‘‘భారతదేశం యొక్కయువత తో మొట్టమొదటి సార్వజనిక సమావేశం లో పాలుపంచుకొంటున్నందుకు నాకు సంతోషం గాఉంది’’
‘‘భారతిదాసన్విశ్వవిద్యాలయాన్ని ఒక బలమైనటువంటి మరియు పరిపక్వమైనటువంటి పునాది తో ప్రారంభించడంజరిగింది’’
‘‘ఏ దేశ ప్రజల కుఅయినా సరే దిశ ను చూపించడం లో ఒక కీలకమైన పాత్ర ను విశ్వవిద్యాలయాలు పోషిస్తాయి’’
‘‘మన దేశ ప్రజలుమరియు మన దేశ నాగరకత ఎల్లవేళ ల జ్ఞానం చుట్టూరా పరిభ్రమిస్తూ వస్తున్నాయి’’
‘‘2047 వ సంవత్సరం వరకుమన ముందున్న కాలాన్ని మన చరిత్ర లో అత్యంత ముఖ్యమైన కాలం గా తీర్చిదిద్దేసామర్థ్యం యువజనుల లో ఉందన్న విశ్వాసం నాకు ఉంది’’
‘‘యువత అంటే శక్తిఅని అర్థం. యువత అంటేవేగం గా, నేర్పు గా మరియుపెద్ద స్థాయి లో పనిచేయ గలిగిన సామర్థ్యం అని కూడా చెప్పుకోవచ్చు’’
‘‘ప్రతి ఒక్క ప్రపంచ స్థాయి పరిష్కారాల లో ఒక భాగం మాదిరి గా భారతదేశాన్ని ఆహ్వానించడం జరుగుతోంది’’
‘‘స్థానిక అంశాల నుమరియు ప్రపంచ స్థాయి అంశాల ను పట్టి చూస్తే, ఇది ఎన్నో విధాలు గా భారతదేశం లోని యువతీ యువకుల కు అత్యుత్తమమైనటువంటి కాలం వలెఉంది’’

తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. విశ్వవిద్యాలయం లో ప్రతిభావంతులు అయిన విద్యార్థుల కు పురస్కారాల ను కూడా ఆయన ప్రదానం చేశారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవం క్రొత్త సంవత్సరం అయిన 2024 లో తాను పాలుపంచుకొంటున్న ఒకటో సార్వజనిక సమావేశం అయినందువల్ల అది ఎంతో విశిష్టమైంది గా ఉందని వ్యాఖ్యానించారు. సుందరమైన తమిళ నాడు రాష్ట్రంలో, మరి ఈ రాష్ట్రం యొక్క యువతీ యువకుల మధ్య కు తాను రావడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతిదాసన్ విశ్వవిద్యాలయం లో పట్టభద్రులు అవుతున్న విద్యార్థుల కు, వారి గురువుల కు మరియు వారి తల్లితండ్రుల కు హృదయ పూర్వక అభినందనల ను ప్రధాన మంత్రి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లో పాల్గొంటున్న ఒకటో ప్రధాన మంత్రి తాను కావడం తనకు సంతృప్తి గా ఉందన్నారు.

ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అంటే సాధారణం గా చట్టపరమైన ప్రక్రియ ను అనుసరించడం జరుగుతుంది; మరి క్రమం గా క్రొత్త కళాశాలల ను ఆ విశ్వవిద్యాలయాని కి అనుబంధం చేయడం పరిపాటి; ఆ విధం గా విశ్వవిద్యాలయం వృద్ధి చెందుతుంది, అయితే భారతిదాసన్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం కోసం మరియు అనేక రంగాల లో ప్రభావాన్ని ఆ విశ్వవిద్యాలయం ప్రసరించడం కోసం- అప్పటికే నడుస్తున్న అనేక ప్రఖ్యాత కళాశాలల ను ఒక చోటు కు చేర్చడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘మన దేశ ప్రజలు మరియు మన దేశ నాగరకత ఎల్లవేళ ల జ్ఞానం కేంద్ర బిందువు గా విస్తరించడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నాలంద మరియు తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల ను గురించి ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. కాంచీపురం, గంగైకొండ చోళపురం మరియు మదురై లను గురించి కూడా ఆయన ప్రస్తావించి, అవి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల కు నిలయం అయ్యాయి, ప్రపంచవ్యాప్తం గా విద్యార్థులు తరచు గా అక్కడ కు వచ్చే వారు అన్నారు.

స్నాతకోత్సవాన్ని నిర్వహించడం అనేది ప్రాచీన భావన అని ప్రధాన మంత్రి చెప్తూ, తమిళ్ సంగమాన్ని గురించిన ఉదాహరణ ను ఇచ్చారు; తమిళ్ సంగమం లో కవులు మరియు మేధావులు విశ్లేషణ కోసం ప్రభుత్వాన్ని మరియు సాహిత్యాన్ని సమర్పించారు. దీనితో ఆయా రచనల కు ఒక విశాల సమాజం గుర్తింపు దక్కేందుకు వీలు ఏర్పడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదే తర్కాన్ని విద్య రంగం లో మరియు ఉన్నత విద్య రంగం లో ఈ రోజు కు కూడా ను అవలంబించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘జ్ఞానం యొక్క మహా చారిత్రక సంప్రదాయం లో యువ విద్యార్థులు ఒక భాగం గా ఉన్నారు.’’ అని ఆయన అన్నారు.

 

దేశ ప్రజల కు దిశ ను చూపెట్టడం లో విశ్వవిద్యాలయాల పాత్ర ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, చైతన్యశీలం అయినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్న కారణం గా దేశ ప్రజలు మరియు నాగరకత ఏ విధం గా హుషారు గా మారినదీ వివరించారు. దేశం దాడి కి గురి అయినప్పుడల్లా ఆ దేశం లో జ్ఞాన వ్యవస్థ ను లక్ష్యం గా చేసుకోవడం జరిగింది అని కూడా ఆయన చెప్పారు. మహాత్మ గాంధీ, పండిత్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ మరియు సర్ శ్రీ అన్నామలై చెట్టియార్ లను గురించి ప్రధాన మంత్రి పేర్కొని, వారు 20వ శతాబ్దం మొదట్లోనే విశ్వవిద్యాలయాల ను ఆరంభించారు. ఆ విశ్వవిద్యాలయాలు స్వాతంత్య్ర పోరాటం కాలం లో జ్ఞానాని కి మరియు జాతీయవాదాని కి కేంద్రాలు గా మారాయి అని తెలిపారు. అదే విధం గా భారతదేశం యొక్క ఉన్నతి కి వెనుక ముఖ్య పాత్ర ను పోషించిన అంశాల లో భారతదేశం విశ్వవిద్యాలయాల వృద్ధి కూడా ఒక అంశం అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్థిక వృద్ధి లో భారతదేశం రికార్డుల ను నెలకొల్పడాన్ని గురించి, భారతదేశం ప్రపంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న అయిదో ఆర్థిక వ్యవస్థ గా రూపొందడాన్ని గురించి మరియు భారతదేశం లోని విశ్వవిద్యాలయాలు ఇది వరకు ఎన్నడు లేనంత ఎక్కువ సంఖ్య లో గ్లోబల్ ర్యాంకింగు ను చేజిక్కించుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

విద్య యొక్క పరమార్థం ఏమిటి? మరి పండితుల కేసి సమాజం ఏ విధం గా దృష్టి ని సారిస్తుంది అనే విషయాల ను గురించి దీర్ఘం గా ఆలోచన చేయండంటూ యువ విద్యార్థుల ను ప్రధాన మంత్రి కోరారు. మన చుట్టు ప్రక్కల ఉన్న వాతావరణం తో సద్భావన ను కలిగి ఉంటూ మనుగడ ను సాగించడం ఎలా గన్న విషయాన్ని విద్య ఏ విధం గా బోధిస్తుందో తెలిపిన గురుదేవులు శ్రీ రబీంద్రనాథ్ టాగోర్ మాటల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఉదాహరించారు. విద్యార్థులు వారు ఈ రోజు న చేరుకొన్న స్థితి లో యావత్తు సమాజం పోషించినటువంటి ఒక భూమిక ఉందని ఆయన పేర్కొంటూ, వారు తిరిగి సమాజాని కి ఇవ్వవలసింది ఎంతో ఉంది, వారు ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని మరియు ఒక ఉత్తమమైనటువంటి దేశాన్ని నిర్మించాలి అని ఆయన సూచించారు. ‘‘ఒక రకం గా ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్క పట్టభద్రుడు/ ప్రతి ఒక్క పట్టభద్రురాలు 2047 వ సంవత్సరాని కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించడానికి వారి వంతు తోడ్పాటు ను అందించవచ్చును.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

దేశ చరిత్ర లో ఇప్పటి నుండి 2047 వ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని అత్యంత ముఖ్యమైన కాలం గా మార్చగలిగిన దక్షత యువజనుల లో ఉందన్న తన విశ్వాసాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘ధైర్యం, సాహసాలు కలిగినటువంటి నూతన ప్రపంచాన్ని మనం కలసికట్టు గా ఏర్పరచుదాం’ అనే విశ్వవిద్యాలయం యొక్క ఆదర్శ వాక్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆ కోవ కు చెందిన ప్రపంచాన్ని భారతదేశం లోని యువత ఇప్పటికే రూపొందిస్తున్నారు అని పేర్కొన్నారు. మహమ్మారి కాలం లో టీకామందుల ను తయారు చేయడం లో, చంద్రయాన్ లో, ఇంకా 2014 వ సంవత్సరం లో 4000 లుగా ఉన్న పేటెంట్ ల సంఖ్య ను ప్రస్తుతం దాదాపు గా 50,000 లకు వృద్ధి చెందడం లో భారతదేశం లోని యువజనుల తోడ్పాటు ను గురించి ఆయన వివరించారు. మానవ విజ్ఞాన శాస్త్రాల ను అధ్యయనం చేసిన భారతదేశం యొక్క విద్యార్థులు భారతదేశం గాథ ను ఇది వరకు ఎరుగని విధం గా కళ్ళ కు కడుతున్నారు అని కూడా ఆయన అన్నారు. క్రీడాకారిణుల/ క్రీడాకారుల, సంగీత కారుల, కళాకారుల యొక్క కార్యసాధనల ను గురించి సైతం ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘ప్రతి ఒక్క రంగం లోను ఒక క్రొత్త ఆశ తో మీకేసి ప్రతి ఒక్కరు దృష్టి సారిస్తున్నటువంటి ప్రపంచం లోకి మీరు అడుగు పెడుతున్నారు సుమా’’ అని ఆయన అన్నారు.

‘‘యువత అంటేనే శక్తి అని అర్థం. యువత అంటే వేగం గాను, నేర్పు తోను మరియు విస్తృత స్థాయి లోను పని చేయగలిగినటువంటి దక్షత అని కూడా అర్థం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. విద్యార్థుల తో అంతే వేగం తో, అంతే విస్తృతి తో తులతూగడం కోసం ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల లో పాటుపడుతోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దేశం లో విమానాశ్రయాల ను 74 నుండి సుమారు 150 కి రెట్టింపు చేయడాన్ని గురించి; అన్ని ప్రధానమైన ఓడరేవుల లో సరకు హేండిలింగ్ కెపాసిటీ ని రెండింతలు గా చేయడాన్ని గురించి; హైవే ల నిర్మాణ వేగాన్ని, హైవేల నిర్మాణ స్థాయి ని రెట్టింపు చేయడాన్ని గురించి; 2014 వ సంవత్సరం లో 100 కు లోపు ఉన్న స్టార్ట్-అప్స్ యొక్క సంఖ్య కాస్తా దాదాపు గా ఒక లక్ష కు వృద్ధి చెందడాన్ని గురించి ప్రధాన మంత్రి తెలిపారు. ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ లు గా పేరొందిన దేశాల తో అనేక వ్యాపార ఒప్పందాల ను భారతదేశం కుదుర్చుకోవడం, తద్ద్వారా భారతదేశం యొక్క వస్తువుల కు మరియు సేవల కు సరిక్రొత్త బజారులు అందుబాటు లోకి రావడం సహా యువత కు లెక్కపెట్టలేనన్ని అవకాశాల ను సృష్టిస్తూ ముందుకు పోవడం గురించి కూడా ఆయన మాట్లాడారు. జి-20 వంటి సంస్థల ను బలోపేతం చేయడం లో, జలవాయు పరివర్తన పై పోరాడడం లో, ప్రపంచ సరఫరా వ్యవస్థ లో మరింత పెద్దదైన పాత్ర ను పోషించడం లో, ఇతరేతర ప్రపంచ స్థాయి పరిష్కారాల లో పాలుపంచుకోవలసింది గా భారతదేశాన్ని ఆహ్వానించడం జరుగుతోందని ఆయన అన్నారు. ‘‘స్థానిక అంశాల మరియు ప్రపంచ అంశాల ను బట్టి చూస్తే, భారతదేశం లో యువతీ యువకుల కు అనేక విధాలు గా ఇది అత్యుత్తమమైనటువంటి కాలం గా ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కాలాన్ని వీలైనంత ఎక్కువ గా వినియోగించుకోవలసింది గాను మరియు దేశాన్ని సరిక్రొత్త శిఖరాల కు చేర్చవలసింది గాను విద్యార్థుల కు ఆయన విజ్ఞప్తి చేశారు.

 

విశ్వవిద్యాలయం యొక్క ప్రయాణం ఈ రోజు తో ముగింపున కు వస్తోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, నేర్చుకోవాలన్న ప్రయాణానికి ముగింపు అంటూ ఉండదు అని నొక్కి చెప్పారు. ‘‘ఇప్పుడిక జీవనమే మీకు గురువు అవుతుంది’’ అని ఆయన అన్నారు. నిరంతరం నేర్చుకొంటూ ఉండాలి అనే భావన ను అలవరచుకొని అప్‌లర్నింగ్, రీస్కిలింగ్, అప్‌స్కిలింగ్ లలో ముందస్తు గా చొరవ ను తీసుకోవడం ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. ‘‘శరవేగం గా మారుతున్నటువంటి ప్రపంచం లో, అయితే మీరు మార్పునకు చోదక శక్తి గా ఉండడమో లేదా మార్పు మిమ్ముల ను ముందుకు తీసుకుపోవడమో జరుగుతుంది’’ అని చెప్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

 

ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు మరియు భారతిదాసన్ విశ్వద్యాలయం యొక్క చాన్స్ లర్ శ్రీ ఆర్.ఎన్. రవి, తమిళ నాడు యొక్క ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్, వైస్ చాన్స్ లర్ డాక్టర్ శ్రీ ఎమ్. సెల్వమ్ మరియు ఇంకా ప్రో-చాన్స్ లర్ శ్రీ ఆర్.ఎస్. రాజకణ్ణప్పన్ లు పాలుపంచుకొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi