PM Modi appreciates the positive change in the police attitude towards the general public, particularly post-Covid
PM Modi suggests the positive use of drone technology for the benefit of the people
PM Modi suggests the development of inter-operable technologies which would benefit police forces across the country

గౌరవనీయ ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 20వ, 21వ తేదీల లో లఖ్ నవూ లో ఏర్పాటైన 56వ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ ఆఫ్ పోలీస్‌ (డిజిస్ పి) మరియు ఇన్‌ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ ఆఫ్ పోలీస్ (ఐజి స్‌ పి) సమావేశాని కి హాజరయ్యారు. ఈ సమావేశాని కి రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల డిజి స్ పి/ఐజి స్ పి తో పాటు సిఎపిఎఫ్ ల/సిపిఒ ల కు చెందిన డిజి లు 62 మంది హాజరయ్యారు. అదనం గా, వేరు వేరు హోదా లకు చెందిన 400 మంది కి పైగా అధికారులు దేశవ్యాప్తం గా ఐబి కార్యాలయాల నుంచి వర్చువల్ పద్ధతి లో ఈ సమావేశం లో పాలుపంచుకొన్నారు.

సమావేశం లో జరిగిన చర్చల లో ప్రధాన మంత్రి పాల్గొని విలువైన సూచనల ను, సలహాల ను ఇచ్చారు. సమావేశాని కి పూర్వం, దేశ భద్రత తాలూకు కీలకమైన అంశాల పై చర్చలు జరపడం కోసం డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ తో వివిధ కీలక బృందాల ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా కీలక అంశాల లో జైలు సంబంధి సంస్కరణలు, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపు, ఎన్ జిఒ స్ కు విదేశాల నుంచి అందుతున్న ఆర్థిక సాయం, డ్రోన్ సంబంధి అంశాలు, సరిహద్దు ప్రాంతాల లోని పల్లెల అభివృద్ధి వగైరా అంశాలు ఉన్నాయి.

ప్రధాన మంత్రి ఈ రోజు న మధ్యాహ్నం నాటి సమావేశం లో ముగింపు సదస్సు ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పోలీసుల కు సంబంధించిన అన్ని సంఘటనల విశ్లేషణ మరియు కేస్ స్టడీల ను రూపొందించడం వల్ల నేర్చుకోవడాని కి సంబంధించిన ప్రక్రియ ను సంస్థాగతీకరించవచ్చంటూ నొక్కిచెప్పారు. సమావేశాన్ని హైబ్రిడ్ ఫార్మేట్ లో నిర్వహించడాన్ని ఆయన కొనియాడుతూ, దీని వల్ల వేరు వేరు హోదాల అధికారుల మధ్య సమాచారం ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్యాప్తి చెందేందుకు అవకాశం లభించిందన్నారు. దేశవ్యాప్తం గా రక్షకభట బలగాలకు ప్రయోజనకారి అయ్యే విధం గా ఇంటర్-ఆపరబుల్ టెక్నాలజీ లను అభివృద్ధి పరచాలంటూ ఆయన సలహా ను ఇచ్చారు. భావి కాలపు సాంకేతికతల ను క్షేత్ర స్థాయి లోని రక్షకభటుల కర్తవ్య నిర్వహణ సంబంధి అవసరాల ను దృష్టి లో పెట్టుకొని ఆచరణ లోకి తీసుకు రావడం కోసం ఒక ఉన్నతాధికారాలు కలిగినటువంటి పోలీస్ టెక్నాలజీ మిశన్ ను హోం శాఖ కేంద్ర మంత్రి నాయకత్వం లో ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి పిలుపు ను ఇచ్చారు. సాధారణ ప్రజానీకం యొక్క జీవన యానం లో సాంకేతిక విజ్ఞానం ప్రముఖ పాత్ర ను పోషించడాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ ఈ సందర్భం లో ఉదాహరణలు గా యుపిఐ, జిఇఎమ్, ఇంకా కోవిన్ లను ప్రస్తావించారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల వైఖరి లో సకారాత్మకమైన మార్పు రావడాన్ని, మరీ ముఖ్యం గా కోవిడ్ తరువాతి కాలం లో పరివర్తన చోటు చేసుకోవడాన్ని ఆయన ప్రశంసించారు. డ్రోన్ సంబంధి సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజల మేలు కై వినియోగించాలి అని కూడా ఆయన సూచించారు. 2014వ సంవత్సరం లో పరిచయం చేసిన ఎస్ఎమ్ఎఆర్ టి పోలీసింగ్ భావన పై ఎప్పటికప్పుడు సమీక్ష ను నిర్వహిస్తూ ఉండాలని, అందులో తరచు కొత్త కొత్త మార్పుల ను ప్రవేశపెట్టడం కోసం ఒక మార్గసూచీ ని అభివృద్ధిపరచాలని, మరి ఆ విధమైన మార్గసూచీ ని రక్షకభట బలగాల లో ఆచరణ లోకి తీసుకు రావాలని ఆయన స్పష్టం చేశారు. పోలీసు విభాగానికి రోజువారీ ఎదురవుతున్న సవాళ్ళ లో కొన్నిటి ని పరిష్కరించడం కోసం హ్యాకథన్ మాధ్యమం ద్వారా సాంకేతిక పరమైన పరిష్కార మార్గాల ను వెదకడం కోసం ఉన్నత సాంకేతిక విద్య ను ఆర్జించిన యువత ను ఈ ప్రక్రియ లో భాగస్తుల ను చేయవలసింది గా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఐబి సిబ్బంది లో విశిష్ట సేవలు అందించిన వారి కి రాష్ట్రపతి పోలీస్ పతకాన్ని ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. మొట్టమొదటి సారిగా ప్రధాన మంత్రి ఆదేశాల కు అనుగుణం గా విభిన్న రాష్ట్రాల ఐపిఎస్ అధికారులు సమకాలీన భద్రత అంశాల పై వారి వారి వ్యాసాల ను సమర్పించారు. ఈ వ్యాసాల తో సమావేశానికి గల ప్రాముఖ్యం మరింత గా పెరిగిపోయింది.

అంతక్రితం, 2021 నవంబర్ 19వ తేదీ న సమావేశాన్ని మాన్య హోం శాఖ కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఆయన దేశం లోని మూడు ఉత్తమమైన పోలీసు ఠాణాల కు ట్రాఫీల ను ప్రదానం చేసి సత్కరించారు. సమావేశం లో నిర్వహించి అన్ని చర్చల లోను మాన్య హోం శాఖ కేంద్ర మంత్రి పాలుపంచుకొని తన బహు మూల్యమైన సలహాల ను, మార్గదర్శకత్వాన్ని అందించారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones