ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ’82 వ ఆల్ ఇండియా ప్రిసైండింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్’ ప్రారంభిక సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో లోక్ సభ స్పీకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ కూడా హాజరయ్యారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్యం అనేది భారతదేశాని కి కేవలం ఒక వ్యవస్థ కాదు అన్నారు, ప్రజాస్వామ్యం అనేది మన స్వభావం లో ఇమిడిపోయి ఉంది, అది భారతదేశం సహజ ప్రకృతి అని ఆయన అన్నారు. ‘‘మనం రాబోయే సంవత్సరాల లో, దేశాన్ని కొత్త కొత్త శిఖరాల కు తీసుకు పోవలసి ఉంది. అంతేగాక, అసాధారణమైనటువంటి లక్ష్యాల ను సాధించవలసి ఉంది. ఈ సంకల్పాలు ‘సబ్ కా ప్రయాస్’ ద్వారా మాత్రమే నెరవేరుతాయి. మరి ప్రజాస్వామ్యం లో భారతదేశం యొక్క సమాఖ్య వ్యవస్థ లో మనం ‘సబ్ కా ప్రయాస్’ ను గురించి మాట్లాడుకొంటూ ఉన్నప్పుడు దానికి రాష్ట్రాలన్నింటి యొక్క పాత్ర అనేది ఒక పెద్ద ఆధారం గా ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘సబ్ కా ప్రయాస్’ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి మరింత గా వివరిస్తూ, అది ఈశాన్య ప్రాంతం లో దశాబ్దాల నాటి సమస్యల కు తగిన పరిష్కారాలు కావచ్చు, లేదా దశాబ్దాల తరబడి పనులు ఆగిపోయినటువంటి అభివృద్ధి పథకాలన్నిటిని పూర్తి చేయడం కావచ్చు.. దేశం లో అటువంటి అనేక కార్యాల ను గత కొన్ని సంవత్సరాల లో పూర్తి చేయడం జరిగింది; ఇది ప్రతి ఒక్కరి ప్రయాస ల వల్లే అయింది అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతున్న పోరాటాన్ని ‘సబ్ కా ప్రయాస్’ తాలూకు ఒక ఘనమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
మన చట్ట సభ ల సంప్రదాయా లు, వ్యవస్థ లు స్వభావరీత్యా భారతీయత కూడుకొన్నవై ఉండాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రభుత్వం విధానాలు, చట్టాలు భారతీయత భావన ను, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ యొక్క సంకల్పాన్ని పటిష్ట పరచేవి గా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. ‘‘అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయం ఏమిటి అంటే, సభ లో మన స్వీయ ఆచార,వ్యవహారాలు భారతీయ విలువల కు తగినట్లుగా ఉండాలి. ఇది మన అందరి బాధ్యత.’’ అని ఆయన అన్నారు.
మన దేశం అంతటా వివిధత్వం నిండి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మన వేల సంవత్సరాల అభివృద్ధి యాత్ర లో ఈ భిన్నత్వం నడుమ ఏకత్వం తాలూకు గొప్పదైనటువంటి, దివ్యమైనటువంటి ప్రవాహం నిరంతరాయం గా సాగుతోందని మనం అంగీకరించడం జరిగింది. ఏకత్వం తాలూకు ఈ అఖండ ప్రవాహం మన భిన్నత్వాన్ని పదిలపరుస్తూ, దానిని సంరక్షిస్తున్నది’’ అని ఆయన అన్నారు.
సభ లో ఒక ఏడాది కాలం లో మూడు లేదా నాలుగు రోజుల ను సమాజాని కి ఏదైనా విశిష్టమైన కార్యాలను చేస్తున్నటువంటి జన ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా అట్టిపెట్టలేమా; ఆ దినాల లో జన ప్రతినిధులు వారి అనుభవాల ను వెల్లడి చేసేందుకు వీలు ఉంటుంది కదా అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. జన ప్రతినిధులు వారి సామాజిక జీవనం లోని ఈ కోణాన్ని గురించి దేశ ప్రజల కు తెలియ జేసేందుకు అవకాశం లభించే లాగున మనం చేయగలమా? అంటూ ప్రధాన మంత్రి ఒక ప్రస్తావన ను తీసుకు వచ్చారు. దీనివల్ల ఇతర జన ప్రతినిధుల తో పాటు సమాజం లో ఇతర వ్యక్తుల కు కూడా ఎంతో నేర్చుకొనేందుకు ఆస్కారం ఉంటుంది అని ఆయన అన్నారు.
ఉత్తమమైన చర్చ ల కోసం ప్రత్యేకం గా కొంత సమయాన్ని కేటాయించే వీలు ఉంటుందా? అని కూడా ప్రధాన మంత్రి ప్రతిపాదించారు. ఆ తరహా చర్చ లో మర్యాద, గంభీరత్వం అనే సంప్రదాయాల ను పూర్తి నిష్ఠ తో పాటించాలి, ఎవ్వరూ కూడా ఎవ్వరి పైన అయినా రాజకీయ కళంకాల ను ఆపాదించకూడదు అని ఆయన అన్నారు. ఒక రకం గా అది సభ లో అన్నిటి కంటే ‘ఆరోగ్యప్రదమైన కాలం’ కావాలి.. ‘ఒక ఆరోగ్యవంతమైన దినం’ అవ్వాలి ఆయన అన్నారు.
‘వన్ నేశన్, వన్ లెజిస్లేటివ్ ప్లాట్ ఫార్మ్’ అనేటటువంటి ఒక ఆలోచన ను ప్రధాన మంత్రి ముందుకు తెచ్చారు. ‘‘ఒక పోర్టల్ ఉండాలి, అది మన పార్లమెంటరీ వ్యవస్థ కు జరూరైన సాంకేతిక వేగాన్ని ఇవ్వడమే కాక దేశంలోని అన్ని ప్రజాస్వామిక విభాగాల ను కలిపే పని ని కూడా చేయాలి’’ అని ఆయన అన్నారు.
రాబోయే 25 సంవత్సరాలు భారతదేశాని కి చాలా ముఖ్యమైనవి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం లో పార్లమెంట్ సభ్యులు ఒకే మంత్రాన్ని ఆచరించాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. అది ఏమిటి అంటే కర్తవ్యం, కర్తవ్యం, కర్తవ్యం అని ఆయన పునరుద్ఘాటించారు.
भारत के लिए लोकतन्त्र सिर्फ एक व्यवस्था नहीं है।
— PMO India (@PMOIndia) November 17, 2021
लोकतन्त्र तो भारत का स्वभाव है, भारत की सहज प्रकृति है: PM @narendramodi
हमें आने वाले वर्षों में, देश को नई ऊंचाइयों पर लेकर जाना है, असाधारण लक्ष्य हासिल करने हैं।
— PMO India (@PMOIndia) November 17, 2021
ये संकल्प ‘सबके प्रयास’ से ही पूरे होंगे।
और लोकतन्त्र में, भारत की संघीय व्यवस्था में जब हम ‘सबका प्रयास’ की बात करते हैं तो सभी राज्यों की भूमिका उसका बड़ा आधार होती है: PM
चाहे पूर्वोत्तर की दशकों पुरानी समस्याओं का समाधान हो,
— PMO India (@PMOIndia) November 17, 2021
दशकों से अटकी-लटकी विकास की तमाम बड़ी परियोजनाओं को पूरा करना हो,
ऐसे कितने ही काम हैं जो देश ने बीते सालों में किए हैं, सबके प्रयास से किए हैं।
अभी सबसे बड़ा उदाहरण हमारे सामने कोरोना का भी है: PM @narendramodi
हमारे सदन की परम्पराएँ और व्यवस्थाएं स्वभाव से भारतीय हों,
— PMO India (@PMOIndia) November 17, 2021
हमारी नीतियाँ, हमारे कानून भारतीयता के भाव को, ‘एक भारत, श्रेष्ठ भारत’ के संकल्प को मजबूत करने वाले हों,
सबसे महत्वपूर्ण, सदन में हमारा खुद का भी आचार-व्यवहार भारतीय मूल्यों के हिसाब से हो
ये हम सबकी ज़िम्मेदारी है: PM
हमारा देश विविधताओं से भरा है।
— PMO India (@PMOIndia) November 17, 2021
अपनी हजारों वर्ष की विकास यात्रा में हम इस बात को अंगीकृत कर चुके हैं कि विविधता के बीच भी, एकता की भव्य और दिव्य अखंड धारा बहती है।
एकता की यही अखंड धारा, हमारी विविधता को संजोती है, उसका संरक्षण करती है: PM
क्या साल में 3-4 दिन सदन में ऐसे रखे जा सकते हैं जिसमें समाज के लिए कुछ विशेष कर रहे जनप्रतिनिधि अपना अनुभव बताएं, अपने समाज जीवन के इस पक्ष के बारे में भी देश को बताएं।
— PMO India (@PMOIndia) November 17, 2021
आप देखिएगा, इससे दूसरे जनप्रतिनिधियों के साथ ही समाज के अन्य लोगों को भी कितना कुछ सीखने को मिलेगा: PM
हम Quality Debate के लिए भी अलग से समय निर्धारित करने के बारे में सोच सकते हैं क्या?
— PMO India (@PMOIndia) November 17, 2021
ऐसी डिबेट जिसमें मर्यादा का, गंभीरता का पूरी तरह से पालन हो, कोई किसी पर राजनीतिक छींटाकशी ना करे।
एक तरह से वो सदन का सबसे Healthy समय हो, Healthy Day हो: PM @narendramodi
मेरा एक विचार ‘वन नेशन वन लेजिस्लेटिव प्लेटफॉर्म’ का है।
— PMO India (@PMOIndia) November 17, 2021
एक ऐसा पोर्टल जो न केवल हमारी संसदीय व्यवस्था को जरूरी technological boost दे, बल्कि देश की सभी लोकतान्त्रिक इकाइयों को जोड़ने का भी काम करे: PM @narendramodi
अगले 25 वर्ष, भारत के लिए बहुत महत्वपूर्ण हैं।
— PMO India (@PMOIndia) November 17, 2021
इसमें हम एक ही मंत्र को चरितार्थ कर सकते हैं क्या - कर्तव्य, कर्तव्य, कर्तव्य: PM @narendramodi