Releases book 'Lachit Borphukan - Assam's Hero who Halted the Mughals'
“Lachit Borphukan's life inspires us to live the mantra of 'Nation First'”
“Lachit Borphukan's life teaches us that instead of nepotism and dynasty, the country should be supreme”
“Saints and seers have guided our nation since time immemorial”
“Bravehearts like Lachit Borphukan showed that forces of fanaticism and terror perish but the immortal light of Indian life remains eternal”
“The history of India is about emerging victorious, it is about the valour of countless greats”
“Unfortunately, we were taught, even after independence, the same history which was written as a conspiracy during the period of slavery”
“When a nation knows its real past, only then it can learn from its experiences and treads the correct direction for its future. It is our responsibility that our sense of history is not confined to a few decades and centuries”
“We have to make India developed and make Northeast, the hub of India’s growth”

శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి సందర్భం లో ఒక సంవత్సర కాలం పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో ఏర్పాటు కాగా, ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొని సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ‘శ్రీ లాసిత్ బోర్ ఫుకన్- అసమ్ స్ హీరో - హూ హాల్టెడ్ ద ముఘల్స్’’ అనే పేరు గల ఒక పుస్తకాన్ని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఆవిష్కరించారు

మరుగున పడి పోయిన వీరుల ను సముచిత రీతి లో గౌరవించుకోవాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా, ఈ నాటి సందర్భం శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క 400వ జయంతి ని ఆచరించుకోవడం అనేది గా ఉంది. శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ ముఘలుల ను ఓడించిన అసమ్ కు చెందిన అహోమ్ సామ్రాజ్యపు రాయల్ ఆర్మీ కి సేనానాయకుని గా ప్రసిద్ధికెక్కారు. ఔరంగజేబ్ నాయకత్వం లోని ముఘలుల రాజ్య విస్తరణ ఆకాంక్షల ను రాయల్ ఆర్మీ విజయవంతం గా అడ్డుకొన్నది.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగం లో ముందు గా, వీరుడు శ్రీ లాసిలత్ బోర్ ఫుకన్ వంటి శూర పుత్రుల పురుటి గడ్డ అసమ్ అంటే తనకు ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. ‘‘శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి నాడు మనం ఆయన కు శిరసు ను వంచి ప్రణామాన్ని ఆచరించుదాం. అసమ్ యొక్క సంస్కృతి ని పరిరక్షించడం లో ఆయన కీలకమైనటువంటి పాత్ర ను పోషించారు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘దేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న కాలం లో భారతదేశం శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క 400వ జయంతి ని పాటిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క ఘన కార్యాలు అసమ్ చరిత్ర లో ఒక వైభవోపేతమైనటువంటి అధ్యాయం అని చెప్పాలి అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ‘‘భారతదేశం యొక్క సనాతన సంస్కృతి, పరాక్రమం, ఇంకా మనుగడ ల తాలూకు ఉత్సవం అనదగ్గ ఈ సందర్భం లో నేను ఈ గొప్ప సంప్రదాయాని కి నమస్కరిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు. దాస్యం తాలూకు మనస్తత్వం బారి నుండి తప్పించుకొని భారతదేశం తన వారసత్వం పట్ల గర్వపడే మన:స్థితి కి చేరుకొంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుక గా జరుపుకోవడం ఒక్కటే కాకుండా తన చరిత్ర లో భాగం కానటువంటి అజ్ఞాత వీరుల మరియు వీర వనితల కు మాన్యత ను ప్రదానం చేస్తున్నది కూడాను అని ఆయన అన్నారు. ‘‘భరత మాత అమర పుత్రుల లో శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ వంటి వారు ‘అమృత కాలం’ తాలూకు సంకల్పాల ను నెరవేర్చుకోవడం లో ప్రేరణ ను అందిస్తుంటారు. వారు మన చరిత్ర యొక్క విశిష్టత ను, గుర్తింపు ను మనకు ఎరుకపరుస్తారు. అంతేకాక మనల ను మనం దేశాని కి అంకితం చేసుకొనేందుకు కూడా వారు ఉత్తేజాన్ని అందిస్తారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు

‘‘మానవుల మనుగడ కు సంబంధించినటువంటి వేల సంవత్సరాల పాతది అయిన చరిత్ర లో ఎన్నో నాగరకత లు ఈ భూమి మీద నివసించాయి. ఎన్నటి కీ నాశనం అనేదే లేదు అనేటటువంటి విధం గా అనేక నాగరకత లు వర్ధిల్లాయి. అయితే, కాలం యొక్క చక్ర భ్రమణం వాటి ని మోకాళ్ల మీద వంగేటట్టు చేసివేసింది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశాని కి మరియు ఇతర నాగరకతల కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఆ తరహా నాగరకత ల అవశేషాల ఆధారం గా నేటి ప్రపంచం చరిత్ర ను అవలోకనం చేస్తున్నది. అయితే, చరిత్ర లో అనుకోని ప్రతికూలతల ను ఎదుర్కొన్న భారతదేశం విదేశీ ఆక్రమణదారుల నుండి అనూహ్యమైన భయం ఎదురైనప్పటికీ, అదే శక్తి తో, అదే స్పృహ తో ఈనాటి కి కూడా జవసత్త్వాల తో సమున్నతం గా నిలచింది. ఇలా జరగడానికి గల కారణం ఏమిటి అంటే, అది ఒక సంకటం ఎదురైనప్పుడల్లా దానితో తలపడడానికి ఎవరో ఒకరు ముందుకు వచ్చారు. ప్రాచీన కాలం లో మునులు, పండితులు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు ను, సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడడానికి నడుంకట్టారు. తీవ్రవాద శక్తుల కు మరియు ఉగ్రవాద శక్తుల కు అంత్య కాలం ఉంటుందే తప్ప భారతదేశం యొక్క జీవనాని కి సంబంధించిన వెలుగు లు అంతరించిపోవు అని శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ వంటి యోధులు చాటి చెప్పారు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

అసమ్ యొక్క చరిత్ర ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, అది భారతదేశం సాంస్కృతిక యాత్ర లో ఒక అమూల్యమైన వారసత్వాని కి ప్రతీక అని పేర్కొన్నారు. అది సిద్ధాంతాలు, సమాజం, సంస్కృతి, విశ్వాసాలు మరియు సంప్రదాయాల కలబోత గా ఉంది అని ఆయన అన్నారు. అసమ్ తో పాటు, ఈశాన్య ప్రాంతం లో సాటి లేనటువంటి ధైర్య సాహసాల ను గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, తుర్కుల ను, అఫ్గాన్ లను, ముఘలుల ను ఎన్నో సందర్భాల లో తరిమికొట్టిన ఘటనల కు ఈ ప్రాంతాల ప్రజలు సాక్షులు గా ఉన్నారు అని పేర్కొన్నారు. ముఘలులు గువాహాటీ ని పట్టుకొన్నప్పటికీ, శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ వంటి యోధులు ముఘల్ సామ్రాజ్యాని కి చెందిన నిరంకుశ పాలకుల గుప్పిట నుండి తిరిగి స్వాతంత్య్రాన్ని దక్కించారు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. వీరుడు శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ సరాయి ఘాట్ లో ప్రదర్శించిన పరాక్రమ ఘట్టం మాతృభూమి పట్ల అనుపమ ప్రేమ కు ఒక ఉదాహరణ గా నిలవడం ఒక్కటే కాకుండా అవసరపడినప్పుడు మాతృభూమి రక్షణ కు ముందుకు ఉరికిన నేల లోని ప్రతి ఒక్క వ్యక్తి ని, యావత్తు అసమ్ ప్రాంతాన్ని ఏకం చేసేటటువంటి శక్తి కూడా ఆయన లో ఉంది అని రుజువు చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క సాహసం మరియు నిర్భయత్వం.. ఇవి అసమ్ కు ఆనవాళ్లు గా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘భారతదేశం యొక్క చరిత్ర అంటే అది బానిసత్వం ఒక్కటే కాదు,’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశం యొక్క చరిత్ర అంటే అది విజయాన్ని వరించడం, భారతదేశం యొక్క చరిత్ర అంటే అది లేక్కలేనంత మంది మహనీయుల యొక్క వీరత్వం గురించిన చాటింపు’’ అని ఆయన అన్నారు. భారతదేశం యొక్క చరిత్ర అంటే, అది క్రూర ప్రభుత్వాని కి వ్యతిరేకం గా అపూర్వమైన ధైర్యం, సాహసాల తో పోరు కు సిద్ధం కావడమే అని కూడా ఆయన అన్నారు. ‘‘బానిసత్వ కాలం లో కుట్రపూరితం గా అక్షరబద్ధం చేసిన అటువంటి చరిత్ర నే స్వాతంత్య్రం అనంతర కాలం లో నూ మనకు పాఠాలు గా బోధిస్తూ రావడం దురదృష్టకరం. మనల ను బానిసలు గా మార్చుకొన్న విదేశీయుల కార్యసరళి ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత మార్చవలసిన అవసరం ఏర్పడింది, అయితే, అది జరగనే జరగలేదు’’ అని ఆయన అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకం గా దేశం లో ప్రతి చోట భీకరమైన స్థాయి లో ఎదురైన ప్రతిఘటన తాలూకు గాథల ను ఉద్దేశ్య పూర్వకం గా అణచివేయడం జరిగింది. ‘‘నియంతృత్వాని కి వ్యతిరేకం గా ఎన్నో విజయ గాథ లు ఉన్నాయి. వాటి కి ప్రధాన స్రవంతి లో భాగం పంచకపోవడం అనే పొరపాటు ను ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నది,’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాన్ని దిల్లీ లో నిర్వహించడం అనే యథార్థం ఈ మార్పు కు ఒక నిదర్శన గా ఉంది అని ఆయన అన్నారు.

అసమ్ ప్రభుత్వం తన వీరుల కు సంబంధించిన కార్యక్రమాల ను నిర్వహించడానికి ముందంజ వేయడం అభినందనీయం అని ప్రధాన మంత్రి అన్నారు. అసమ్ వీరుల గౌరవార్థం ఒక వస్తు సంగ్రహాలయాన్ని మరియు ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఆ తరహా చర్య లు సాహసం యొక్క, త్యాగం యొక్క చరిత్ర ను గురించి యువతరం తెలుసుకోవడం లో సాయపడతాయి అని ఆయన చెప్పారు. ‘‘ ‘దేశానికే అగ్రతాంబూలం’ అనే సందేశాన్ని మనం ఆచరణ లో పెట్టేటట్టు శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క జీవనం మనలో ప్రేరణ ను కలిగిస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘స్వీయ ప్రయోజనాల ను మించి ఎదిగి, మరి జాతీయ హితాని కి అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చేటట్లు ఆయన జీవనం మనకు స్ఫూర్తి ని అందిస్తుంది. బంధు ప్రీతి, ఇంకా వంశ వాదాలకు భిన్నం గా దేశమే సర్వోన్నతం గా ఉండాలి అని శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క జీవనం మనకు బోధిస్తుంది’’. వీరుడు శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క జీవనం లోని సన్నివేశాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ఏ వ్యక్తీ లేదా ఏ అనుబంధం అయినా సరే దేశాని కి మించినవి కావు’’ అని పేర్కొన్నారు.

ఒక దేశం తన సిసలైనటువంటి భూత కాలాన్ని గురించి ఎరుక సంపాదించుకొన్నప్పుడే అది తన అనుభవాల నుండి పాఠాల ను నేర్చుకొని భవిష్యత్తు లోకి సరి అయిన దారి లో పయనించగలుగుతుంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘చరిత్ర తాలూకు మన ఎరుక అనేది ఏ కొన్ని దశాబ్దాల కో, ఏ కొన్ని శతాబ్దాల కో పరిమితం కాకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత’’ అని ఆయన అన్నారు. భారత్ రత్న శ్రీ భూపేన్ హజారికా పలుకుల ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం రాబోయే తరానికి ఒక సరి అయినటువంటి చరిత్ర ను అందించగలుగుతాం అని పేర్కొన్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ కు సంబంధించిన ఒక మహత్తరమైన నాటకం మాదిరిగానే శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ ను గురించి అటువంటిదే ఒక భవ్యమైనటువంటి రంగస్థల నాటకాన్ని సృష్టించడం అవసరం అంటూ ప్రధాన మంత్రి సూచన చేశారు. ఆ కళారూపాన్ని దేశం లోని ప్రతి ప్రాంతాని కి తీసుకు పోవాలి అని ఆయన అన్నారు. ఇది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సంకల్పాని కి ఒక పెద్ద ఉత్తేజాన్ని అందించగలుగుతుంది అని ఆయన చెప్పారు. ‘‘మనం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా మార్చాలి, మనం ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం యొక్క వృద్ధి కేంద్రం గా తీర్చిదిద్దాలి. వీరుడు శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క 400వ జయంతి తాలూకు స్ఫూర్తి అనేది మన సంకల్పాని కి శక్తి ని తప్పక ఇస్తుంది. మరి మన దేశ ప్రజలు దేశం యొక్క లక్ష్యాల ను సాధిస్తారు అని నాకు నమ్మకం ఉంది’’ అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రధాన మంత్రి సభాస్థలి కి చేరుకోవడం తోనే, విజ్ఞాన్ భవన్ యొక్క పశ్చిమ ప్రాంగణం లో గ్రామీణ అసమ్ ఛాయల తో అలంకరించిన ప్రాంతాన్ని తిలకించారు. దీనితో పాటు చారిత్రక దృష్టికోణాల తో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రదర్శన ను కూడా ఆయన వీక్షించారు. ఇది జరిగిన తరువాత, శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ చిత్రపటం వద్ద దీపాన్ని ప్రధాన మంత్రి వెలిగించి, పుష్పాంజలి ని సమర్పించారు.

ఈ కార్యక్రమాని కి అసమ్ గవర్నర్ ప్రొఫెసర్ శ్రీ జగదీశ్ ముఖి, అసమ్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద్ సొనోవాల్, పార్లమెంటు సభ్యులు జస్టిస్ (రిటైర్డ్) శ్రీ రంజ‌న్ గోగోయి, శ్రీ తపన్ కుమార్ గోగోయి లతో పాటు అసమ్ ప్రభుత్వం లో సభ్యులు సహా ఇతర ప్రముఖులు కూడా పాలుపంచుకొన్నారు.

పూర్వరంగం

మరుగున పడిపోయినటువంటి వీరుల ను సముచిత రీతి న గౌరవించుకోవాలనేదే ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉంటూ వస్తోంది. దీనికి అనుగుణం గానే, దేశం 2022వ సంవత్సరాన్ని శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి సంవత్సరం గా జరుపుకొంటోంది. ఈ ఉత్సవాల ను భారతదేశాని కి అప్పటి రాష్ట్రపతి అయిన శ్రీ రాం నాథ్ కోవింద్ గువాహాటీ లో ఈ ఏడాది ఫిబ్రవరి లో ప్రారంభించారు.

శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ (జననం: 24వ తేదీ నవంబర్, 1622 మరణం: 25వ తేదీ ఏప్రిల్, 1672) అసమ్ కు చెందిన అహోమ్ సామ్రాజ్యం యొక్క రాయల్ ఆర్మీ కి సేనానాయకుని గా ప్రసిద్ధికెక్కారు. రాయల్ ఆర్మీ ముఘలుల ను ఓడించడం తో పాటు ఔరంగజేబ్ నాయకత్వం లోని ముఘలుల రాజ్య విస్తరణ కాంక్ష ను భగ్నం చేసివేసింది కూడాను. 1671వ సంవత్సరం లో జరిగిన సరాయి ఘాట్ సంగ్రామం లో పాల్గొన్న అసమ్ సైనికుల లో శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ స్ఫూర్తి ని నింపి, దరిమిలా ముఘలుల ను అణచివేసి వారికి అవమానకరమైన అపజయాన్ని మిగిల్చారు. శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ మరియు ఆయన ఆధ్వర్యం లోని సైన్యం సలిపిన వీరోచిత పోరు మన దేశ చరిత్ర లో అత్యంత ప్రేరణాత్మకం అయినటువంటి సైనిక ప్రతిఘటనయుక్త సాహసకృత్యాల లో ఒకటి గా నిలచిపోయింది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi