“భార‌త‌దేశ ఫిన్‌టెక్ విప్ల‌వం ఆర్థిక స‌మ్మిళితాన్ని మెరుగుప‌ర్చ‌డంతో పాటు ఆవిష్క‌ర‌ణ‌ల దిశ‌గా న‌డిపిస్తోంది”
“భార‌త్ ఫిన్‌టెక్ వైవిధ్య‌త ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్చ‌ప‌రుస్తోంది”
“ఆర్థిక స‌మ్మిళితాన్ని పెంచ‌డంలో జ‌న్ ధ‌న్ యోజ‌న కీల‌క‌పాత్ర పోషిస్తోంది”
“భార‌తదేశ ఫిన్‌టెక్ విజ‌యానికి యూపీఐ గొప్ప ఉదాహ‌ర‌ణ‌” ;
“మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త‌కు జ‌న్ ధ‌న్ కార్య‌క్ర‌మం బ‌ల‌మైన పునాది వేసింది”
“భార‌త్‌లో ఫిన్‌టెక్ తీసుకువ‌చ్చిన మార్పు కేవ‌లం సాంకేతిక‌త‌కే ప‌రిమితం కాలేదు. సామాజిక ప్రభావం చాలా దూరం వెళ్లింది’’
“ఆర్థిక సేవ‌ల‌ను ప్ర‌జాస్వామ్యీక‌రించ‌డంలో ఫిన్‌టెక్ కీల‌క పాత్ర పోషిస్తోంది” ;
“భార‌త‌దేశ ఫిన్‌టెక్ వ్య‌వ‌స్థ మొత్తం ప్ర‌పంచ జీవికనే సులభతరం చేస్తోంది. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’’

మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఉన్న జియో వ‌రల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ (జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సైతం ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ క‌న్వ‌ర్జెన్స్ కౌన్సిల్ క‌లిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఫిన్‌టెక్ రంగంలో భార‌త్ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు ఈ రంగంలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఒక్క‌చోట‌కు చేర్చ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.
 

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ... దేశం పండుగ‌ వాతావరణంలో ఉన్న ఈ వేళ, దేశ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మార్కెట్లు సైతం ఆనందోత్సాహాలతో ఉన్నాయని అన్నారు. క‌ల‌ల న‌గ‌ర‌మైన ముంబైలో గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖుల‌కు, అతిథుల‌కు ప్ర‌ధాన‌మంత్రి సాద‌రంగా స్వాగ‌తం పలికారు. కార్య‌క్ర‌మానికి ముందు ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించిన‌ప్పుడు చ‌ర్చించిన అంశాలు, త‌న అనుభ‌వాల‌పై శ్రీ మోదీ మాట్లాడుతూ.. యువ‌త ఆవిష్క‌ర‌ణ‌లు, భ‌విష్య‌త్తు అవ‌కాశాల‌కు సంబంధించి పూర్తిగా కొత్త ప్ర‌పంచాన్ని ఇక్క‌డ వీక్షించ‌వ‌చ్చ‌ని చెప్పారు. గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్(జీఎఫ్ఎఫ్‌) 2024ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు.

భార‌త‌దేశ ఫిన్‌టెక్ ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసిస్తూ.. “గ‌తంలో భార‌త‌దేశాన్ని సంద‌ర్శించే విదేశీ అతిథులు దేశ సంస్కృతిక‌ వైవిధ్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయే వారు. ఇప్పుడు వారు ఫిన్‌టెక్ వైవిధ్యాన్ని సైతం చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.” అని అన్నారు. ఎయిర్‌పోర్టులో దిగిన క్ష‌ణం నుంచి వీధిలో ఆహారం, వ‌స్తువులు కొనుగోలు చేయ‌డం వ‌ర‌కు అంత‌టా భార‌త‌దేశ ఫిన్‌టెక్ విప్ల‌వం విస్త‌రించిన తీరును వీక్షించ‌వ‌చ్చ‌ని చెప్పారు. “గ‌త ప‌దేళ్ల‌లో ఈ ప‌రిశ్ర‌మ రికార్డు స్థాయిలో 31 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌కు పైగా పెట్టుబ‌డుల‌ను అందుకోవ‌డంతో పాటు 500 శాతం అంకుర సంస్థ‌ల అభివృద్ధి  కూడా సుసాధ్యం అయింది” అని ఆయ‌న పేర్కొన్నారు. స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో మొబైల్ ఫోన్లు, త‌క్కువ ధ‌ర‌కు డేటా ల‌భ్య‌త‌, జీరో బ్యాలెన్సుతో జ‌న్‌ధ‌న్ బ్యాంకు ఖాతాలు వంటివి ఈ రంగంలో విప్ల‌వాన్ని తీసుకొచ్చాయ‌న్నారు. “ఇవాళ దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగ‌దారుల సంఖ్య 6 కోట్ల నుంచి 94 కోట్ల‌కు పెరిగింది,” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. డిజిట‌ల్ గుర్తింపు - ఆధార్ లేని 18 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల యువకుడు దేశంలో క‌నిపించ‌డం అరుదు అని అన్నారు. “ఇవాళ‌, దేశంలో 53 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు జ‌న్ ధ‌న్ ఖాతాలు ఉన్నాయి. కేవ‌లం 10 ఏళ్ల‌లో మ‌నం బ్యాంకుల‌కు అనుసంధానం చేసిన వారి సంఖ్య మొత్తం యూరోపియ‌న్ యూనియ‌న్ జ‌నాభాతో స‌మానం” అని పేర్కొన్నారు.
 

‘న‌గ‌దు మాత్ర‌మే రారాజు’ అనే ఆలోచ‌నా విధానాన్ని జ‌న్ ధ‌న్‌, ఆధార్‌, మొబైల్ త్ర‌యం బ‌ద్ధ‌లు కొట్టింద‌ని, ప్ర‌పంచం మొత్తంలో జ‌రుగుతున్న డిజిట‌ల్ లావాదేవీల్లో దాదాపు స‌గం వ‌ర‌కు భార‌త్‌లోనే జ‌రిగేలా ఇది బాట‌లు వేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. భార‌త‌దేశ యూపీఐ ఫిన్‌టెక్‌లో ప్ర‌పంచానికి ఒక ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిందని ప్ర‌ధాని అన్నారు. అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో, ప్ర‌తి గ్రామం, న‌గ‌రంలో 27 X 7 బ్యాంకింగ్ సేవ‌లు అందించేందుకు ఇది వీలు క‌ల్పించింద‌ని అన్నారు. కొవిడ్ ప‌రిస్థితుల‌ను గుర్తుచేస్తూ, ప్ర‌పంచంలో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ స్తంభించ‌కుండా ఉన్న కొన్ని దేశాల్లో భార‌త్ ఒక‌ట‌ని పేర్కొన్నారు.

ఇటీవ‌లే జ‌రిగిన జ‌న్ ధ‌న్ యోజ‌న 10వ వార్షికోత్స‌వాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ, మ‌హిళా సాధికార‌త‌కు ఇది భారీ మాధ్య‌మంగా నిలిచింద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. మ‌హిళ‌లు ఇప్ప‌టివ‌ర‌కు 29 కోట్ల‌కు పైగా బ్యాంకు ఖాతాలు తెర‌వ‌డం ద్వారా వారికి డ‌బ్బు జ‌మా, పెట్టుబ‌డుల‌కు కొత్త అవ‌కాశాలు క‌ల్పించింద‌ని అన్నారు. జ‌న్ ధ‌న్ అకౌంట్ల ఆలోచ‌నా విధానంపై ప్రారంభించిన అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ ప‌థ‌క‌మైన ముద్ర యోజ‌న ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.27 ట్రిలియ‌న్ల రుణాలు జారీ అయ్యాయ‌ని తెలిపారు. “ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిపొందుతున్న వారిలో 70 శాతం మంది మ‌హిళ‌లే”న‌ని శ్రీ మోదీ పేర్కొన్నారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ను బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌తో అనుసంధానం చేయ‌డానికి సైతం జ‌న్ ధ‌న్ ఖాతాలు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని, త‌ద్వారా 10 కోట్ల మంది గ్రామీణ మ‌హిళ‌లు ల‌బ్ధి పొందార‌ని అన్నారు. “మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త‌కు జ‌న్ ధ‌న్ కార్య‌క్ర‌మం బ‌ల‌మైన పునాదులు వేసింది” అని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.
 

ప్ర‌పంచంలో స‌మాంత‌ర ఆర్థిక వ్య‌వ‌స్థ వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదాల‌పై ప్ర‌ధాన‌మంత్రి హెచ్చ‌రిస్తూ, ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయ‌డంలో ఫిన్‌టెక్‌ ప్ర‌భావ‌వంత‌మైన పాత్ర పోషించింద‌ని, పార‌ద‌ర్శ‌క‌తను తీసుకువ‌చ్చింద‌ని పేర్కొన్నారు. భార‌త్‌లో డిజిటల్ సాంకేతిక‌త పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకువ‌చ్చింద‌ని, వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను నివారిస్తూ వంద‌ల సంఖ్య‌లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో నేరుగా ల‌బ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నాన్ని అందించే విధానానికి ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిందని అన్నారు. “ఇవాళ‌, ప్ర‌జ‌లు అధికారిక బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌తో అనుసంధానం అవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలను చూస్తున్నారు” అని ప్ర‌ధాన‌మంత్రి పున‌రుద్ఘాటించారు.

దేశంలో ఫిన్‌టెక్ ప‌రిశ్ర‌మ తీసుకువ‌చ్చిన మార్పుల‌ను ప్ర‌స్తావిస్తూ, ఇది భార‌త‌దేశ సాంకేతిక ముఖ‌ చిత్రాన్ని మార్చ‌డంతో పాటు దేశంలో ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల మ‌ధ్య అంత‌రాన్ని తొల‌గించ‌డంలో విస్తృత‌మైన సామాజిక ప్ర‌భావాన్ని చూపించిందని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. గ‌తంలో బ్యాంకింగ్ సేవ‌లు పొందేందుకు రోజంతా స‌మ‌యం ప‌ట్టేద‌ని, ఇది రైతులు, మ‌త్య్స‌కారులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలకు అడ్డంకిగా మారేద‌ని, ఇప్పుడు వీరు ఫిన్‌టెక్ సాయంతో సులువుగా మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ సేవ‌లు పొంద‌గ‌లుగుతున్నార‌ని శ్రీ మోదీ పేర్కొన్నారు.
 

ఆర్థిక సేవ‌ల‌ను ప్ర‌జాస్వామ్యీక‌రించ‌డంలో ఫిన్‌టెక్ పాత్ర‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావిస్తూ, అందుబాటులో రుణాలు, క్రెడిట్ కార్డులు, పెట్టుబ‌డులు, బీమాను ఉదాహ‌ర‌ణ‌లుగా పేర్కొన్నారు. ఫిన్‌టెక్ వ‌ల్ల రుణాల‌ను పొంద‌డం సులువు అయ్యింద‌ని, స‌మ్మిళితం సాధ్య‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పీఎం స్వ‌నిధి ప‌థ‌కాన్ని ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటూ, ఈ ప‌థ‌కం వీధి వ్యాపారులు ఎలాంటి హామీ లేకుండానే రుణాలు పొందేందుకు వీలు క‌ల్పించింద‌ని, డిజిట‌ల్ లావాదేవీల సాయంతో వారి వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించేందుకు అవ‌కాశం క‌ల్పించింద‌ని పేర్కొన్నారు. షేర్ మార్కెట్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, పెట్టుబ‌డుల నివేదిక‌లు పొంద‌గ‌ల‌గ‌డం, డీమాట్ ఖాతాలు తెర‌వ‌డం సులువు అయ్యింద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. డిజిట‌ల్ ఇండియా ఆవిర్భావాన్ని ప్ర‌స్తావిస్తూ, మారుమూల ప్రాంతాల‌కు వైద్య సేవ‌లు, డిజిట‌ల్ విద్య‌, నైపుణ్య శిక్ష‌ణ వంటివి ఫిన్‌టెక్ లేకుండా సాధ్యం అయ్యేవి కావ‌ని అన్నారు. “గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవ‌నం, జీవ‌న నాణ్య‌త పెంపులో భార‌త‌దేశ ఫిన్‌టెక్ విప్ల‌వం ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
 

భార‌త‌దేశ ఫిన్‌టెక్ విప్ల‌వం సాధించిన విజ‌యాలు కేవ‌లం ఆవిష్క‌ర‌ణ‌ల‌కే ప‌రిమితం కాలేద‌ని, ఇవి ఆచ‌ర‌ణ‌కు సంబంధించిన‌వ‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఫిన్‌టెక్ విప్ల‌వం వేగాన్ని, స్థాయిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకురావ‌డం ప‌ట్ల‌ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌ను శ్రీ మోదీ ప్ర‌శంసించారు. ఈ మార్పును తీసుకురావ‌డంలో డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌(డీపీఐ) పాత్ర‌ను ఆయ‌న అభినందించారు. ఈ సాంకేతిక‌త ప‌ట్ల విశ్వాసాన్ని తీసుకురావ‌డానికి దేశంలో అద్భుత‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు.

కేవ‌లం డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో ప‌ని చేసే బ్యాంకులు, నియో-బ్యాంకింగ్ వంటి అధునాత‌న విధానాల‌ను ప్ర‌స్తావిస్తూ, “21వ శ‌తాబ్దపు ప్ర‌పంచం వేగంగా మారుతోంది. క‌రెన్సీ నుంచి క్యూఆర్‌(క్విక్ రెస్పాన్స్‌)కు ప్ర‌యాణానికి కొంత‌ స‌మ‌యమే ప‌ట్టింది. మ‌నం ప్ర‌తిరోజూ ఆవిష్క‌ర‌ణ‌ల‌ను చూస్తున్నాం.” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. డిజిట‌ల్ ట్విన్స్ సాంకేతిక‌త‌ను ప్ర‌శంసిస్తూ, ఇది ప్ర‌మాద నిర్వ‌హ‌ణ‌ను మ‌దింపు, మోసాల‌ను గుర్తించ‌డం, వినియోగాదారులకి మెరుగైన సేవ‌లు అందించ‌డంలో ప్ర‌పంచం అనుస‌రిస్తున్న మార్గాన్ని మార్చేస్తుంద‌ని శ్రీ మోదీ అన్నారు. ఓపెన్ నెట్‌వ‌ర్క్ ఫ‌ర్ డిజిట‌ల్ కామ‌ర్స్‌(ఓఎన్‌డీసీ) ద్వారా కలిగే ప్ర‌యోజ‌నాల‌ను పేర్కొంటూ, ఇది ఆన్‌లైన్ షాపింగ్‌ను స‌మ్మిళితం చేస్తోంద‌ని, చిన్న వ్యాపారాలు, సంస్థ‌ల‌ను పెద్ద అవ‌కాశాల‌తో అనుసంధానం చేస్తోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఇవాళ‌, సంస్థ‌ల నిర్వాహ‌ణ‌ను సులభ‌త‌రం చేయ‌డం కోసం అకౌంట్ ఆగ్రిగేటర్లు డేటాను వినియోగించుకుంటున్నార‌ని అన్నారు. వాణిజ్య వేదిక‌లు, వివిధ మార్గాల్లో వినియోగిస్తున్న‌ ఇ-రుపి లాంటి డిజిట‌ల్ వోచ‌ర్ల వ‌ల్ల చిన్న సంస్థ‌ల్లో న‌గ‌దు ప్ర‌వాహం పెరుగుతున్న‌ద‌ని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఉత్ప‌త్తులు ప్ర‌పంచంలోని మిగ‌తా దేశాల‌కూ స‌మానంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని అన్నారు.

“ఏఐకి ప్ర‌పంచ ఫ్రేమ్‌వ‌ర్క్ ఉండాల‌ని భార‌త్ పిలుపునిచ్చింది” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్‌ల‌తో పాటు సౌండ్ బాక్సులు వినియోగించ‌డం ఇలాంటి ఒక ఆవిష్క‌ర‌ణనే అని తెలిపారు. ప్ర‌భుత్వ బ్యాంక్ స‌ఖి కార్య‌క్ర‌మాన్ని అధ్య‌య‌నం చేయాల‌ని భార‌త‌దేశ ఫిన్‌టెక్ రంగాన్ని ప్ర‌ధాని కోరారు. ప్ర‌తి గ్రామంలో బ్యాంకింగ్‌, డిజిట‌ల్ అవ‌గాహ‌న‌ను వ్యాప్తి చేస్తూ, ఫిన్‌టెక్‌ కోసం ఒక కొత్త విఫణిని అందిస్తున్న ఆడ‌బిడ్డ‌ల ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు.
 

ఫిన్‌టెక్ రంగానికి తోడ్పాటును అందించ‌డానికి ప్ర‌భుత్వం విధాన‌ప‌రంగా అవ‌స‌ర‌మైన మార్పులు చేస్తోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఏంజెల్ ట్యాక్స్ ను ర‌ద్దు చేయ‌డం, దేశంలో ప‌రిశోధ‌న‌, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ల‌క్ష కోట్ల రూపాయ‌లు కేటాయించడం, డిజిట‌ల్ ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ యాక్ట్ ను అమ‌లు చేయ‌డం వంటి వాటిని ఉదాహ‌ర‌ణ‌లుగా ప్ర‌స్తావించారు. సైబ‌ర్ మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రాన్ని చెబుతూ,  డిజిట‌ల్ విద్య‌ను పెంపొందించ‌డానికి భారీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని రెగ్యులేట‌ర్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి కోరారు. దేశంలో ఫిన్‌టెక్‌, అంకుర సంస్థ‌ల వృద్ధికి సైబ‌ర్ మోసాలు అడ్డంకి కాకుడా చూడ‌టం కూడా సామ‌న‌ స్థాయిలో ముఖ్య‌మేనని పేర్కొన్నారు.

“ఇవాళ భార‌త‌దేశానికి సుస్థిర ఆర్థికవృద్ధి ప్రాధాన్యం”, అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక మార్కెట్ల‌ను అధునాత‌న సాంకేతిక‌త‌లు, నియంత్ర‌ణా నిబంధ‌న‌ల‌తో బ‌లోపేతం చేయ‌డానికి  ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన‌, పార‌ద‌ర్శ‌క‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను త‌యారుచేస్తోంద‌ని అన్నారు. గ్రీన్ ఫైనాన్స్, ఆర్థిక స‌మ్మిళితంలో, పూర్తిస్థాయిలో సుస్థిరవృద్ధికి స‌హ‌క‌రిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.
 

త‌న ప్ర‌సంగాన్ని ముగిస్తూ, భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన జీవ‌న‌శైలిని అందించ‌డంలో భార‌త‌దేశ ఫిన్‌టెక్ వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. “భార‌త‌దేశ ఫిన్‌టెక్ వ్య‌వ‌స్థ ప్ర‌పంచం మొత్తంలో సుల‌భ‌త‌ర జీవ‌నాన్ని పెంపొందిస్తుంది. అయితే, ఈ దిశగా మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఐదేళ్ల త‌ర్వాత జీఎఫ్ఎఫ్ 10వ కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొంటాన‌టూ త‌న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మం ముగిసే ముందు ప్ర‌ధాని ఆహుతుల‌తో సెల్ఫీ దిగారు. ఏఐని వినియోగించ‌డం ద్వారా ఈ ఫోటోలో ఉన్న ఎవ‌రైనా న‌మో యాప్‌లోని ఫోటో సెక్ష‌న్‌కు వెళ్లి వారి సెల్ఫీని అప్‌లోడ్ చేయడం ద్వారా తమను తాము చూసుకోవచ్చన్నారు.

భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ శ్రీ శ‌క్తికాంత దాస్‌, జీఎఫ్ఎఫ్ చైర్మ‌న్ క్రిస్ గోపాల‌కృష్ణ‌న్‌, త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

నేప‌థ్యం
పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ క‌న్వ‌ర్జ‌న్స్ కౌన్సిల్ క‌లిసి సంయుక్తంగా గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ను నిర్వ‌హిస్తున్నాయి. భార‌త్‌తో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన సుమారు 800 మంది విధాన రూప‌క‌ర్త‌లు, రెగ్యులేట‌ర్లు, సీనియ‌ర్ బ్యాంక‌ర్లు, ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు, విద్యావేత్త‌లు ఈ స‌ద‌స్సులోని 350 ప్రత్యేక కార్యక్రమాల్లో ప్ర‌సంగించ‌నున్నారు. ఫిన్‌టెక్ రంగంలో తాజా ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శిస్తారు. సుమారు 20 శ్వేత‌ప‌త్రాలు, ఆలోచనా పూర్వక నాయకత్వ నివేదిక‌ల‌ను జీఎఫ్ఎఫ్ 2024లో ఆవిష్క‌రిస్తారు. ఇవి ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి అంశాల‌ను, లోతైన స‌మాచారాన్ని అందిస్తాయి.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM Modi's address at the Parliament of Guyana
November 21, 2024

Hon’ble Speaker, मंज़ूर नादिर जी,
Hon’ble Prime Minister,मार्क एंथनी फिलिप्स जी,
Hon’ble, वाइस प्रेसिडेंट भरत जगदेव जी,
Hon’ble Leader of the Opposition,
Hon’ble Ministers,
Members of the Parliament,
Hon’ble The चांसलर ऑफ द ज्यूडिशियरी,
अन्य महानुभाव,
देवियों और सज्जनों,

गयाना की इस ऐतिहासिक पार्लियामेंट में, आप सभी ने मुझे अपने बीच आने के लिए निमंत्रित किया, मैं आपका बहुत-बहुत आभारी हूं। कल ही गयाना ने मुझे अपना सर्वोच्च सम्मान दिया है। मैं इस सम्मान के लिए भी आप सभी का, गयाना के हर नागरिक का हृदय से आभार व्यक्त करता हूं। गयाना का हर नागरिक मेरे लिए ‘स्टार बाई’ है। यहां के सभी नागरिकों को धन्यवाद! ये सम्मान मैं भारत के प्रत्येक नागरिक को समर्पित करता हूं।

साथियों,

भारत और गयाना का नाता बहुत गहरा है। ये रिश्ता, मिट्टी का है, पसीने का है,परिश्रम का है करीब 180 साल पहले, किसी भारतीय का पहली बार गयाना की धरती पर कदम पड़ा था। उसके बाद दुख में,सुख में,कोई भी परिस्थिति हो, भारत और गयाना का रिश्ता, आत्मीयता से भरा रहा है। India Arrival Monument इसी आत्मीय जुड़ाव का प्रतीक है। अब से कुछ देर बाद, मैं वहां जाने वाला हूं,

साथियों,

आज मैं भारत के प्रधानमंत्री के रूप में आपके बीच हूं, लेकिन 24 साल पहले एक जिज्ञासु के रूप में मुझे इस खूबसूरत देश में आने का अवसर मिला था। आमतौर पर लोग ऐसे देशों में जाना पसंद करते हैं, जहां तामझाम हो, चकाचौंध हो। लेकिन मुझे गयाना की विरासत को, यहां के इतिहास को जानना था,समझना था, आज भी गयाना में कई लोग मिल जाएंगे, जिन्हें मुझसे हुई मुलाकातें याद होंगीं, मेरी तब की यात्रा से बहुत सी यादें जुड़ी हुई हैं, यहां क्रिकेट का पैशन, यहां का गीत-संगीत, और जो बात मैं कभी नहीं भूल सकता, वो है चटनी, चटनी भारत की हो या फिर गयाना की, वाकई कमाल की होती है,

साथियों,

बहुत कम ऐसा होता है, जब आप किसी दूसरे देश में जाएं,और वहां का इतिहास आपको अपने देश के इतिहास जैसा लगे,पिछले दो-ढाई सौ साल में भारत और गयाना ने एक जैसी गुलामी देखी, एक जैसा संघर्ष देखा, दोनों ही देशों में गुलामी से मुक्ति की एक जैसी ही छटपटाहट भी थी, आजादी की लड़ाई में यहां भी,औऱ वहां भी, कितने ही लोगों ने अपना जीवन समर्पित कर दिया, यहां गांधी जी के करीबी सी एफ एंड्रूज हों, ईस्ट इंडियन एसोसिएशन के अध्यक्ष जंग बहादुर सिंह हों, सभी ने गुलामी से मुक्ति की ये लड़ाई मिलकर लड़ी,आजादी पाई। औऱ आज हम दोनों ही देश,दुनिया में डेमोक्रेसी को मज़बूत कर रहे हैं। इसलिए आज गयाना की संसद में, मैं आप सभी का,140 करोड़ भारतवासियों की तरफ से अभिनंदन करता हूं, मैं गयाना संसद के हर प्रतिनिधि को बधाई देता हूं। गयाना में डेमोक्रेसी को मजबूत करने के लिए आपका हर प्रयास, दुनिया के विकास को मजबूत कर रहा है।

साथियों,

डेमोक्रेसी को मजबूत बनाने के प्रयासों के बीच, हमें आज वैश्विक परिस्थितियों पर भी लगातार नजर ऱखनी है। जब भारत और गयाना आजाद हुए थे, तो दुनिया के सामने अलग तरह की चुनौतियां थीं। आज 21वीं सदी की दुनिया के सामने, अलग तरह की चुनौतियां हैं।
दूसरे विश्व युद्ध के बाद बनी व्यवस्थाएं और संस्थाएं,ध्वस्त हो रही हैं, कोरोना के बाद जहां एक नए वर्ल्ड ऑर्डर की तरफ बढ़ना था, दुनिया दूसरी ही चीजों में उलझ गई, इन परिस्थितियों में,आज विश्व के सामने, आगे बढ़ने का सबसे मजबूत मंत्र है-"Democracy First- Humanity First” "Democracy First की भावना हमें सिखाती है कि सबको साथ लेकर चलो,सबको साथ लेकर सबके विकास में सहभागी बनो। Humanity First” की भावना हमारे निर्णयों की दिशा तय करती है, जब हम Humanity First को अपने निर्णयों का आधार बनाते हैं, तो नतीजे भी मानवता का हित करने वाले होते हैं।

साथियों,

हमारी डेमोक्रेटिक वैल्यूज इतनी मजबूत हैं कि विकास के रास्ते पर चलते हुए हर उतार-चढ़ाव में हमारा संबल बनती हैं। एक इंक्लूसिव सोसायटी के निर्माण में डेमोक्रेसी से बड़ा कोई माध्यम नहीं। नागरिकों का कोई भी मत-पंथ हो, उसका कोई भी बैकग्राउंड हो, डेमोक्रेसी हर नागरिक को उसके अधिकारों की रक्षा की,उसके उज्जवल भविष्य की गारंटी देती है। और हम दोनों देशों ने मिलकर दिखाया है कि डेमोक्रेसी सिर्फ एक कानून नहीं है,सिर्फ एक व्यवस्था नहीं है, हमने दिखाया है कि डेमोक्रेसी हमारे DNA में है, हमारे विजन में है, हमारे आचार-व्यवहार में है।

साथियों,

हमारी ह्यूमन सेंट्रिक अप्रोच,हमें सिखाती है कि हर देश,हर देश के नागरिक उतने ही अहम हैं, इसलिए, जब विश्व को एकजुट करने की बात आई, तब भारत ने अपनी G-20 प्रेसीडेंसी के दौरान One Earth, One Family, One Future का मंत्र दिया। जब कोरोना का संकट आया, पूरी मानवता के सामने चुनौती आई, तब भारत ने One Earth, One Health का संदेश दिया। जब क्लाइमेट से जुड़े challenges में हर देश के प्रयासों को जोड़ना था, तब भारत ने वन वर्ल्ड, वन सन, वन ग्रिड का विजन रखा, जब दुनिया को प्राकृतिक आपदाओं से बचाने के लिए सामूहिक प्रयास जरूरी हुए, तब भारत ने CDRI यानि कोएलिशन फॉर डिज़ास्टर रज़ीलिएंट इंफ्रास्ट्रक्चर का initiative लिया। जब दुनिया में pro-planet people का एक बड़ा नेटवर्क तैयार करना था, तब भारत ने मिशन LiFE जैसा एक global movement शुरु किया,

साथियों,

"Democracy First- Humanity First” की इसी भावना पर चलते हुए, आज भारत विश्वबंधु के रूप में विश्व के प्रति अपना कर्तव्य निभा रहा है। दुनिया के किसी भी देश में कोई भी संकट हो, हमारा ईमानदार प्रयास होता है कि हम फर्स्ट रिस्पॉन्डर बनकर वहां पहुंचे। आपने कोरोना का वो दौर देखा है, जब हर देश अपने-अपने बचाव में ही जुटा था। तब भारत ने दुनिया के डेढ़ सौ से अधिक देशों के साथ दवाएं और वैक्सीन्स शेयर कीं। मुझे संतोष है कि भारत, उस मुश्किल दौर में गयाना की जनता को भी मदद पहुंचा सका। दुनिया में जहां-जहां युद्ध की स्थिति आई,भारत राहत और बचाव के लिए आगे आया। श्रीलंका हो, मालदीव हो, जिन भी देशों में संकट आया, भारत ने आगे बढ़कर बिना स्वार्थ के मदद की, नेपाल से लेकर तुर्की और सीरिया तक, जहां-जहां भूकंप आए, भारत सबसे पहले पहुंचा है। यही तो हमारे संस्कार हैं, हम कभी भी स्वार्थ के साथ आगे नहीं बढ़े, हम कभी भी विस्तारवाद की भावना से आगे नहीं बढ़े। हम Resources पर कब्जे की, Resources को हड़पने की भावना से हमेशा दूर रहे हैं। मैं मानता हूं,स्पेस हो,Sea हो, ये यूनीवर्सल कन्फ्लिक्ट के नहीं बल्कि यूनिवर्सल को-ऑपरेशन के विषय होने चाहिए। दुनिया के लिए भी ये समय,Conflict का नहीं है, ये समय, Conflict पैदा करने वाली Conditions को पहचानने और उनको दूर करने का है। आज टेरेरिज्म, ड्रग्स, सायबर क्राइम, ऐसी कितनी ही चुनौतियां हैं, जिनसे मुकाबला करके ही हम अपनी आने वाली पीढ़ियों का भविष्य संवार पाएंगे। और ये तभी संभव है, जब हम Democracy First- Humanity First को सेंटर स्टेज देंगे।

साथियों,

भारत ने हमेशा principles के आधार पर, trust और transparency के आधार पर ही अपनी बात की है। एक भी देश, एक भी रीजन पीछे रह गया, तो हमारे global goals कभी हासिल नहीं हो पाएंगे। तभी भारत कहता है – Every Nation Matters ! इसलिए भारत, आयलैंड नेशन्स को Small Island Nations नहीं बल्कि Large ओशिन कंट्रीज़ मानता है। इसी भाव के तहत हमने इंडियन ओशन से जुड़े आयलैंड देशों के लिए सागर Platform बनाया। हमने पैसिफिक ओशन के देशों को जोड़ने के लिए भी विशेष फोरम बनाया है। इसी नेक नीयत से भारत ने जी-20 की प्रेसिडेंसी के दौरान अफ्रीकन यूनियन को जी-20 में शामिल कराकर अपना कर्तव्य निभाया।

साथियों,

आज भारत, हर तरह से वैश्विक विकास के पक्ष में खड़ा है,शांति के पक्ष में खड़ा है, इसी भावना के साथ आज भारत, ग्लोबल साउथ की भी आवाज बना है। भारत का मत है कि ग्लोबल साउथ ने अतीत में बहुत कुछ भुगता है। हमने अतीत में अपने स्वभाव औऱ संस्कारों के मुताबिक प्रकृति को सुरक्षित रखते हुए प्रगति की। लेकिन कई देशों ने Environment को नुकसान पहुंचाते हुए अपना विकास किया। आज क्लाइमेट चेंज की सबसे बड़ी कीमत, ग्लोबल साउथ के देशों को चुकानी पड़ रही है। इस असंतुलन से दुनिया को निकालना बहुत आवश्यक है।

साथियों,

भारत हो, गयाना हो, हमारी भी विकास की आकांक्षाएं हैं, हमारे सामने अपने लोगों के लिए बेहतर जीवन देने के सपने हैं। इसके लिए ग्लोबल साउथ की एकजुट आवाज़ बहुत ज़रूरी है। ये समय ग्लोबल साउथ के देशों की Awakening का समय है। ये समय हमें एक Opportunity दे रहा है कि हम एक साथ मिलकर एक नया ग्लोबल ऑर्डर बनाएं। और मैं इसमें गयाना की,आप सभी जनप्रतिनिधियों की भी बड़ी भूमिका देख रहा हूं।

साथियों,

यहां अनेक women members मौजूद हैं। दुनिया के फ्यूचर को, फ्यूचर ग्रोथ को, प्रभावित करने वाला एक बहुत बड़ा फैक्टर दुनिया की आधी आबादी है। बीती सदियों में महिलाओं को Global growth में कंट्रीब्यूट करने का पूरा मौका नहीं मिल पाया। इसके कई कारण रहे हैं। ये किसी एक देश की नहीं,सिर्फ ग्लोबल साउथ की नहीं,बल्कि ये पूरी दुनिया की कहानी है।
लेकिन 21st सेंचुरी में, global prosperity सुनिश्चित करने में महिलाओं की बहुत बड़ी भूमिका होने वाली है। इसलिए, अपनी G-20 प्रेसीडेंसी के दौरान, भारत ने Women Led Development को एक बड़ा एजेंडा बनाया था।

साथियों,

भारत में हमने हर सेक्टर में, हर स्तर पर, लीडरशिप की भूमिका देने का एक बड़ा अभियान चलाया है। भारत में हर सेक्टर में आज महिलाएं आगे आ रही हैं। पूरी दुनिया में जितने पायलट्स हैं, उनमें से सिर्फ 5 परसेंट महिलाएं हैं। जबकि भारत में जितने पायलट्स हैं, उनमें से 15 परसेंट महिलाएं हैं। भारत में बड़ी संख्या में फाइटर पायलट्स महिलाएं हैं। दुनिया के विकसित देशों में भी साइंस, टेक्नॉलॉजी, इंजीनियरिंग, मैथ्स यानि STEM graduates में 30-35 परसेंट ही women हैं। भारत में ये संख्या फोर्टी परसेंट से भी ऊपर पहुंच चुकी है। आज भारत के बड़े-बड़े स्पेस मिशन की कमान महिला वैज्ञानिक संभाल रही हैं। आपको ये जानकर भी खुशी होगी कि भारत ने अपनी पार्लियामेंट में महिलाओं को रिजर्वेशन देने का भी कानून पास किया है। आज भारत में डेमोक्रेटिक गवर्नेंस के अलग-अलग लेवल्स पर महिलाओं का प्रतिनिधित्व है। हमारे यहां लोकल लेवल पर पंचायती राज है, लोकल बॉड़ीज़ हैं। हमारे पंचायती राज सिस्टम में 14 लाख से ज्यादा यानि One point four five मिलियन Elected Representatives, महिलाएं हैं। आप कल्पना कर सकते हैं, गयाना की कुल आबादी से भी करीब-करीब दोगुनी आबादी में हमारे यहां महिलाएं लोकल गवर्नेंट को री-प्रजेंट कर रही हैं।

साथियों,

गयाना Latin America के विशाल महाद्वीप का Gateway है। आप भारत और इस विशाल महाद्वीप के बीच अवसरों और संभावनाओं का एक ब्रिज बन सकते हैं। हम एक साथ मिलकर, भारत और Caricom की Partnership को और बेहतर बना सकते हैं। कल ही गयाना में India-Caricom Summit का आयोजन हुआ है। हमने अपनी साझेदारी के हर पहलू को और मजबूत करने का फैसला लिया है।

साथियों,

गयाना के विकास के लिए भी भारत हर संभव सहयोग दे रहा है। यहां के इंफ्रास्ट्रक्चर में निवेश हो, यहां की कैपेसिटी बिल्डिंग में निवेश हो भारत और गयाना मिलकर काम कर रहे हैं। भारत द्वारा दी गई ferry हो, एयरक्राफ्ट हों, ये आज गयाना के बहुत काम आ रहे हैं। रीन्युएबल एनर्जी के सेक्टर में, सोलर पावर के क्षेत्र में भी भारत बड़ी मदद कर रहा है। आपने t-20 क्रिकेट वर्ल्ड कप का शानदार आयोजन किया है। भारत को खुशी है कि स्टेडियम के निर्माण में हम भी सहयोग दे पाए।

साथियों,

डवलपमेंट से जुड़ी हमारी ये पार्टनरशिप अब नए दौर में प्रवेश कर रही है। भारत की Energy डिमांड तेज़ी से बढ़ रही हैं, और भारत अपने Sources को Diversify भी कर रहा है। इसमें गयाना को हम एक महत्वपूर्ण Energy Source के रूप में देख रहे हैं। हमारे Businesses, गयाना में और अधिक Invest करें, इसके लिए भी हम निरंतर प्रयास कर रहे हैं।

साथियों,

आप सभी ये भी जानते हैं, भारत के पास एक बहुत बड़ी Youth Capital है। भारत में Quality Education और Skill Development Ecosystem है। भारत को, गयाना के ज्यादा से ज्यादा Students को Host करने में खुशी होगी। मैं आज गयाना की संसद के माध्यम से,गयाना के युवाओं को, भारतीय इनोवेटर्स और वैज्ञानिकों के साथ मिलकर काम करने के लिए भी आमंत्रित करता हूँ। Collaborate Globally And Act Locally, हम अपने युवाओं को इसके लिए Inspire कर सकते हैं। हम Creative Collaboration के जरिए Global Challenges के Solutions ढूंढ सकते हैं।

साथियों,

गयाना के महान सपूत श्री छेदी जगन ने कहा था, हमें अतीत से सबक लेते हुए अपना वर्तमान सुधारना होगा और भविष्य की मजबूत नींव तैयार करनी होगी। हम दोनों देशों का साझा अतीत, हमारे सबक,हमारा वर्तमान, हमें जरूर उज्जवल भविष्य की तरफ ले जाएंगे। इन्हीं शब्दों के साथ मैं अपनी बात समाप्त करता हूं, मैं आप सभी को भारत आने के लिए भी निमंत्रित करूंगा, मुझे गयाना के ज्यादा से ज्यादा जनप्रतिनिधियों का भारत में स्वागत करते हुए खुशी होगी। मैं एक बार फिर गयाना की संसद का, आप सभी जनप्रतिनिधियों का, बहुत-बहुत आभार, बहुत बहुत धन्यवाद।