డిజిటల్‌ సుప్రీంకోర్టు రిపోర్టులు, డిజిటల్‌ కోర్టు 2.0, సుప్రీంకోర్టు కొత్తవెబ్‌సైట్‌ ప్రారంభించిన ప్రధానమంత్రి.
‘‘భారతదేశ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన సుప్రీంకోర్టు’’
‘‘ఇండియా ఈరోజు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు ప్రకాశవంతమైన రేపటి భారతావనిని మరింత బలోపేతం
‘‘ ఇండియాలో ఇవాళ తీసుకువస్తున్న చట్టాలు, రేపటి ఉజ్వల భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయి’’.
‘‘సులభతర న్యాయం అనేది ప్రతి భారతీయ పౌరుడి హక్కు, భారత సుప్రీంకోర్టు ఇందుకు ఒక మాధ్యమం’’
‘‘దేశంలో సులభతర న్యాయాన్ని మెరుగుపరిచేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను’’
‘‘దేశంలో కోర్టులలో మౌలికసదుపాయాల కోసం రూ 7000 కోట్లు పంపిణీ చేయడం జరిగింది’’
‘‘సుప్రీంకోర్టు భవన సముదాయం విస్తరణకు గత వారం రూ 800 కోట్లు ఆమోదించడం జరిగింది.’’
‘‘బలమైన న్యాయవ్యవస్థ వికసిత భారత్‌కు ప్రధాన పునాది’’
‘‘ఈ కోర్టుల మిషన్‌ ప్రాజెక్టు మూడో దశకు రెండో దశ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ నిధుల అందుబాటు’
‘‘ ప్రస్తుత పరిస్థితులకు , అత్తుత్తమ విధానాలకు అనుగుణంగా చట్టఆలను ఆధునికం చేస
వ్యక్తిగతహక్కులు, భావప్రకటనాస్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశ సామాజిక, రాజకీయ వ్యవస్థకు నూతన దిశను నిర్దేశించాయని ప్రధానమంత్రి అన్నారు
‘‘ఇవాళ తీసుకువచ్చే చట్టాలు, రేపటి భారతదేశ ఉజ్వల భవిష్యత్తును బలోపేతం చేస్తా’’యని ఆయన అన్నారు.

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను జనవరి 28న,  డిల్లీిలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, పౌర కేంద్రిత సమాచార సాంకేతిక పరిజ్ఞాన చర్యలను ప్రారంభించారు. ఇందులో డిజిటల్‌ సుప్రీంకోర్టు రిపోర్టులు (డిజి ఎస్‌సిఆర్‌) , డిజిటల్‌ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్‌ సైట్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.  సుప్రీంకోర్టు 75 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్బంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అలాగే భారత రాజ్యంగం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.
భారత రాజ్యాంగ రూపశిల్పులు  స్వేచ్ఛ, సమానత్వం, సమాన న్యాయం ఆధారంగా గల స్వేచ్ఛాయుత భారతదేశాన్ని కలలుగన్నారని, సుప్రీంకోర్టు ఈ సూత్రాలను కాపాడేందుకు పాటుపడుతూ వచ్చిందని ప్రధానమంత్రి కొనియాడారు.
‘‘ అది భావప్రకటనా స్వేచ్ఛ కానీ, వ్యక్తిగత స్వేచ్ఛ లేదా సామాజిక న్యాయం కానీ సుప్రీంకోర్టు భారతదేశ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ వచ్చిందని ప్రధానమంత్రి తెలిపారు. వ్యక్తిగతహక్కులు, భావప్రకటనాస్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశ సామాజిక, రాజకీయ వ్యవస్థకు నూతన దిశను నిర్దేశించాయని ప్రధానమంత్రి అన్నారు.
 

రాగల 25 సంవత్సరాలలో ప్రభుత్వానికి చెందిన ప్రతి విభాగానికి నిర్దేశించిన లక్ష్యాలు, ప్రమాణాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇవాల్టి ఆర్థిక విధానాలు రేపటి చైతన్యవంతమైన భారతదేశానికి పునాది గా ఉంటాయని తెలిపారు. ‘‘ఇవాళ తీసుకువచ్చే చట్టాలు, రేపటి భారతదేశ ఉజ్వల భవిష్యత్తును బలోపేతం చేస్తా’’యని ఆయన అన్నారు.
అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ప్రపంచం యావత్తు ఇండియావైపు చూస్తున్నదని , ఇండియాపట్ల నానాటికీ విశ్వాసం పెరుగుతున్నదని చెప్పారు. మన కు అందివచ్చే అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి  సులభతర జీవనం, సులభతర  వ్యాపారం , సులభతర పర్యాటకం, సులభతర కమ్యూనికేషన్‌ , సులభతర న్యాయం అనేవి దేశం ముందు గల  ప్రాధాన్యతాంశాలని చెప్పారు. ‘‘సులభతర న్యాయం అనేది ప్రతి భారతీయ పౌరుడి  హక్కు అని, సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా ఇందుకు ఒక మాధ్యమమని ప్రధానమంత్రి అన్నారు.
 

దేశంలోని  మొత్తం న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు నేతృత్వంలో , మార్గనిర్దేశకత్వంలో నడుస్తుందని చెబుతూ ప్రధానమంత్రి,  దేశంలోని మారుమూల ప్రాంతాలలోని వారికి కూడా సుప్రీంకోర్టు అందుబాటులో ఉండే విధంగా  చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యతాంశమని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్బంగా ఈ` కోర్టుల మిషన్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.  మూడోదశకు నిధుల కేటాయింపును, రెండో దశకంటే, నాలుగురెట్లు పెంచినట్టు ప్రధానమంత్రి తెలిపారు. దేశంలోని అన్ని కోర్టుల డిజిటలైజేషన్‌ను  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా  పర్యవేక్షిస్తుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.ప్రధాన న్యాయమూర్తి కృషిని ప్రధానమంత్రి అభినందించారు

కోర్టులలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటూ ప్రధానమంత్రి, 2014 అనంతరం, ఇందుకోసం ఇప్పటికే 7000 కోట్ల రూపాయలను ఇచ్చినట్టు తెలిపారు.  ప్రస్తుత సుప్రీంకోర్టు భవనం అసౌకర్యంగా ఉండడం గురించి అంగీకరిస్తూ ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు భవన సముదాయ విస్తరణకు 800 కోట్ల రూపాయల పనులకు గత వారం ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
సుప్రీంకోర్టు ఈ రోజు ప్రారంభించిన డిజిటల్‌ కార్యకలాపాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు తీర్పులు డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి వస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను స్థానిక భాషలలోకి అనువదించే ప్రాజెక్టు ప్రారంభం కావడం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

దేశంలోని ఇతర కోర్టులలో కూడా ఇలాంటి ఏర్పాటు జరగగలదన్న ఆకాంక్షను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
న్యాయవితరణలో సాంకేతికత చేదోడుగా ఉంటుందనడానికి ఈరోజు కార్యక్రమమే మంచి ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. తన ప్రసంగం కృత్రిమ మేథ సహాయంతో అప్పటికప్పుడే ఇంగ్లీషు భాషలోకి తర్జుమా అవుతన్నదని దీనిని భాషిణి యాప్‌ద్వారా వినే సదుపాయం ఉందని ప్రధానమంత్రి తెలిపారు.  తొలుత దీనికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఉండవచ్చని అయితే ఇది సాంకేతికత వినియోగాన్ని విస్తృత పరుస్తుందని చెప్పారు.  మన కోర్టులలో కూడా ఇలాంటి సదుపాయాలను అమలు చేసి సామాన్యుల జీవితాలను సులభతరం చేయవచ్చని తెలిపారు.  ప్రజలు మెరుగైన రీతిలో అర్ధం చేసుకునే విధంగా, సులభమైన భాషలో చట్టాలను రూపొందించాలంటూ తాను గతంలో చేసిన సూచనను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కోర్టు తీర్పులు ఇతరాల విషయంలో ఇలాంటి వైఖరినే అనుసరించాలని తెలిపారు.
న్యాయచట్రపరిధిలో భారతీయ విలువలు, ఆధునికత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, మన చట్టాలు భారతీయ విలువలను , సమకాలీన విధానాలను ప్రతిబింబించాలని అన్నారు.  మన చట్టాలకు సంబంధించి భారతీయ విలువలు, ఆధునికత ఎంతో ఆవశ్యకమైనవని ప్రధానమంత్రి అన్నారు.  ప్రభుత్వం చట్టాలను ఆధునికం చేయడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నదని ప్రస్తుత పరిస్థితులు, అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా చట్టాలు ఉండేలా చూస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
కాలం చెల్లిన పలు క్రిమినల్‌ నేరాలను రద్దుచేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలకు సంబంధించిన చట్టాలను ప్రవేశపెట్టడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మార్పుల ద్వారా,మన న్యాయ,పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు నూతన శకంలోకి అడుగుపెట్టాయన్నారు. శతాబ్దాలనాటి చచపాత చట్టాలనుంచి కొత్త చట్టాలకు ప్రయాణం నిరంతరాయంగా ఉండాలన్నారు. ఇది తప్పదని చెప్పారు. ఈదిశగా ప్రభుత్వ అధికారులకు శిక్షణ, సామర్ధ్యాల నిర్మాణానికి సంబంధించి చర్యలు ప్రారంభమైనట్టు తెలిపారు.  స్టేక్‌ హోల్డర్లందరికీ  సామర్ధ్యాల నిర్మాణంలో సుప్రీంకోర్టు కూడా పాలుపంచుకోవలసిందిగా ప్రధానమంత్రి సూచించారు.

 

     వికసిత్‌ భారత్‌కు దృఢమైన న్యాయవ్యవస్థ అత్యంత కీలకమని చెబుతూ ప్రధానమంత్రి,  విశ్వసనీయమైన న్యాయ ఫ్రేమ్‌ వర్క్‌ను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తున్న చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ దిశగా జన్‌ విశ్వాస్‌ బిల్లును తీసుకువచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. పెండిరగ్‌ కేసులను తగ్గించడం ద్వారా న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార ప్రొవిజన్లను మధ్యవర్తిత్వం ద్వారా చేపట్టడడం గురించి ప్రస్తావిస్తూ, ఇది కింది స్థాయి కోర్టులపై భారాన్నితగ్గిస్తుందన్నారు.
 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు పౌరులందరి సమష్టి బాధ్యత గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాగల 25 సంవత్సరాలలో దేశ భవిష్యత్‌ను రూపుదిద్దడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర వహించనుందని ఆయన తెలిపారు.  దివంగత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎం.ఫాతిమాబీవీకి మరణానంతరం పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించడం గురించి ప్రధానమంత్రి పేర్కొంటూ ఈ అవకాశం తమకు దక్కడం గర్వకారణమన్నారు.
 

 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ డాక్టర్‌ డి.వై.చంద్రచూడ్‌ ,కేంద్ర చట్టం, న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌, ఆటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌.వెంకటరమణి, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఆదిష్‌ సి. అగర్వాల్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ శ్రీ మనన్‌ కుమార్‌ లు ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు.

     నేపథ్యం:
సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి, శ్రీనరేంద్ర మోదీ, పౌర కేంద్రిత సమాచార, సాంకేతిక చొరవను, డిజిటల్‌ సుప్రీంకోర్టు రిపోర్టులు (డిజి ఎస్‌సిఆర్‌), డిజిటల్‌కోర్టులు 2.0, సుప్రీంకోర్టు నూతన వెబ్‌ సైట్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు.
సుప్రీంకోర్టు వారి డిజిటల్‌ సుప్రీంకోర్టు రిపోర్టులు , దేశంలోని ప్రజలందరికీ సుప్రీంకోర్టు తీర్పులను ఉచితంగా ఎలక్ట్రానిక్‌ ఫార్మెట్‌లో అందుబాటులోకి తెస్తాయి. డిజిటల్‌ ఎస్‌.సి.ఆర్‌ల కింద 1950నుంచి మొత్తం 519 సుప్రీంకోర్టు రిపోర్టుల వాల్యూంలు, వీటిలోని 36,308 కేసులు డిజిటల్‌ఫార్మెట్‌లో  అందుబాటులోకి వస్తాయి. వీటికి బుక్‌మార్క్‌ చేసి, ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు  చర్యలు తీసుకున్నారు. వీటికి ఓపెన్‌యాక్సెస్‌ ఇస్తారు.

 

డిజిటల్‌ కోర్టులు 2.0 అప్లికేషన్‌ అనేది ఈ కోర్టుల ప్రాజెక్టు కింద తీసుకున్న చర్య. జిల్లా కోర్టుల జడ్జిలకు కోర్టు రికార్డులు ఎలక్ట్రానిక్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చేలా దీనిని తీసుకువచ్చారు. దీనిని కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తారు. దీనిద్వారా మాటలను అప్పటికప్పుడే అక్షరాలుగా మార్చడానికి వీలు కలుగుతుంది.
 ప్రధానమంత్రి ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కొత్త వెబ్‌సైట్‌ ఇంగ్లీషు, హిందీ భాషలలో ఉంటుంది. దీనిని ఉపయోగించే వారికి సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు.

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing away of Shri MT Vasudevan Nair
December 26, 2024

The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of Shri MT Vasudevan Nair Ji, one of the most respected figures in Malayalam cinema and literature. Prime Minister Shri Modi remarked that Shri MT Vasudevan Nair Ji's works, with their profound exploration of human emotions, have shaped generations and will continue to inspire many more.

The Prime Minister posted on X:

“Saddened by the passing away of Shri MT Vasudevan Nair Ji, one of the most respected figures in Malayalam cinema and literature. His works, with their profound exploration of human emotions, have shaped generations and will continue to inspire many more. He also gave voice to the silent and marginalised. My thoughts are with his family and admirers. Om Shanti."