2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేశారు. దీని ద్వారా 4.3 లక్షల స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి)లోని 48 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. 2.35 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 25.8 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చే రూ. 5,000 కోట్ల బ్యాంకు రుణాలను కూడా ఆయన పంపిణీ చేశారు. ల‌ఖ్‌పతి దీదీ యోజనను ప్రారంభించినప్పటి నుండి, ఇప్పటికే కోటి మంది మహిళలను ల‌క్షాధికార మ‌హిళ‌ల్ని చేశారు.  మూడు కోట్ల మంది మ‌హిళ‌ల్ని ల‌క్షాధికార మ‌హిళ‌లుగా చేయాల‌నేది కేంద్ర‌ ప్ర‌భుత్వ లక్ష్యం. 

 

ఈ కార్య‌క్ర‌మానికి భారీ సంఖ్యలో త‌ర‌లి వ‌చ్చిన మాతృమూర్తుల‌కు, సోద‌రీమ‌ణుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ప్ర‌ధాని త‌న ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టారు. ప్ర‌సంగాన్ని కొన‌సాగించ‌డానికి ముందు, నేపాల్‌లోని తనహున్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన‌ వారికి ప్ర‌ధాని సంతాపం తెలిపారు. ఈ ప్ర‌మాదంలో జల్‌గావ్‌కు చెందిన పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటన జరిగిన వెంటనే భార‌త‌దేశ‌ అధికారులు,  నేపాల్ అధికారులను సంప్రదించారని, కేంద్ర మంత్రి రక్షతాయ్ ఖడ్సేను నేపాల్‌కు పంపించడం జ‌రిగింద‌ని ప్ర‌ధాని తెలియజేశారు. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో  మృతదేహాలను తీసుకొచ్చామని, క్షతగాత్రులను ఆదుకుంటున్నామని చెప్పారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

ల‌ఖ‌ప‌తి దీదీ మెగా కార్య‌క్ర‌మానికి భారీగా త‌ర‌లివ‌చ్చిన మాతృమూర్తుల‌ను, సోద‌రీమ‌ణుల‌ను చూస్తూ సంతోషం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ల‌క్ష‌లాది మంది ఎస్ హెచ్‌జి మ‌హిళ‌ల‌కు రూ. 6 వేల కోట్లను పంపిణీ చేశామ‌ని అన్నారు. ఈ భారీ నిదులు చాలా మంది మ‌హిళ‌లు ల‌ఖ్ ప‌తి దీదీలుగా అవ‌త‌రించ‌డానికి ప్రోత్సాహ‌మిస్తాయ‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హిళ‌ల‌కు త‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

 

మ‌హారాష్ట్ర మాతృమూర్తులు , సోద‌రీమ‌ణులు, రాష్ట్రానికి చెందిన‌ అద్భుతమైన సంస్కృతీ,  సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నారని  ప్ర‌ధాని  శ్రీ మోదీ నొక్కిచెప్పారు. “మహారాష్ట్ర సంప్రదాయాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్ర‌సిద్ధి చెందాయి” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల పోలాండ్ పర్యటనలో మహారాష్ట్ర సంస్కృతిని ప్రత్యక్షంగా చూశానంటూ ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రజలను పోలాండ్ ప్ర‌జ‌లు  ఎంతో గౌరవిస్తారని అన్నారు. కొల్హాపూర్ ప్రజల సేవ, ఆతిథ్యానికి ముగ్ధులైన‌ పోలాండ్ ప్రజలు వారికి అంకితం చేసిన కొల్హాపూర్ మెమోరియల్ గురించి ప్ర‌ధాని మాట్లాడారు. పోలాండ్ కు చెందిన‌ వేలాది మంది మహిళలు, పిల్లలకు శివాజీ మహారాజ్ నిర్దేశించిన సంప్రదాయాలను అనుసరించి  కొల్హాపూర్ రాజకుటుంబం ఆశ్రయం కల్పించింద‌ని చెబుతూ రెండో ప్రపంచ యుద్ధంనాటి ఘ‌ట‌న‌ను గుర్తు చేశారు ప్రధాన మంత్రి.  త‌న ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో అలాంటి పరాక్రమ కథలు అక్క‌డివారు త‌న‌కు చెప్పినప్పుడు గర్వించాన‌ని ప్ర‌ధాని అన్నారు. నేటి పౌరులు అదే బాటలో పయనించాలని, రాష్ట్ర పేరును ప్రపంచ స్థాయిలో నిలపడానికి నిరంతరం కృషి చేయాలని ప్ర‌ధాని కోరారు. 

 

ధైర్య‌వంతులు, సాహ‌స‌వంతులైన మ‌హిళ‌ల‌ చేత మ‌హారాష్ట్ర సంస్కృతి త‌యారైంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర మాతృశ‌క్తిని చూసి మొత్తం భార‌త‌దేశం స్ఫూర్తి పొందిన‌ద‌ని ఆయ‌న అన్నారు.  “మన‌ జ‌ల‌గావ్ వార్కారీ సంప్రదాయానికి చెందిన పుణ్యక్షేత్రం. ఇది గొప్ప సాధువు ముక్తాయ్ జ‌న్మించిన‌ భూమి అని ప్ర‌ధాని అన్నారు.  ఆమె సాధించిన విజయాలు, చేసిన‌ తపస్సు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికి కూడా  బహినాబాయి కవితలు మూస పద్ధతులకు అతీతంగా ప్ర‌జ‌లు ఆలోచించేలా చేస్తున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “మహారాష్ట్రలోని ఏ మూలనైనా సరే, చరిత్రలో ఏ కాలంలోనైనా సరే, మాతృశక్తి సహకారం సాటిలేనిది” అని ప్రధాన మంత్రి ప్రశంసించారు. మహారాష్ట్రలోని మాతృశక్తి గురించి మరింత విశదీకరించిన శ్రీ మోదీ, మాతా జిజియాబాయి ఛత్రపతి శివాజీ జీవితానికి దిశానిర్దేశం చేశార‌ని అన్నారు. మ‌హిళా విద్య‌కు ప్రాధాన్య‌త లేని రోజుల్లో మ‌హారాష్ట్ర‌కు చెందిన సావిత్రీబాయి పూలే చేసిన కృషి, మ‌హిళా విద్య‌కు, వారి ప్ర‌గ‌తికి దోహ‌దం చేసింద‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు. 

 

భారతదేశ మహిళా శక్తి ఎల్లప్పుడూ సమాజంతోపాటు దేశ భవిష్యత్తును నిర్మించడంలో దోహదపడుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. "ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవ‌త‌రించ‌డానికి కృషి చేస్తున్న‌ద‌ని, ఇందుకోసం మహిళా శక్తి మరోసారి ముందుకు వ‌చ్చింది" అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. మహారాష్ట్ర మహిళల కృషిని  ప్రశంసిస్తూ "మీ అందరిలో రాజమాత జిజియాబాయి, సావిత్రీబాయి ఫూలేలను చూస్తున్నాను" అని ప్ర‌ధాని అన్నారు. 

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తాను మహారాష్ట్రలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకున్న శ్రీ మోదీ

ఆ స‌మ‌యంలో 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను (ల‌క్షాధికార మ‌హిళ‌ల్ని) సృష్టించాలనే ఆకాంక్షను తాను వ్య‌క్తం చేసిన  విష‌యాన్ని గుర్తు చేశారు.  గత 10 ఏళ్లలో 1 కోటి మంది ల‌ఖ్ ప‌తి దీదీలను తయారు చేయగా, గ‌త రెండు నెల‌ల్లోనే 11 లక్షల మంది కొత్త లఖ్‌పతి దీదీలను సృష్టించామ‌ని తెలిపారు. మహారాష్ట్రలో కూడా లక్ష లఖ్‌పతి దీదీలను తయారు చేశామ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. అనేక కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా మహారాష్ట్రలోని మహిళలకు సాధికారత క‌ల్పించి బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల బృందం మొత్తం కలిసి వచ్చిందని ప్ర‌ధాని నొక్కిచెప్పారు.

 

లఖ్‌పతి దీదీ ప్రచారం కేవలం మాతృమూర్తుల‌,  సోదరీమణుల ఆదాయాన్ని పెంపొందించే మార్గం కాదని, కుటుంబాన్ని, భవిష్యత్తు తరాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన‌ ఒక మెగా క్యాంపెయిన్ అని  ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మారుస్తోందని అన్నారు. "  సంపాదించ‌డం ప్రారంభించినప్పుడు సమాజంలో తన సామాజిక స్థానం ఉన్నతంగా ఉంటుందనే విష‌యం ఇక్కడ ఉన్న ప్రతి మ‌హిళ‌కు తెలుసు అని ప్ర‌ధాని అన్నారు.  ఆదాయం పెరుగుదలతో కుటుంబ కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. "ఒక సోదరి లఖ్‌ప‌తి దీదీగా మారినప్పుడు మొత్తం కుటుంబం ప‌రిస్థితులు మారిపోయి అభివృద్ది చెందుతుంది" అని ఆయన చెప్పారు.

 

భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో నేటి మహిళలు చేస్తున్న కృషిని గుర్తుచేసిన ప్రధాని శ్రీ న‌రేంద్ర‌ మోదీ, గతంలో మహిళల అభివృద్ధి పట్ల జ‌రిగిన‌ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. దేశంలోని కోట్లాది మంది మహిళలకు ఎలాంటి ఆస్తి లేదని, ఈ విష‌యం చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి కావాల్సిన‌ బ్యాంకు రుణాలు పొందడంలో కీల‌క అడ్డంకిగా మారింద‌ని ఆయన పేర్కొన్నారు. "అందుకే, మహిళలపై భారాన్ని తగ్గిస్తామంటూ నేను ప్రతిజ్ఞ చేశాను, మా ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా మహిళల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంది" అని ప్రధాన మంత్రి అన్నారు. ఏడు దశాబ్దాల పాటు పాలించిన‌ గత ప్రభుత్వాల పాల‌న‌తో ప్రస్తుత ప్రభుత్వ 10 సంవత్సరాల పాల‌న‌ను  పోల్చిన ప్ర‌ధాని, ప్రస్తుత ప్రభుత్వం మహిళల ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా కృషి చేసిందని  వ్యాఖ్యానించారు.

 

పేదల ఇళ్లను మహిళల‌ పేరు మీద రిజిస్టర్ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిన విష‌యాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ఇప్పటి వరకు నిర్మించిన 4 కోట్ల ఇళ్లకు సంబంధించి చాలా వరకు మహిళల పేరుతోనే రిజిస్టర్ చేసిన‌వేన‌ని శ్రీ మోదీ ప్ర‌త్యేకంగా చెప్పారు. త్వరలో నిర్మించనున్న 3 కోట్ల ఇళ్లను కూడా చాలా వరకు మహిళల పేరు మీదే నమోదు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

 

బ్యాంకింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణలను ప్ర‌త్యేకంగాప్ర‌స్తావించి శ్రీ న‌రేంద్ర‌ మోదీ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనలో కూడా అత్యధిక బ్యాంకు ఖాతాలు మహిళల పేరుతోనే ప్రారంభించ‌న‌వ‌ని  అన్నారు. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన లబ్ధిదారుల్లో 70 శాతం మంది  భార‌త‌దేశ మాతృమూర్తులు, సోదరీమణులే  అని ఆయన స్ప‌ష్టం చేశారు.

మహిళలకు రుణాలు ఇచ్చే విష‌యంలో గతంలో తనను ఎలా హెచ్చరించారో గుర్తు చేసిన ప్ర‌ధాని, మాతృశక్తిపై తనకు పూర్తి నమ్మకం ఉందని, వారు రుణాలు తప్పకుండా తిరిగి చెల్లిస్తారని శ్రీ మోదీ అన్నారు. రుణాలను తిరిగి చెల్లించ‌డంలో మహిళల స్పందన చూసి సంతోషించామ‌ని, అందుకే  తన‌ ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచిందని తెలిపారు.

 

వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన స్వానిధి పథకం గురించి ప్ర ధాని మాట్లాడుతూ, స్వానిధిలో కూడా గ్యారెంటీ లేకుండా రుణాలు ఇస్తున్నామ‌ని , ఈ ప‌థ‌కం ప్రయోజనాలు మహిళలకు చేరాయని స్ప‌ష్టం చేశారు. హస్త కళల రంగంలో ఉన్న‌  అనేక మంది విశ్వకర్మ కుటుంబాల మహిళలకు తమ ప్రభుత్వం ఎలాంటి హామీ లేకుండానే ప్రయోజనాలను అందించిందని శ్రీ న‌రేంద్ర మోదీ తెలిపారు.

 

సఖీ మండళ్లనూ, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రాముఖ్యతను ఇంతకు ముందు గుర్తించ‌లేద‌ని, అయితే అవి నేడు భారత ఆర్థిక వ్యవస్థలో భారీ శక్తిగా ఎదుగుతున్నాయ‌ని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి గ్రామం,  గిరిజన ప్రాంతం అక్క‌డి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకువచ్చిన సానుకూల మార్పులకు సాక్ష్యంగా ఉన్నాయ‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.. గత పదేళ్లలో పది కోట్ల మంది మహిళలు త‌మ ఉద్య‌మంలో భాగస్వాములయ్యారని, తక్కువ వడ్డీకే రుణాలు పొందేందుకు వీలుగా బ్యాంకింగ్ వ్యవస్థలో వారిని భాగస్వామ్యులుగా చేశామని ఆయన తెలియజేశారు. స్వయం సహాయక సంఘాలకు 2014లో రూ.25 వేల కోట్ల లోపు బ్యాంకు రుణాలు మంజూరు చేయగా, గత పదేళ్లలో రూ.9 లక్షల కోట్లకు ఆ సంఖ్య‌ చేరుకుందని ప్ర‌ధాని వివరించారు. ప్రభుత్వం అందించే ప్రత్యక్ష సాయాన్ని కూడా దాదాపు 30 రెట్లు పెంచినట్లు ఆయన తెలిపారు.

 

నేడు మాతృమూర్తులు,  సోదరీమణులు పోషిస్తున్న‌ పాత్రలు పెరిగాయాని ప్రధాన మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.  ప్ర‌తి గ్రామంలో బ్యాంక్ స‌ఖీలున్నార‌ని దేశ‌వ్యాప్తంగా 1.25 లక్షల మందికి పైగా బ్యాంకు సఖీలు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ ల‌ను ఉప‌యోగిస్తున్న మహిళలు డ్రోన్ పైలట్‌లుగా మారారని, పశువుల పెంపకందారులకు సహాయం చేయడానికి 2 లక్షల మంది పశు స‌ఖీల‌కు శిక్షణ ఇస్తున్నామ‌ని ఆయన ఉదాహరణలు ఇచ్చారు. ఆధునిక వ్యవసాయం, సహజ వ్యవసాయం చేసేలా నారీశ‌క్తికి నాయకత్వం అందించ‌డం కోసం చేసిన ‘‘కృషిసఖి’’ కార్యక్రమాన్ని ప్రారంభించడం గురించి కూడా ప్రధాన మంత్రి త‌న‌ ప్ర‌సంగంలో ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో దేశంలోని ప్రతి గ్రామంలో ఉండేలా దేశ‌వ్యాప్తంగా లక్షలాది మంది  కృషి స‌ఖీల‌ను ప్రభుత్వం త‌యారు చేయ‌బోతున్న‌ద‌ని అన్నారు. ఈ ఉద్య‌మాలు మ‌హిళ‌ల‌కు ఉపాధి కల్పిస్తాయని, వారి విశ్వాసాన్ని పెంచుతాయని ప్రధాని అన్నారు. మ‌హిళా శ‌క్తి గురించి సమాజంలో కొత్త ఆలోచనలు రూపుదాలుస్తున్నాయ‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. 

 

గత నెలలో సభ ఆమోదించిన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడిన ప్ర‌ధాని, మహిళలకు సంబంధించిన పథకాలకు రూ.3 లక్షల కోట్లు కేటాయించినట్లు  తెలిపారు. ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పని చేసే మహిళలకోసం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేయ‌డం, పిల్లలకు క్రచ్ సదుపాయాలు వంటి ప్రత్యేక సౌకర్యాలను కల్పించ‌డం కోసం తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. ఒకప్పుడు మ‌హిళ‌ల‌ను దూరం పెడుతూ వారిని పరిమితం చేసిన‌ అన్ని రంగాలను నేడు వారి కోసం తెరవడానికి నేటి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.  ఫైటర్ పైలట్లు, సైనిక్ పాఠశాలలు, అకాడమీలలో ప్రవేశం,  పోలీసు బలగాలలో, పారామిలిటరీ దళాల‌లో మహిళల సంఖ్య పెరగడం,  త్రివిధ సాయుధ దళాలలో మహిళా అధికారుల నియ‌మాకంలాంటి ఉదాహరణలను ఆయన త‌న ప్ర‌సంగంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.   గ్రామాల్లో వ్యవసాయం, పాడి పరిశ్రమ మొదలుకొని అంకుర సంస్థ‌ల విప్లవం వరకు పెద్ద సంఖ్యలో మహిళలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. రాజకీయాల్లో మ‌హిళ‌ల‌ భాగస్వామ్యాన్ని పెంచేందుకు నారీశక్తి వందన్ అధినియమ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సంగ‌తిని తెలియ‌జేశారు. 

 

మహిళల సాధికారతతో పాటు వారి భద్రతకు త‌న ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. "రాష్ట్రాలతో సంబంధం లేకుండా నా సోదరీమణుల, నా బిడ్డ‌ల‌ బాధను కోపాన్ని నేను అర్థం చేసుకున్నాను" అని శ్రీ మోదీ అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు క్షమించరాని పాపమని, దోషులను, వారి సహచరులను విడిచి పెట్టకూడదంటూ ప్రధాని త‌న వైఖరిని స్ప‌ష్టం చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,  దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ విష‌యాన్ని గ్ర‌హించాల‌ని ఆదేశించారు.

 

ప్రభుత్వ సంస్థలు, అవి ఆసుపత్రులు అయినా, పాఠశాలలు అయినా, కార్యాలయాలు అయినా, పోలీసు వ్యవస్థ అయినా జవాబుదారీగా ఉండాలని, అవి ఎలాంటి నిర్లక్ష్యానికి పాల్పడినా స‌హించేది లేద‌ని ప్రధాని వ్యాఖ్యానించారు. "ప్రభుత్వాలు మారవచ్చు, కానీ ఒక స‌మాజంగా, ఒక ప్ర‌భుత్వంగా మన అతి పెద్ద బాధ్యత మహిళల జీవితాల‌ను, వారి గౌరవ మ‌ర్యాద‌ల‌ను కాపాడటం" అని శ్రీ మోదీ అన్నారు.

 

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చట్టాలను కఠినతరం చేస్తోందని ప్రధాని స్ప‌ష్టం చేశారు.  ఫిర్యాదులకు సంబంధించిన‌ ఎఫ్‌ఐఆర్‌లు సకాలంలో నమోదు కాలేదని,  కేసులు చాలా సమయం తీసుకునేవ‌ని గ‌తాన్ని ఎత్తి చూపిన ప్రధాన మంత్రి, భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) లో అటువంటి అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు. ఇందులో ఒక  అధ్యాయం అంతా మహిళలపై, చిన్నారుల‌పై అఘాయిత్యాలకే కేటాయించినట్లు తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకూడదనుకుంటే ఇ-ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవచ్చని,  పోలీసు స్టేషన్ స్థాయిలో ఇ-ఎఫ్‌ఐఆర్‌ను తారుమారు చేయకుండా వేగంగా చర్యలు తీసుకునేలా చర్యలు ఉన్నాయని ప్ర‌ధాని అన్నారు.. త్వరితగతిన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. కొత్త చట్టాలలో మైనర్లపై లైంగిక నేరాలకు మరణశిక్ష,  జీవిత ఖైదు వంటి నిబంధనలు ఉన్నాయని ప్రధాన మంత్రి తెలియజేశారు. 

 

వివాహానికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలు చేయ‌డం, మోసం చేయ‌డం,  పెళ్లి పేరుతో మోసం చేస్తే వెంట‌నే  చ‌ర్య‌లు తీసుకునేలా  బిఎన్ ఎస్ స్పష్టంగా నిర్వ‌చ‌నాలు ఇచ్చింద‌ని ప్ర‌ధాని వివ‌రించారు. “మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు  కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మీకు నేను హామీ ఇస్తున్నాను. ఈ పాపపు మనస్తత్వాన్ని భారతీయ సమాజం నుండి నిర్మూలించే వరకు మనం ఆగే ప్ర‌స‌క్తే లేదు” అని ప్రధాన మంత్రి ఉద్వేగభ‌రితంగా మాట్లాడారు. 

 

భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడంలో మహారాష్ట్ర పాత్రను ప్రధాన మంత్రి ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు.  విక‌సిత్  భారత్‌లో మహారాష్ట్ర ఒక ప్రకాశించే నక్షత్రమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు మహారాష్ట్ర కేంద్రంగా మారుతోందని, మరిన్ని ఎక్కువ పెట్టుబడులు, కొత్త ఉద్యోగావకాశాల క‌ల్ప‌న‌పైనే  రాష్ట్ర భవిష్యత్తు ఉందని ఆయన స్ప‌ష్టం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించి యువత విద్య, నైపుణ్యాలు, ఉపాధికి ప్రాధాన్యతనిచ్చే సుస్థిర ప్రభుత్వం రాష్ట్రంలో అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు. సుస్థిరమైన ,  సంపన్నమైన మహారాష్ట్ర కోసం రాష్ట్రంలోని మ‌హిళ‌లు ఐక‌మ‌త్యంగా కృషి చేస్తార‌నే ఆకాంక్ష‌ను  ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి పి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్, శ్రీ అజిత్ పవార్,  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Making Digital India safe, secure and inclusive

Media Coverage

Making Digital India safe, secure and inclusive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”