గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో నిర్వహించిన వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న నాటి వీరులను ఆయన సత్కరించారు. నవీకరించిన ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియం, గోవా వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవన సముదాయం, న్యూ సౌత్ గోవా జిల్లా ఆస్పత్రి, మోపా ఎయిర్‌పోర్టులో విమానయాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మార్గోవాలోని డబోలిమ్-నవేలిమ్ వద్ద ‘గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్’సహా పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు. అలాగే గోవాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టుకు చెందిన ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి’ సంస్థకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- గోవా నేల, గోవా గాలి, గోవా సముద్రం తదితరాలను ప్రకృతి అద్భుత వరాలతో ఆశీర్వదించిందని పేర్కొన్నారు. నేడు గోవా ప్రజలందరి గోవా విమోచనకు తోడు ఇవాళ్టి వేడుకలతో ఆనందోత్సాహాలు మరింత ఉప్పొంగాయన్నారు. ఆజాద్ మైదాన్‌లోని షహీద్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అమరవీరులకు నివాళి అనంతరం మిరామార్‌లో సెల్ పరేడ్, వైమానిక గౌరవ వందనం కూడా వీక్షించారు. ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న వీరులను, మాజీ సైనికులను దేశం తరఫున సత్కరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ గోవా పోగుచేసిన అనేక అవకాశాలను, ఎన్నో అద్భుత అనుభవాలను అందించిన శక్తిమంతమైన గోవా స్ఫూర్తికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలు మొఘలుల ఆధీనంలో ఉన్నప్పటికీ గోవా మాత్రం పోర్చుగీసు ఆధిపత్యంలోకి వచ్చిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆ తర్వాత భారత్ ఎన్నో ఒడుదొడుకులను చవిచూసిందని చెప్పారు. శతాబ్దాల తరబడి అధికారం చేతులు మారుతూ వచ్చినా గోవా తన భారతీయతను మరచిపోలేదని, అదేవిధంగా భారతదేశం గోవాను విస్మరించలేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. కాలక్రమంలో ఈ బంధం మరింత బలోపేతమైందని చెప్పారు. మరోవైపు గోవా విముక్తి ఉద్యమం… స్వరాజ్య పోరాటాల స్ఫూర్తిని ప్రజలు ఏనాడూ సడలించలేదని, భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య సమర జ్యోతిని ఎక్కువ కాలం రగిలిస్తూ వచ్చింది గోవా ప్రజలేనని అన్నారు. భారతదేశం కేవలం రాజకీయ శక్తి కాదని, మానవాళి ప్రయోజనాలను కాపాడే ఆలోచన, వసుధైక కుటుంబాలను ప్రతిబింబించే స్ఫూర్తి కావడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వార్థంకన్నా దేశమే మిన్న అనడానికి భారతదేశం ఒక నిదర్శనమని, ఇక్కడ దేశమే ప్రధానమన్నది తారకమంత్రమని, ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ అన్నదే ఏకైక సంకల్పమని స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కొంత భాగం విముక్తం కాకపోవడంపై భారతదేశంలోని ప్రజలందరి మనసులో ఆందోళన నెలకొన్నదని ప్రధాని అన్నారు. సర్దార్ పటేల్ మరికొన్నేళ్లు జీవించి ఉంటే.. గోవా విముక్తి కోసం ప్రజలు ఎంతోకాలం ఎదురుచూడాల్సి వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాటి పోరాట వీరులకు ప్రధాని శిరసాభివందనం చేశారు. గోవా ముక్తి విమోచన సమితి చేపట్టిన పోరాటంలో 31 మంది సత్యాగ్రహులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ఈ త్యాగాల గురించి, పంజాబ్‌కు చెందిన వీర్ కర్నైల్ సింగ్ బేణీపాల్ వంటి వీరుల గురించి అందరూ ఒకసారి ఆలోచించాలన్నారు. “గోవా స్వాతంత్ర్య పోరాట చరిత్ర కేవలం భారతదేశ సంకల్పానికి ప్రతీక మాత్రమే కాదని, భారతదేశ ఐక్యత- సమగ్రతలకు సజీవ పత్రం” అని ప్రధానమంత్రి అన్నారు.
ఇటీవల తాను ఇటలీ, వాటికన్ సిటీలకు వెళ్లిన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకోవడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారతదేశంపై పోప్ దృక్పథం ఎంతో విస్తృతమైనదని పేర్కొంటూ పోప్‌ను భారత్‌కు ఆహ్వానించడంపైనా ప్రధాని మాట్లాడారు. దీనిపై పోప్ స్పందిస్తూ “ఇది మీరు నాకిచ్చిన గొప్ప బహుమతి” అనడాన్ని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకున్నారు. భారతదేశ వైవిధ్యం, శక్తిమంతమైన మన ప్రజాస్వామ్యంపై పోప్‌కు ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కాగా, సెయింట్ క్వీన్ కేటెవన్ పవిత్ర అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అందజేయడంపైనా ప్రధానమంత్రి మాట్లాడారు.
పాలనపరంగా గోవా సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ- గోవా సహజ సౌందర్యం దాని ప్రత్యేకత అని, దీనికితోడు గోవా ప్రభుత్వం మరొక గుర్తింపును సువ్యవస్థితం చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు ప్రతి పాలనా వ్యవహారంలో అగ్రగామి కావడం రాష్ట్రానికి దక్కిన కొత్త గుర్తింపుగా పేర్కొన్నారు. దేశంలో మరెక్కడైనా పని ప్రారంభంలో లేదా కొనసాగుతుండగానే గోవా ఆ కార్యాన్ని పూర్తి చేసేస్తుందని కొనియాడారు. గోవా రాష్ట్రాన్ని బహిరంగ విసర్జనరహితం చేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ‘హర్ ఘర్ జల్’’, జనన-మరణాల నమోదుసహా జనజీవన సౌలభ్యాన్ని పెంచే ఇతర పథకాలు ఇందుకు నిదర్శనమని ప్రధాని ఉదాహరించారు. అలాగే ‘స్వయంపూర్ణ గోవా అభియాన్’ ప్రగతిని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర పాలనలో సాధించిన విజయాలకుగాను ముఖ్యమంత్రితోపాటు ఆయన బృందాన్ని అభినందించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను కూడా ప్రధాని ప్రస్తావించారు. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని ఇటీవల విజయవంతంగా నిర్వహించడంపై రాష్ట్రాన్ని ఆయన అభినందించారు.
దివంగత శ్రీ మనోహర్ పరికర్‌కు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. “గోవా సాధించిన ఈ విజయాలు, కొత్తగా దక్కించుకున్న గుర్తింపు బలోపేతం కావడం చూసినప్పుడు నా మిత్రుడు శ్రీ మనోహర్ పరికర్ గుర్తొస్తున్నారు. ఆయన గోవాను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేర్చడమేగాక గోవా సామర్థ్యాన్ని కూడా బహుముఖంగా విస్తరింపజేశారు. ఒక వ్యక్తి తన తుదిశ్వాస వీడేదాకా తన రాష్ట్రానికి, తన ప్రజలకు ఏ విధంగా నిబద్ధులై ఉండగలరో ఆయన జీవితమే స్పష్టం చేసింది” అని ప్రధాని అన్నారు. నిజాయితీ.. ప్రతిభ.. అంకితభావం వంటి గోవా ప్రజల లక్షణాలు మనోహర్ పరికర్‌లో ప్రతిబింబించడాన్ని దేశం ప్రత్యక్షంగా చూసిందంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.
गोवा की धरती को, गोवा की हवा को, गोवा के समंदर को, प्रकृति का अद्भुत वरदान मिला हुआ है।
— PMO India (@PMOIndia) December 19, 2021
और आज सभी का, गोवा के लोगों का ये जोश, गोवा की हवाओं में मुक्ति के गौरव को और बढ़ा रहा है: PM @narendramodi
इतने अवसर, अभिभूत करने वाले इतने अनुभव गोवा ने आज एक साथ दिये हैं।
— PMO India (@PMOIndia) December 19, 2021
यही तो जिंदादिल, वाइब्रेंट गोवा का स्वभाव है: PM @narendramodi
मुझे आज़ाद मैदान में शहीद मेमोरियल पर शहीदों को श्रद्धांजलि देने का सौभाग्य भी मिला।
— PMO India (@PMOIndia) December 19, 2021
शहीदों को नमन करने के बाद मैं मीरामर में सेल परेड और फ़्लाइ पास्ट का साक्षी भी बना।
यहाँ आकर भी ऑपरेशन विजय के वीरों को, veterans को देश की ओर से सम्मानित करने का अवसर मिला: PM @narendramodi
लेकिन समय और सत्ताओं की उठापटक के बीच सदियों की दूरियों के बाद भी न गोवा अपनी भारतीयता को भूला, न भारत अपने गोवा को भूला।
— PMO India (@PMOIndia) December 19, 2021
ये एक ऐसा रिश्ता है जो समय के साथ और सशक्त ही हुआ है: PM @narendramodi
गोवा एक ऐसे समय में पुर्तगाल के अधीन गया था जब देश के दूसरे बड़े भूभाग में मुगलों की सल्तनत थी।
— PMO India (@PMOIndia) December 19, 2021
उसके बाद कितने ही सियासी तूफान इस देश ने देखे, सत्ताओं की कितनी उठक पटक हुई: PM @narendramodi
गोवा के लोगों ने भी मुक्ति और स्वराज के लिए आंदोलनों को थमने नहीं दिया।
— PMO India (@PMOIndia) December 19, 2021
उन्होंने भारत के इतिहास में सबसे लम्बे समय तक आज़ादी की लौ को जलाकर रखा।
ऐसा इसलिए क्योंकि, भारत सिर्फ एक राजनीतिक सत्ता भर नहीं है।
भारत मानवता के हितों की रक्षा करने वाला एक विचार है, एक परिवार है: PM
भारत एक ऐसा भाव है जहां राष्ट्र ‘स्व’ से ऊपर होता है, सर्वोपरि होता है।
— PMO India (@PMOIndia) December 19, 2021
जहां एक ही मंत्र होता है- राष्ट्र प्रथम।
जहां एक ही संकल्प होता है- एक भारत, श्रेष्ठ भारत: PM @narendramodi
इनके भीतर एक छटपटाहट थी क्योंकि उस समय देश का एक हिस्सा तब भी पराधीन था, कुछ देशवासियों को तब भी आज़ादी नहीं मिली थी।
— PMO India (@PMOIndia) December 19, 2021
और आज मैं इस अवसर पर ये भी कहूंगा कि अगर सरदार पटेल साहब, कुछ वर्ष और जीवित रहते, तो गोवा को अपनी मुक्ति के लिए इतना इंतजार नहीं करना पड़ता: PM @narendramodi
गोवा मुक्ति विमोचन समिति के सत्याग्रह में 31 सत्याग्रहियों को अपने प्राण गँवाने पड़े थे।
— PMO India (@PMOIndia) December 19, 2021
आप सोचिए, इन बलिदानियों के बारे में, पंजाब के वीर करनैल सिंह बेनीपाल जैसे वीरों के बारे में: PM @narendramodi
मैं आपको जरूर बताना चाहता हूं कि जो उन्होंने मेरे निमंत्रण के बाद कहा था-
— PMO India (@PMOIndia) December 19, 2021
पोप फ्रांसिस ने कहा था- “This is the greatest gift you have given me” ये भारत की विविधता, हमारी ब्राइब्रेंट डेमोक्रेसी के प्रति उनका स्नेह है: PM @narendramodi
कुछ समय पहले इटली और वैटिकन सिटी गया था।
— PMO India (@PMOIndia) December 19, 2021
वहाँ मुझे पोप फ्रांसिस जी से मुलाक़ात का अवसर भी मिला।
भारत के प्रति उनका भाव भी वैसा ही अभिभूत करने वाला था।
मैंने उन्हें भारत आने के लिए आमंत्रित भी किया: PM @narendramodi
गोवा की प्राकृतिक सुंदरता, हमेशा से उसकी पहचान रही है।
— PMO India (@PMOIndia) December 19, 2021
लेकिन अब यहां जो सरकार है, वो गोवा की एक और पहचान सशक्त कर रही है।
ये नई पहचान है- हर काम में अव्वल रहने वाले, टॉप करने वाले राज्य की।
बाकी जगह जब काम की शुरुआत होती है, या काम आगे बढ़ता है, गोवा उसे तब पूरा कर लेता है: PM
गोवा के लोग कितने ईमानदार होते हैं, कितने प्रतिभावान और मेहनती होते हैं, देश गोवा के चरित्र को मनोहर जी के भीतर देखता था।
— PMO India (@PMOIndia) December 19, 2021
आखिरी सांस तक कोई कैसे अपने राज्य, अपने लोगों के लिए लगा रह सकता है, उनके जीवन में हमने ये साक्षात देखा था: PM @narendramodi
गोवा की इन उपलब्धियों को, इस नई पहचान को जब मैं मजबूत होते देखता हूँ तो मुझे मेरे अभिन्न साथी मनोहर परिकर जी की भी याद आती है।
— PMO India (@PMOIndia) December 19, 2021
उन्होंने न केवल गोवा को विकास की नई ऊंचाई तक पहुंचाया, बल्कि गोवा की क्षमता का भी विस्तार किया: PM @narendramodi