న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని - 2024 (ఒకటో దశ) లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
‘‘రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని - 2024 (ఒకటో దశ) లో నేను పాలుపంచుకొన్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి గారు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. సాహసికులైన మన జవానుల పరాక్రమాన్ని, అంకిత భావాన్ని చూసుకొని మన దేశ ప్రజలు గర్విస్తున్నారు. సేవ, త్యాగం.. ఈ అత్యున్నత ఆదర్శాలకు మన సైనికులు ఉదాహరణగా నిలుస్తున్నారు. వారి ధైర్యం, వారి సాహసం మన ప్రజలకు ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.
Attended the Defence Investiture Ceremony-2024 (Phase-1) at Rashtrapati Bhavan, where Rashtrapati Ji presented the Gallantry Awards. Our nation is proud of the valour and dedication of our brave soldiers. They exemplify the highest ideals of service and sacrifice. Their courage… pic.twitter.com/LaQD27zhje
— Narendra Modi (@narendramodi) July 5, 2024