‘‘ఈ సంయుక్త కార్యక్రమం విభిన్న కాలాల్లో వేరు వేరు మాధ్యమాల ద్వారా ముందుకు సాగుతూ ఉన్నటువంటి భారతదేశం ఆలోచన యొక్క అమర యాత్ర కు ప్రతీక గా ఉంది’’
‘‘మన శక్తి కేంద్రాలు అనేవి కేవలం తీర్థస్థలాలో, నమ్మకం యొక్క కేంద్రాలో కావు, అవి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన యొక్క జాగృతసంస్థలు గా ఉన్నాయి’’
‘‘భారతదేశం లో మన మునులు మరియు గురువులు సదా మన ఆలోచనల ను పరిశుద్ధం చేశారు, వారు మన నడవడిక కు మెరుగులు దిద్దారు’’
‘‘శ్రీ నారాయణ గురు కులవాదం పేరిట కొనసాగుతూ ఉన్నటువంటి పక్షపాతాని కివ్యతిరేకం గా ఒక తార్కికమైనటువంటి మరియు ఆచరాణాత్మకమైనటువంటి యుద్ధాన్ని చేశారు. ప్రస్తుతం నారాయణగురు గారి కి చెందిన అదే ప్రేరణ తో దేశం పేదల కు, మోసపోయిన వర్గాల వారికి, వెనుకబడిపోయిన వర్గాల వారికి సేవలనుచేస్తూ, మరి వారికి వారి యొక్క హక్కుల ను ఇస్తున్నది’’
‘‘శ్రీ నారాయణ గురు ఒక సిద్ధాంతవాది ఆలోచనలు మూర్తీభవించిన వాడు, ఆచరణపరమైన సంస్కరణవాది కూడాను’’
‘‘ఎప్పుడైతే మనం సమాజాన్ని సంస్కరించే బాట లో నడచిముందుకు పోతూ ఉంటామో, అప్పుడు సమాజం లో స్వీయ మెరుగుదల తాలూకు శక్తి ఒకటి మేలుకొంటుంది; ‘బేటీ బచావో, బేటీ పఢావో’ దీనికి ఒక ఉదాహరణ గా ఉంది’’

శివగిరి తీర్థం యొక్క 90వ వార్షికోత్సవం మరియు బ్రహ్మ విద్యాలయం యొక్క స్వర్ణోత్సవం సందర్భం లో ఏడాది పొడవునా నిర్వహించేటటువంటి సంయుక్త కార్యక్రమాల కు సంబంధించి ఈ రోజున 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో జరిగిన ప్రారంభోత్సవం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. ఆయన ఏడాది పొడవునా సాగేటటువంటి సంయుక్త ఉత్సవానికి సూచకం గా ఒక గుర్తింపు చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. శివగిరి తీర్థయాత్ర, ఇంకా బ్రహ్మ విద్యాలయం.. ఈ రెండూ కూడా మహా సామాజిక సంస్కరణవాది శ్రీ నారాయణ గురు యొక్క ఆశీర్వాదం మరియు మార్గదర్శనం లో ఆరంభం అయ్యాయి. ఈ సందర్భం లో శివగిరి మఠాని కి చెందిన ఆధ్యాత్మిక నేత లు, భక్తుల కు తోడు కేంద్ర మంత్రులు శ్రీయుతులు రాజీవ్ చంద్రశేఖర్, వి. మురళీధరన్ లు, ఇతరులు పాల్గొన్నారు.

సాధువుల కు తన నివాసం లోకి స్వాగతం పలుకుతూ ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలు గా శివగిరి మఠం యొక్క సాధువుల ను మరియు భక్తుల ను కలుసుకోవడాన్ని గురించి, మరి అలాగే వారితో మాటలాడినప్పుడల్లా తనలో ఉత్సాహం నిండిపోవడాన్ని గురించి ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు. ఉత్తరాఖండ్-కేదార్ నాథ్ దుర్ఘటన జరిగినప్పుడు కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం, రక్షణ మంత్రి పదవి లో కేరళ కు చెందిన వ్యక్తి ఉన్నప్పటికి శివగిరి మఠం యొక్క సాధువులు సాయపడవలసిందంటూ అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న తన ను కోరిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. తాను ఈ విశేషమైన

సమ్మానాన్ని ఎన్నటికీ మరచిపోనని ప్రధాన మంత్రి అన్నారు.

శివగిరి తీర్థం యొక్క 90వ వార్షికోత్సవం మరియు బ్రహ్మ విద్యాలయం యొక్క స్వర్ణోత్సవం అనేవి ఆయా సంస్థ ల ప్రస్థానాని కే పరిమితం కావు. ‘‘ఇది వేరు వేరు కాలాల లో భిన్నమైన మాధ్యమాల ద్వారా ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి భారతదేశం భావాల యొక్క అమరమైన ప్రయాణం కూడాను’’ అని ఆయన అన్నారు. అది వారాణసీ లో శివుని నగరం కావచ్చును, లేదా వర్ కలా లోని శివగిరి కావచ్చును, భారతదేశం లో శక్తి యొక్క ప్రతి కేంద్రం మన భారతీయులు అందరి జీవనం లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. ఈ ప్రదేశాలు ఒక్క తీర్థ స్థలాలే కావు, అవి నమ్మకాని కి చెందిన కేంద్రాలు మాత్రమే కావు, అవి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన తాలూకు జాగృత సంస్థ లు కూడాను’’ అని ఆయన అన్నారు.

ప్రపంచం లో అనేక దేశాలు మరియు అనేక నాగరకత లు వాటి వాటి ధర్మ మార్గం నుంచి దారి తప్పిపోయినప్పుడు అధ్యాత్మ స్థానాన్ని భౌతిక వాదం లాగేసుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. మన భారతదేశం లో మునులు మరియు గురువులు ఎల్లప్పుడు మన ఆలోచనల ను, మన ప్రవర్తన ను శోధించి, వర్ధిల్లజేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ నారాయణ గురు ఆధునికత్వాన్ని గురించి మాట్లాడారు. అయితే దానితో పాటే ఆయన భారతీయ సంస్కృతి ని, భారతీయ విలువల ను కూడా సమృద్ధం చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన విద్య గురించి, విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడారు. అయితే, వాటితో పాటు ధర్మం యొక్క, నమ్మకం యొక్క వైభవాన్ని ఇనుమడింపజేయడంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. జడత్వానికి వ్యతిరరేకం గా, చెడుల కు విరుద్ధం గా శ్రీ నారాయణ గురు ఉద్యమం నడిపారు; భారతదేశం దాని వాస్తవికత ను గురించి తెలుసుకొనేటట్లు చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. కులవాదం పేరు తో సాగుతూ వచ్చిన భేదభావానికి వ్యతిరేకం గా ఆయన ఒక తర్కబద్ధమైనటువంటి మరియు ఆచరణాత్మకమైనటువంటి పోరు ను సలిపారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్’ మంత్రాన్ని వల్లిస్తూ దేశం ముందుకు కదులుతోంది అని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇవాళ నారాయణ గురూజీ యొక్క అదే ప్రేరణ తో ప్రస్తుతం పేదల కు, మోసపోయినవారి కి, వెనుకబడిపోయిన వారి కి దేశం సేవ చేస్తోంది, మరి వారికి వారికి చెందవలసిన అధికారాల ను ఇస్తున్నది అన్నారు.

శ్రీ నారాయణ గురు ను ఒక సిద్దాంతవాదయుక్త ఆలోచనపరుని గా, మరి అలాగే ఆచరణ సాధ్యమైన సంస్కరణల ను ప్రవేశపెట్టిన వ్యక్తి గా ప్రధాన మంత్రి స్మరించుకొంటూ, గురువు గారు ఎల్లప్పుడూ చర్చ తాలూకు మర్యాద ను పాటించే వారు; ఎల్లవేళ ల ఇతరుల భావనల ను అర్థం చేసుకోవడాని కి యత్నించే వారు. అప్పుడు ఆయన తన మాటల ను అర్ధం అయ్యే రీతి లో చెప్పే వారు. ఆయన సమాజం లో ఎటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసే వారు అంటే, అటువంటి వాతావరణం లో సమాజం తనంత తాను సరి అయిన అవగాహన తో పాటు గా ఆత్మ సంస్కరణ దిశ లో దూసుకుపోతుండేది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎప్పుడైతే మపం సమాజాన్ని సంస్కరించాలి అనేటటువంటి ఒక దారి లో నడవటం మొదలు పెట్టామో, అప్పుడు సమాజం లో కూడా ఆత్మసంస్కరణ తాలూకు శక్తి సైతం మేలుకొనేది అని ప్రధాన మంత్రి వివరించారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచార ఉద్యమాన్ని సంఘం స్వీకరించిన ఉదాహరణ ను గురించి ఆయన చెప్తూ, సరి అయినటువంటి వాతావరణాన్ని ఏర్పరచడాని కి ప్రభుత్వం చొరవ తీసుకోగానే స్థితిగతుల లో వేగం గా మెరుగుదల రావడం మొదలైంది అన్నారు.

భారతీయులుగా మన అందరికి ఒకే కులం ఉంది. అదే భారతీయత అని ప్రధాన మంత్రి అన్నారు. మన అందరి ది ఒకే ధర్మం, అది సేవాధర్మం ఇంకా కర్తవ్యాల పాలన. మన అందరి కి ఒకే దైవం ఉంది, ఆ దైవం భరత మాత అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ నారాయణ గురు ఉద్బోధించినటువంటి ‘ఒక కులం, ఒక ధర్మం, ఒక దైవం’ అనే సందేశం మన దేశభక్తి వాదాని కి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పార్శ్వాన్ని జోడించింది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మన అందరి కి తెలిసిన విషయం ఏమిటి అంటే అది, ప్రపంచం లోని ఏ లక్ష్యం అయినా సరే ఏకతా బంధం లో పెనవేసుకున్న భారతీయుల కు అసంభవం కాదు అనే విషయం’’ అని ఆయన అన్నారు.

‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న ప్రస్తుత కాలం లో ప్రధాన మంత్రి మరొక్క సారి స్వాతంత్య్ర పోరాటం తాలూకు తన విశ్లేషణ ను ఆవిష్కరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, స్వాతంత్య్ర పోరాటం సదా ఆధ్యాత్మికమైన పునాది పైన ఆధారపడి ఉంది. ‘‘మన స్వాతంత్య్ర పోరాటం నిరసన ను వ్యక్తం చేయడానికో, రాజకీయ వ్యూహాల ను అమలు పరచడానికో పరిమితమైంది కాదు. అది బానిసత్వ సంకెళ్ళ ను తెంచుకోవడాని కి జరిగిన పోరాటమే అయినప్పటి కీ, దానితో పాటు గా స్వాతంత్య్ర దేశం గా మనం ఏర్పడుతాం, ఏ విధం గా నడుచుకోబోతున్నాం అనే ఆలోచన కూడా ఆ పోరాటం లో ఉండింది; అది ఎటువంటిది అంటే మనం ఏ ఆలోచనలతో ఉన్నాం,ఏ ఆలోచన కోసం ఒక్కటి అయ్యాం, ఈ అంశాలు కూడాను ఎంతో ముఖ్యమైనటువంటివి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్ర్య పోరాటం లో మహారథులు శ్రీ నారాయణ గురు, గురుదేవులు రబీంద్రనాథ్ టాగోర్, గాంధీ జీ, స్వామి వివేకానంద్, ఇంకా ఇతర మహానుభావుల యుగ ప్రవర్తక భేటీ ని ప్రధాన మంత్రి స్మరణ కు తెచ్చుకొన్నారు. ఆ మహనీయులు వేరు వేరు సందర్భాల లో శ్రీ నారాయణ గురు తో సమావేశాలు జరిపారు. మరి ఈ సమావేశాల లో భారతదేశం యొక్క పునర్ నిర్మాణాని కి బీజాలు పడ్డాయి. వాటి పరిణామాలు ఈ రోజు న భారతదేశం లో మరియు దేశం యొక్క 75 సంవత్సరాల యాత్ర లో ప్రతిబింబిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. పది సంవత్సరాల తరువాత శివగిరి తీర్థం స్థాపన, మరి ఇరవై అయిదేళ్ల తరువాత భారతదేశాని కి స్వాతంత్య్రం సిద్ధించడం.. ఈ రెండు ఘటనలు కూడాను వాటి వాటి యొక్క వంద సంవత్సరాల ఉత్సవాల ను జరుపుకొంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వందేళ్ల యాత్ర లో మన కార్యసాధన లు ప్రపంచ స్థాయి లో ఉండాలి, మరి దీనికోసం మన దృష్టికోణం కూడా ప్రపంచ స్థాయి ని సంతరించుకోవలసి ఉంది అని ఆయన అన్నారు.

 

శివగిరి తీర్థయాత్ర ను తిరువనంతపురం లోని శివగిరి లో ప్రతి సంవత్సరం లో డిసెంబర్ నెల 30వ తేదీ మొదలుకొని జనవరి 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీ నారాయణ గురు చెప్పిన ప్రకారం, తీర్థయాత్ర యొక్క ఉద్దేశ్యం ప్రజల లో విస్తృత జ్ఞానాన్ని ప్రసరింపచేయడం మరియు వారి సమగ్ర అభివృద్ధి కి, సమృద్ధి కి తోడ్పడడమూను. ఈ కారణం గా ఈ తీర్థ యాత్ర ఎనిమిది అంశాల పైన శ్రద్ధ వహిస్తుంది. ఆ ఎనిమిది విషయాలు ఏవేవి అంటే అవి విద్య, స్వచ్ఛత, ధర్మపరాయణత్వం, చేతివృత్తులు, వ్యాపారం, ఇంకా వాణిజ్యం, వ్యవసాయం, విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం లతో పాటు సంఘటిత ప్రయాస లు అనేవే.

కొద్ది మంది భక్తుల తో 1933వ సంవత్సరం లో ఈ తీర్థయాత్ర ను మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశం లో ప్రస్తుతం ఇది ప్రధానమైన కార్యక్రమాల లో ఒకటి గా మారిపోయింది. ప్రతి సంవత్సరం లో ప్రపంచ వ్యాప్తం గా లక్షల కొద్దీ భక్త జనులు వారు ఏ కులం, ఏ వర్గం, ఏ ధర్మం మరియు ఏ భాష కు చెందిన వారు అనే వాటికి అతీతం గా తీర్థయాత్ర లో పాల్గొనడం కోసం శివగిరి కి తరలి వస్తున్నారు.

అన్ని ధర్మాల సిద్ధాంతాలను సమానమైన విధం గా నేర్పించాలని శ్రీ నారాయణ గురు తలచారు. ఈ దృష్టికోణాన్ని సాకారం చేయడం కోసం శివగిరి లో బ్రహ్మ విద్యాలయాన్ని స్థాపించడమైంది. బ్రహ్మ విద్యాలయ లో శ్రీ నారాయణ గురు యొక్క కార్యాలు, ప్రపంచం లోని అన్ని ప్రధాన ధర్మాల గ్రంథాలు సహా భారతీయ తత్వశాస్త్రం పై 7 సంవత్సరాల పాఠ్యక్రమాన్ని బోధించడం జరుగుతున్నది.

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage